గోల్కొండ బోనాలకు తొలిసారిగా డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!

Publish Date:Jul 21, 2026

Advertisement

 

హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో జరుగుతున్న శ్రీ జగదాంబికా అమ్మవారి బోనాల మహోత్సవాల సందర్భంగా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు విస్తృత స్థాయిలో ట్రాఫిక్ బందోబస్తు చేపట్టారు. జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీ.సీ. సజ్జనార్ ఆదేశాల మేరకు, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ డి. జోయెల్ డేవిస్ పర్యవేక్షణలో ట్రాఫిక్ నిర్వహణ కొనసాగుతోంది. ఈసారి తొలిసారిగా డ్రోన్ సర్వైలెన్స్‌ను వినియోగిస్తూ గోల్కొండ కోట పరిసరాల్లో ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తున్నారు. 

డ్రోన్ల సహాయంతో ప్రధాన ట్రాఫిక్ మళ్లింపు కేంద్రాలు, పార్కింగ్ ప్రాంతాలు, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను నిరంతరం పరిశీలిస్తూ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడకుండా తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా, ముందుగా ప్రకటించిన ట్రాఫిక్ మళ్లింపులు సక్రమంగా అమలవుతున్నాయా అనే విషయాన్ని కూడా డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాల రద్దీ, అనధికార పార్కింగ్‌ను గుర్తించి అవసరమైన సూచనలు ఇస్తున్నారు.

 ఖాళీగా ఉన్న పార్కింగ్ స్థలాలపై సమాచారాన్ని అందిస్తూ భక్తులకు మరింత సౌకర్యం కల్పిస్తున్నారు. గోల్కొండ కోటకు వెళ్లే ప్రధాన రహదారులు, అంతర్గత మార్గాలు, భక్తులు అధిక సంఖ్యలో గుమికూడే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆటంకాలను వెంటనే గుర్తించి, క్షేత్రస్థాయి సిబ్బందితో తక్షణ నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. డ్రోన్ సాంకేతికత వినియోగంతో ట్రాఫిక్ పరిస్థితులపై సమగ్ర అవగాహన లభిస్తోందని, బోనాల ఉత్సవాలకు వచ్చే భక్తులు, సాధారణ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా సురక్షితంగా, వేగంగా గమ్యస్థానాలకు చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

Golconda Bonalu, Sri Jagadambika Ammavari Bonalu, Hyderabad Traffic Police, Drone Surveillance, Traffic Monitoring, V. C. Sajjanar, D. Joel Davis, Bonalu Festival, Smart Traffic Management, Hyderabad City

By
en-us Political News

  
నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో ఆందోళనలు చేపడుతున్న విద్యార్థులు, యువతకు మద్దతుగా నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ కేంద్ర ప్రభుత్వానికి కీలక లేఖ రాశారు
నవ ఢిల్లీలోని చారిత్రాత్మక నిరసన వేదిక జంతర్ మంతర్ కేంద్రంగా ఇటీవల వెలుగులోకి వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఉద్యమం దేశ రాజకీయ విశ్లేషకుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో నైరుతి రుతుపవన ద్రోణి చురుగ్గా కదులుతుండటంతో రాగల రెండు రోజుల పాటు తెలంగాణవ్యాప్తంగా వానలు దంచికొట్టనున్నాయి.
నీట్ పేపర్ లీకేజీకి వ్యతి రేకంగా ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు అమానుషంగా లాఠీచార్జ్ చేయడాన్ని తెలంగాణ రక్షణ చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు.
నీట్ వివాదం వేళ విద్యాశాఖ మంత్రి పాత పోరాటాలు..!
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన శాంతియుత నిరసనలు, పోలీసుల లాఠీఛార్జ్ వ్యవహారం ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం మెట్లుక్కింది.
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్టు చేశారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖలో మరియు జాతీయ పరీక్షా వ్యవస్థలో చోటుచేసుకుంటున్న వరుస అక్రమాలు, అవకతవకలకు నిరసనగా విద్యార్థి సంఘాలు పోరాటబాట పట్టాయి.
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ఆహ్వానం..!
10 ఏళ్లలో 152 లీకేజీలు..రాహుల్ సంచలన ఆరోపణలు..!
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తన అధికారిక ఎక్స్ (X) వేదికగా తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించిన తాజా ఊరటపై స్పందించారు.
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సినిమా షూటింగ్ సందర్భంగా ప్రమాదానికి గురై ఎడమ మోకాలికి గాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సహజ వనరుల నిర్వహణ, ముఖ్యంగా ఇసుక విధానం అనేది కేవలం ఒక పరిపాలనా నిర్ణయంగా కాకుండా ప్రభుత్వాల భవిష్యత్తును తేల్చే అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.