శ్రీలక్ష్మి పిటిషన్‌పై సిబిఐ కెవియట్
Publish Date:Jan 5, 2012
Advertisement
హైదరాబాద్: గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి బెయిల్‌ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ శ్రీలక్ష్మి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.శ్రీలక్ష్మిదాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సిబిఐ సుప్రీంకోర్టులో కెవియట్ దాఖలు చేసింది. శ్రీలక్ష్మిని గతంలో సిబిఐ అరెస్టు చేసింది. అయితే, సిబిఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆమె జైలు నుంచి విడుదలయ్యారు. ఆ బెయిల్‌ను హైకోర్టు రద్దు చేసింది. తాను సాక్షులను ప్రభావితం చేస్తాననే ఆరోపణల్లో నిజం లేదని శ్రీలక్ష్మి తన బెయిల్ పిటిషన్లో తెలిపరింది.శ్రీలక్ష్మి బెయిల్‌పై తాము సుప్రీంకోర్టులో కెవియట్ దాఖలు చేశామని సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ మీడియా ప్రతినిధులతో చెప్పారు. వచ్చే 20 రోజుల్లో ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో అనుబంధ చార్జిషీట్‌ను దాఖలు చేస్తామని ఆయన చెప్పారు. శ్రీలక్ష్మిని ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి ఇవ్వాలని సిబిఐ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కేంద్ర అనుమతి లభిస్తే అనుబంధ చార్జిషీట్లో చేరుస్తారు.
http://www.teluguone.com/news/content/gali-ganardan-reddy-case-24-10630.html





