ఈ దేవుళ్ల‌కు ద‌యే లేదు..

Publish Date:Jul 11, 2022

Advertisement

ఆస్ప‌త్రులు దేవాల‌యాలు, డాక్ట‌ర్లు దేవుళ్లు, ఆస్ప‌త్రుల్లో ప‌నివాళ్లు మాన‌వ‌త్వానికి చిరునామాలు.. ఏదో తెలుగు పాఠం చెబుతున్న‌ట్టుగా వుందిగ‌దూ. నిజంగానే అదంతా పుస్త‌కాల్లో, ప్ర‌సంగాల్లో వుంటుంది. వాస్త‌వంలో అంత వుండ‌దు. అక్క‌డ‌క్క‌డా అందుకు పూర్తి భిన్నంగా, అరాచ‌కంగానూ వుంటుంది.  అం దుకు తాజా వుదాహ‌రణ మ‌ధ్య‌ప్ర‌దేశ్ మోరెనా ప‌ట్ట‌ణంలోని ఈ పిల్లాడి దుస్థితి. మీరు ఫొటోలో చూస్తు న్న‌ది ఓ పిల్లాడు మ‌రో పిల్లాడిని ప‌డుకోబెట్టుకుని వున్న‌ది. వాడేమీ జ‌నాన్ని మోసం చేసి డ‌బ్బుల‌కు  అలా కూచో లేదు. జీవితాంతం త‌న‌తో వుంటాడ‌నుకున్న త‌మ్ముడి మృత దేహం అది. అవును. వాడి పేరు గుల్హ‌న్‌, ఒళ్లో మృత‌దేహం వాడి తమ్ముడు రెండేళ్ల రాజాది. 

మధ్యప్రదేశ్ రాష్ట్రం మోరెనా పట్టణంలో జరిగింది. అంబాహ్ లోని బద్ ఫ్రా గ్రామానికి చెందిన పూజారామ్ జాతవ్ తన కొడుకు వైద్యం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చాడు. రెండేళ్ల పిల్ల వాడు తీవ్రమైన రక్తహీనత, కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ  చికిత్స తీసుకుంటున్న సమ యంలో మరణించాడు. కుమారుడు మరణించడంతో సొంత గ్రామానికి తీసుకెళ్లే స్తోమత లేకపోవడంతో ఆస్పత్రి సిబ్బందిని అంబులెన్స్ సమకూర్చాలని అడిగినా.. ఆ నిరుపేద తండ్రి మాటలు పట్టించుకునే వారు కురువయ్యారు. 30 కిలోమీటర్లు ఉన్న సొంత గ్రామానికి తీసుకెళ్లేందుకు వాహనం కోసం వెతికేందుకు తండ్రి వెళ్లాడు. తన ఎనిమిదేళ్ల కుమారుడు గుల్షాన్ ను మరణించిన తన కొడుకు రెండేళ్ల రాజాను స్థాని కంగా ఉన్న నెహ్రూ పార్క్ ముందు వదిలిపెట్టాడు. తన ఒళ్లో తమ్ముడి శవాన్ని పెట్టుకుని, ఈగలు వాలకుండా చూసుకుంటున్న ఆ పిల్లాడి నిస్సహాయత అందర్ని కంటతడి పెట్టిస్తోంది. 

ఇది నిజంగానే హృదయవిదారకం. దేశంలో ప్రభుత్వం ఆస్పత్రులు, సదుపాయాలను ప్రశ్నించే ఘటన. పేదోళ్లకు కనీస వైద్యం, సౌకర్యాలు అందుతున్నాయో లేదో తెలిపే ఓ సన్నివేశం. ప్రస్తుతం దేశంలో వైరల్ గా మారింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఘటన యావత్ దేశాన్ని ప్రశ్నిస్తోంది. ప్రభుత్వం ఆస్పత్రి సిబ్బంది వాహనాన్ని సమకూర్చకపోగా.. బయటకు వెళ్లి డబ్బు చెల్లించి వాహనాన్ని మాట్లాడు కోవాలని ఉచిత సలహా ఇచ్చారు. ఆస్పత్రి ఆవరణలో ఉన్న అంబులెన్స్ రూ.1500 చెల్లించితే సొంతూ రుకు తీసుకెళ్తా అని చెప్పాడు. అయితే అది కూడా చెల్లించే స్తోమత పూజారామ్ జాతవ్ దగ్గర లేదు. అరగంట పాటు అక్కడే తన తండ్రి కోసం ఒడిలో తమ్ముడి శవాన్ని పెట్టుకుని గోడ పక్కన కూర్చుండి పోయాడు గుల్షాన్. ఈ ఘటనను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీస్ అధికారి యోగేంద్ర సింగ్ మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించి అంబులెన్స్ ఇచ్చి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

By
en-us Political News

  
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.