గోవా–హైదరాబాద్ డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు

Publish Date:Jun 16, 2026

Advertisement

 

తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా పనిచేస్తున్న ఈగల్ ఫోర్స్ అంతర్రాష్ట్ర డ్రగ్స్ నెట్‌వర్క్‌ను బహిర్గతం చేసింది. గోవా కేంద్రంగా హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన మాదకద్రవ్యాల ముఠాపై చేపట్టిన మెగా ఆపరేషన్‌లో 19 మంది వినియోగదారులు అరెస్ట్ అయ్యారు. వీరిలో 14 మందికి నిర్వహించిన డ్రగ్ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు వెల్లడించారు.

దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం ఈ నెట్‌వర్క్ బెంగళూరు నుంచి కొకైన్, ఎండీఎంఏ పిల్స్, ఎల్‌ఎస్‌డీ వంటి మత్తు పదార్థాలను గోవాకు తరలించి అక్కడి నుంచి హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. అలాగే ఒడిశా నుంచి హాష్ ఆయిల్‌ను తెప్పించి నగరంలోని వివిధ ప్రాంతాల్లో విక్రయాలు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. గోవాలోని వాగటర్ బీచ్ ప్రాంతంలో ఉన్న ఒక హోటల్‌ను లీజుకు తీసుకుని దాన్ని డ్రగ్స్ నిల్వ కేంద్రంగా మరియు పంపిణీ హబ్‌గా ఉపయోగించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

ప్రధాన నిందితుడు చక్రి హైదరాబాద్‌లోని సినీ పరిశ్రమకు కొకైన్ సరఫరా చేసినట్లు ఆధారాలు లభించాయని అధికారులు తెలిపారు. అతనితో పాటు హర్షిత్ రెడ్డి మరియు సుశీల్ కృష్ణ ఈ మొత్తం నెట్‌వర్క్ నిర్వహణలో కీలక పాత్ర పోషించినట్లు పేర్కొన్నారు.

టెక్నికల్ విశ్లేషణ ఆధారంగా సుమారు 44 మంది డ్రగ్ వినియోగదారులను గుర్తించగా, వారిపై ఏకకాలంలో 15 ప్రత్యేక పోలీసు బృందాలు దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో 19 మంది వినియోగదారులు పట్టుబడ్డారు. డ్రగ్ పరీక్షల్లో 14 మందికి THC, METH ప్రభావం ఉన్నట్లు నిర్ధారణ అయింది. పట్టుబడిన వారిలో తన్నీరు వెంకట్రావు, గంటి భరత్, మురళీకృష్ణ సుశీల్, యశ్వంత్ సాయి, కొప్పుల నాగరాజు, కె. వంశీధర్ రెడ్డి, సిగుర్ల అరుణ్ కుమార్, గింజుపల్లి సందీప్, టి. సాత్విక్ రెడ్డి, కె. సందీప్ రెడ్డి, మ్యాకల ప్రవీణ్, చితమడక అభిలాష్, పడాల క్రాంతి సాగర్, పరిటాల రోహిత్ ఉన్నారు. 

విచారణలో వీరంతా చక్రాపాణి, హర్షిత్ రెడ్డిల వద్ద నుంచే గంజాయి సహా ఇతర డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల కాలంలో ఈ వినియోగదారులు ఆన్‌లైన్ లావాదేవీల ద్వారా చక్రాపాణి ఖాతాకు రూ. 1,46,950, హర్షిత్ రెడ్డి ఖాతాకు రూ. 1,66,150 బదిలీ చేసినట్లు సాంకేతిక ఆధారాలు లభించాయి. పరారీలో ఉన్న ప్రధాన నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని అధికారులు వెల్లడించారు.

