Publish Date:Mar 15, 2025
హిందీ భాషను తమపై రుద్దకండి అంటూ చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదని నటుడు ప్రకాశ్ రాజ్ తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ట్వీట్ చేశారు. దీనికి కౌంటర్ గా సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ట్విట్టర్ వేదికగా ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన జనాలు ఇది ఖచ్చితంగా ప్రకాశ్ రాజ్ కు కౌంటర్ ట్వీట్ అని తెలుస్తోంది.
Publish Date:Mar 15, 2025
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై హైదరాబాద్ లోని రెండు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. రేవంత్ రెడ్డి చేసిన మార్చురీ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖరరెడ్డి, కునా వివేకానందగౌడ్ లు పేట్ బషీర్ బాగ్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
Publish Date:Mar 15, 2025
తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు? అంటే చెప్పడం కష్టం. అసలు ఉంటుందా? అంటే అదీ అనుమానమే? ఎందుకలా? నిన్న మొన్నటి దాకా, ఇదిగో, అదిగో అంటూ ఊహాగానాలు చేస్తూ వచ్చిన మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఇప్పడు ఎందుకు మౌనం పాటిస్తోంది? అంటే స్పష్టమైన సమాధానం ఏదీ రాక పోయినా కాంగ్రెస్ అధిష్టానం కొత్త ఆలోచనల కారణంగానే కాబినెట్ విస్తరణ అలోచన అటకెక్కిందని విశ్వసనీయ వర్గాల సమాచారంగా కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
Publish Date:Mar 15, 2025
మామూలుగానే దక్షిణాదిలో బీజేపీకి ఉన్న పట్టు అంతంత మాత్రమే. నియోజకవర్గాల పునర్విభజన అంశం తెరమీదకు వచ్చిన క్షణం నుంచీ దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ నేతల పరిస్థితి ఇబ్బందుల్లో పడింది. డీలిమిటేషన్ తో పాటు.. త్రిభాషా సూత్రాన్ని బీజేపీ హై కమాండ్ చర్చలోకి తీసుకురావడంతో దక్షిణాదిలో పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది.
Publish Date:Mar 15, 2025
అపార్ట్ మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత పక్కింట్లో పిడుగు పడినా తమకు పట్టనట్టుంటున్నారు. ఇరుగు పొరుగు అనే కాన్సెప్ట్ పూర్తిగా కనుమరుగైంది. నగరాల్లో ఇలా ఉంటే గ్రామాల్లో శుభవార్త అయినా, దుర్వార్త అయినా కలిసి పంచుకుంటున్నారు. రష్యాలో ఓ సర్కస్ లో రెండు ఏనుగుల్లో ఒకటి చనిపోయింది.
Publish Date:Mar 15, 2025
వైఎస్ వివేకా హత్య జరిగి శనివారం (మార్చి 15)కి సరిగ్గా ఆరేళ్లు. ఈ ఆరేళ్లలో వివేకా హత్య కేసు అనేక మలుపులు తిరిగింది. గొడ్డలి పోటు నుంచి గుండెపోటు దాకా.. నారాసుర రక్త చరిత్ర నుంచి ఇంటి మనుషులే హత్య చేశారనే అనేక మలుపులు తిరిగింది. చివరికి కోర్టులు నిర్ధారించి, తీర్పు వెలువరించలేదు కానీ, వివేకా హత్యకు మోటివ్ ఏమిటో, హత్య సూత్రధారులు, పాత్రధారులు ఎవరన్న దాని మీద ప్రజలకు సందేహాలేవీ లేకుండా తెలిసిపోయింది. తేలిపోయింది. అయినా ఇప్పటి వరకూ హంతకులు ఎవరన్నది న్యాయస్థానం తేల్చ లేదు. హంతకులకు శిక్ష పడలేదు. కానీ ఈ కేసులో బాధితులు మాత్రం కఠినాతి కఠినమైన శిక్ష అనుభవిస్తున్నారు.
