రచ్చ రచ్చైపోయిన... ఒబామాస్ 'ఎంటర్ ది డ్రాగన్'!
Publish Date:Sep 5, 2016
Advertisement
అమెరికా అధ్యక్షుడు అంటే ఎవరు? ఒక దేశాధినేత! ఇంతే అయితే పెద్దగా డిస్కస్ చేయాల్సింది ఏం లేదు! కాని, అమెరికన్ ప్రెసిడెంట్ అంటే దాదాపూ ప్రపంచ పరిపాలకుడు! ఇది కొంచెం ఓవర్ గా అనిపించినా ఆల్మోస్ట్ నిజం! అసలు అమెరికన్ ప్రెసిడెంట్ చాలా చిన్న చిన్న దేశాలకు వెళ్లనే వెళ్లడు. ఆయన తన పదవీ కాలంలో చాలా ప్రాధాన్యమున్న దేశాలకే వెడుతుంటాడు. వెళ్లినప్పడు కూడా ఆ దేశం మొత్తం కళ్లప్పగించి వైట్ హౌజ్ నాయకుని వైభోగం చూస్తూ వుండిపోతుంది!
ఇండియాకి అమెరికా అధ్యక్షులు వచ్చినప్పుడు కూడా మన మీడియా హంగామా తెలిసిందే కదా! బిల్ క్లింటన్ నుంచి ఒబామా వరకూ ఎవరొచ్చినా రకరకాల కథనాలు ప్రసారం అవుతూ వుంటాయి ఛానల్స్ లో! ఒబామా కార్ మొదలు ఆయన వాడి పడేసే టిష్యు పేపర్ల వరకూ అన్నీ డైలీ పేపర్స్ లో ఇష్యూస్ అయిపోతాయి. అంతే కాదు, అమెరికన్ ప్రెసిడెంట్ ఏ దేశానికి వచ్చినా కొన్ని రోజుల ముందే వైట్ హౌజ్ సెక్యురిటీ అక్కడ వాలిపోతుంది. ఆయన బస చేసే హోటల్, ఇతర ప్రాంతాలు అన్నీ తమ ఆధీనంలోకి తీసుకుని నానా హంగామా చేసేస్తారు అమెరికన్ అఫీషియల్స్! అన్ని దేశాలు ఈ డ్రామాకి ఇష్టం వున్నా లేకున్నా సహకరిస్తాయి. అమెరికా దమ్ము, దర్పం అలాంటివి మరి!
ప్రపంచంలో ఎక్కడ కాలుమోపినా తనకు తిరుగులేదనుకునే అమెరికా ప్రెసిడెంట్ కి చైనా రీసెంట్ గా షాకిచ్చింది! అమెరికాతో పొటీపడి వాల్డ్ నెంబర్ వన్ కంట్రీ అవుదామని కలలు కంటున్న డ్రాగన్ ఒబామా వస్తే కనీస మర్యాదలు కూడా పాటించలేదు. ఆయన స్పెషల్ విమానానికి స్టెయిర్ కేస్ కూడా ఏర్పాటు చేయలేదు. విమానానికి వుండే మెట్ల ద్వారానే దిగి వచ్చాడు ఒబామా. అంతే కాదు, ఆయన దిగి రాగానే ఎదురుగా ఏర్పాటు చేయాల్సిన రెడ్ కార్పెట్ కూడా కనిపించలేదు! ఇక ఫైనల్ గా అమెరికన్ జర్నలిస్టుల్ని ఒబామా వద్దకి అనుమతించను కూడా లేదు చైనీస్ అఫీషియల్స్! వాళ్లు , ఒబామా సెక్యురిటీ సిబ్బంది దీని పై ఆగ్రహం వ్యక్తం చేస్తే.... ఇది మా దేశం, మా విమానాశ్రయం అన్నారట చైనీస్ అధికారులు! ఎదురు సమాధానం అంటే ఏంటో తెలియని వైట్ హౌజ్ సిబ్బందికి దిమ్మ తిరిగిపోయింది!
ఒబామా తనకు జరిగిన ఈ అవమానానికి పెద్దగా ఫీలవ్వలేదు! అప్పుడప్పుడూ ఇలాంటివి జరుగుతుంటాయని లైట్ తీసుకున్నట్టు స్టేట్మెంట్ ఇచ్చాడు. కాని, మన కమల్ హసన్, షారుఖ్ ఖాన్ లాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీలను కూడా తమ ఎయిర్ పోర్టుల్లో దారుణంగా అవమానించే అమెరికాకి .... వెలక్కాయ గొంతులో పడితే ఎలా వుంటుందో ఇప్పుడు తెలిసొచ్చింది!
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే... ఒబామాను ఓ ఆటాడుకున్న చైనీస్ అధికారులు మన మోదీకి మాత్రం రెడ్ కార్పెట్ పరిచి ఘనంగా స్వాగతం పలికారు!
http://www.teluguone.com/news/content/g20-45-66078.html