By
en-us Political News

  
బ్యాంకుల్లో లిక్విడిటీ నిల్వలు రూ. 4,772 కోట్లకు పడిపోవడంతో ఆర్‌బీఐ రూ. 1 లక్ష కోట్ల వేలాన్ని ప్రకటించింది. ఈ వేరియబుల్ రేట్ రెపో (VRR) వేలం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
లేబనాన్ ఉద్రిక్తతల నడుమ అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు హఠాత్తుగా వాయిదా పడ్డాయి. వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ స్విట్జర్లాండ్ పర్యటన ఆలస్యం కావడం, $300 బిలియన్ల నిధిపై వివాదం మరియు హార్ముజ్ జలసంధి పరిణామాల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
కేంద్ర ప్రభుత్వ పీఎం శ్రీ (PM SHRI) నిధుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ, 844 స్మార్ట్ కిచెన్ల నిర్మాణం, విద్యార్థినుల కోసం 53 వేల బంక్ బెడ్ల ఏర్పాటు మరియు అనాథ పిల్లలకు తల్లికి వందనం పథకం అమలుపై మంత్రి నారా లోకేష్ తీసుకున్న కీలక నిర్ణయాల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఫిఫా వరల్డ్ కప్ 2026లో సౌత్ కొరియాపై 1-0 విజయం సాధించి, రౌండ్ ఆఫ్ 32కు అర్హత సాధించిన తొలి జట్టుగా మెక్సికో సంచలన రికార్డు సృష్టించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
స్టాక్ మార్కెట్ క్రాష్‌లోనూ అంబర్ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు 3 శాతానికి పైగా దూసుకెళ్లాయి. ఒప్పో ఇండియాతో కుదిరిన మొబైల్ తయారీ ఒప్పందం ఈ భారీ ర్యాలీకి ఎలా కారణమైందో, ఈ మల్టీబ్యాగర్ రిటర్న్స్ వివరాలను ఇక్కడ చూడండి.
ప్రశాంతతకు మారుపేరైన విజయవాడ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
జూన్ 19న దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా కుప్పకూలాయి. సెన్సెక్స్ ఏకంగా 780 పాయింట్లకు పైగా పడిపోగా, నిఫ్టీ 24,000 స్థాయిని కోల్పోయింది. కేవలం నిమిషాల్లో రూ. 2 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఎలా ఆవిరైంది, యాక్సెంచర్ ఇచ్చిన షాక్ ఏంటి, ఐటీ షేర్లు ఎందుకు పతనమయ్యాయో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
హారిజన్ రీక్లెయిమ్ ఇండియా ఐపీఓ (Horizon Reclaim India SME IPO) బీఎస్‌ఈ ఎస్ఎమ్ఈ ప్లాట్‌ఫారమ్‌పై 47 శాతం ప్రీమియంతో రూ.151 వద్ద అద్భుతంగా లిస్ట్ అయింది. 304 రెట్లు సబ్‌స్క్రిప్షన్ సాధించిన ఈ షేరు లిస్టింగ్ వివరాలు, ఇన్వెస్టర్ల లాభాల పూర్తి సమాచారం ఇక్కడ చూడండి.
తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సంచలన నిర్ణయం. బీసీసీఐ అనుమతులు లేని వివాదాస్పద టీజీ20 లీగ్‌కు ప్రచారం చేస్తున్నారంటూ టీమిండియా ఆటగాళ్లు మహ్మద్ సిరాజ్, తిలక్ వర్మలతో పాటు టాలీవుడ్ హీరోలు వెంకటేష్, విజయ్ దేవరకొండలకు లీగల్ నోటీసులు జారీ చేసింది.
ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం అగ్రహారం గ్రామంలో శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చిన దారుణ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సోమాజిగూడలోని జీఆర్టీ జంక్షన్, ప్రజా భవన్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన వాటర్ లాగింగ్ ప్రాంతాలను
హైదరాబాద్‌లోని నాంపల్లి ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) సీపీఐ (మావోయిస్టు) కార్యకర్త గాదె ఇన్నయ్యపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.
ఎడెల్వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ పబ్లిక్ డెట్ (NCD) ఇష్యూ నేటితో ముగుస్తుంది. క్రిసిల్ AA రేటింగ్ భద్రతతో గరిష్టంగా 10.46% వరకు వార్షిక వడ్డీని సంపాదించేందుకు నేడే చివరి అవకాశం. రూ. 10,000 కనీస పెట్టుబడి మరియు ఆస్బా విధానం ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.