తెలంగాణలో ముందస్తు ఇక లేనట్లే!

Publish Date:Jul 11, 2022

Advertisement

ఉభయ తెలుగు రాష్ట్రాలలో ముందస్తు ఎన్నికల చర్చ, చాలాకాలంగా సాగుతోంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, రేవంత్ రెడ్డి అయితే, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో ముడి పెట్టి, వచ్చే సంవత్సరం మే నెలలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు,  జూన్ లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఖాయమన్నరీతిలో పార్టీని, క్యాడర్ ను సన్నద్ధం చేస్తున్నారు. ఆలశించిన ఆశా భంగం అన్న తీరున ఇతర పార్టీల నుంచి అభ్యర్ధులను పట్టుకొచ్చుకుంటున్నారు.

 అలాగే, బీజేపీ నాయకులు కూడా  ముందస్తుకు సిద్ధమన్న సంకేతాలు ఇస్తున్నారు. ఇటీవల జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప  సభలో, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పరోక్షంగానే అయినా, ముందస్తు ఎన్నికలకు తాము సిద్ధమని సంకేతాలు ఇచ్చారు. ఎన్నికలకు ఎప్పుడు వెళతారో మీ ఇష్టం. ఎన్నికలు ఎప్పుడు జరిగినా, విజయం మాత్రం బీజేపీదే అని  కేసీఆర్ ను ఉద్దేశించి పేర్కొన్నారు. అలాగే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్, బీజేపీ ఇతర కీలక నేతలు కూడా ఈ రోజుకు ఈ రోజు  ఎన్నికలు వచ్చినా .. ఢీ అంటే ఢీ అనేందుకు, రెఢీగా  ఉన్నామని ప్రకటనలు చేస్తున్నారు. 

అయితే, ముందస్తు ఎన్నికల ఆలోచన, అవసరం రెండూ తెరాసకు లేవని, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇంతకు ముందు అనేక మార్లు స్పష్టం చేశారు. కానీ, తాజాగా, ముఖ్యమంత్రి కేసేఅర్ ప్రతిపక్ష పార్టీలు ముందస్తు ఎన్నికలకు సిద్ధమైతే.. అసెంబ్లీని రద్దు చేయడానికి తాను కూడా సిద్ధమేనని సవాలు విసిరారు. అసలు రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలకు  ముందస్తుకు వెళ్లే ధైర్యముందా..? అని కేసీఆర్ ప్రతిపక్ష పక్ష పార్టీల నాయకులను ఎద్దేవా చేశారు. అయితే, చాంతాడంత రాగం తీసి చివరకు అదేదో పాట పాడినట్లు, ముఖ్యమంత్రి సవాలు చేసి, ప్రతిపక్షాలను ఎద్దేవ చేసి, చివరకు, తానూ అసెంబ్లీ రద్దు చేయాలంటే, అందుకు షరతులు వర్తిస్తాయి అన్నారు. బీజేపీ ముందుగా ఎన్నికల తేదీలను ఖరారు చేసి, ముందస్తుకు వస్తే, తాను అసెంబ్లీ రద్దు చేసి, ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్దమని స్పష్టం చేశారు.

ఆంటే ముందస్తుకు వెళ్ళడమా అలేదా అనేది నిర్ణయించే అధికారం తమ చేతుల్లో లేదని కొంచెం ఆలస్యంగానే అయినా ముఖ్యమత్రి గుర్తించారని, పరిశీలకులు అంటున్నారు. అయితే ఎప్పుడైతే ముఖ్యమంత్రి, ముందస్తుకు షరతులు వర్తిస్థాయనే మాట అన్నారో, అప్పుడే ఆయన, ముందస్తు ఎన్నికల ఆలోచన నుంచి వెనకడుగు వేశారనే విషయం స్పష్టంగా తెలిసి పోయిందని,  విశ్లేషకులు భావిస్తున్నారు. 2018 లో ముందస్తుకు వెళ్లేముందు, ఆయన ప్రతిపక్షాల అనుమతి తీసుకుని ముందస్తుకు వెళ్ళారా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే, రోజు రోజు కు ఇంటా బయట సమస్యలు చుట్టుముట్టి, ఇబ్బందులు  పెడుతున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగానే ఉన్నారని, అయితే, అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం, వెంటనే ఎన్నికలు ప్రకటించక పోయినా, కేంద్ర ప్రభుత్వం ఏదో వంకన రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించినా, పరిస్థితులు చేజారిపోయే ప్రమాదం లేక పోలేదని, ముఖ్యమంత్రి సందేహిస్తున్నారని అంటున్నారు. సో .. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఇక లేనట్లేనని, పరిశీలకులు భావిస్తున్నారు.

By
en-us Political News

  
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.