Publish Date:Mar 15, 2025
పోటీ పరీక్షలకు రాణించలేకపోతున్నారని తన ఇద్దరు పిల్లల కాళ్లు, చేతులను కట్టేసిన ఓ తండ్రి తలలను బకెట్లో ముంచి చంపేసాడు. తర్వాత తానూ ఊరివేసుకుని చనిపోయాడు. కాకినాడ జిల్లా వాకల పూడిలో అసిస్టెంట్ అకౌంట్ గా పని చేస్తున్న వానపల్లి చంద్రకిషోర్ ఒకటో తరగతి చదువుతున్న జోషిల్ , యుకేజీ చదువుతున్న నిఖిల్ పోటీ పరీక్షలకు రాణించలేకపోతున్నారని మనస్థాపం చెంది ఈ దారుణానికి పాల్పడ్డాడు
Publish Date:Mar 15, 2025
తిరుమల శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజా ప్రతినిథుల సిఫారసు లేఖల అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ సారి బీజేపీ ఎంపీ రఘునందనరావు ఈ విషయాన్ని లేవనెత్తారు. తిరుమల గడ్డపై నిలబడి రుబాబు చేశారు. తెలంగాణ భక్తులను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్లక్ష్యం చేస్తోందంటూ విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజాప్రతినిథుల సిఫారసు లేఖలను టీటీడీ పరిగణనలోనికి తీసుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Publish Date:Mar 15, 2025
హోలి ముసుగులో హైదరాబాద్ ధూల్ పేటలో గంజాయి విక్రయాలు జరిగినట్టు స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్ టి ఎఫ్ ) పోలీసులు గుర్తించారు. మండే ఎండలను ఎన్ క్యాష్ చేసుకోవడానికి వ్యాపారులు ఐస్ క్రీం విక్రయాలు జరపడం సబబే. కానీ ఈ ఐఎస్ క్రీంలలో గంజాయి కలిపి విక్రయించడం ధూల్ పేటలో వెలుగు చూసింది. ఐస్ క్రీంలలో నిషేధిత మత్తు పదార్థాలను విక్రయిస్తున్న వ్యక్తిని ఎస్ టిఎఫ్ అధికారులు అరెస్ట్ చేశారు
Publish Date:Mar 15, 2025
తెలంగాణలో ఎండలు మండి పోతున్నాయి. ఎప్పుడో మే చివరి వారంలో రోహిణీ కార్తె సందర్భంగా రోళ్లు పగిలే ఎండలు కాస్తాయి అని చెప్పుకోవడం మనకు తెలుసు. అయితే ఈ సారి మాత్రం మార్చి రెండో వారంలోనే రోళ్లు పగిలే స్థాయిలో ఎండలు మండిపోతున్నాయి.
Publish Date:Mar 15, 2025
ఏపీ శాసన మండలిలో వైసీపీకి బొత్స లాంటి లీడర్లు ఉన్నా సడన్‌గా లైమ్‌లైట్‌లోకి వచ్చారు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి . తొలిసారి శాసనమండలిలో అడుగు పెట్టినా పాయింట్ టు పాయింట్ మాట్లాడుతూ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే విధంగా వైసీపీ వాయిస్ బలంగా వినిపిస్తూ సబ్జెక్ట్ బేస్డ్‌గా మాట్లాడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు ఆ లేడీ మెంబర్.
Publish Date:Mar 15, 2025
వైసీపీ అధినేత జగన్ కోటరీపై ఆ పార్టీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వైసీపీ తీరు గురించి తెలిసిన వారెవరైనా సరే ఇక విజయసాయిపై వైసీపీ నేతలు విరుచుకుపడతారని భావిస్తారు. ఆయన వ్యక్తిగత విషయాలు సహా పార్టీకి ఆయన ద్రోహం చేశారంటూ మీడియా, సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున కథనాలు వండి వారుస్తారని అంచనా వేశారు.
Publish Date:Mar 15, 2025
బీఆర్ఎస్ ను తెలంగాణ సమాజం పెద్ద సీరియస్ గా తీసుకోలేదా?.. ఆ పార్టీ ఇచ్చిన నిరసన పిలుపును పట్టించుకోలేదా? అంటూ పరిశీలకులు ఔననే అంటున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్ కు వ్యతిరేకంగా చేస్తున్న విమర్శలను, ప్రభుత్వ విధానాలపై చేస్తున్న పోరాటాలనూ తెలంగాణ సమాజం పెద్దగా పట్టించుకోవడం లేదంటున్నారు.