Publish Date:Sep 25, 2025
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో ప్రజాసమస్యలపై చర్చతో పాటు సరదా మాటలు కూడా పేలుతున్నాయి. మండలిలో వైసీపీ, తెలుగుదేశం సభ్యుల మధ్య మాటల యుద్ధం జరుగుతుంటే.. అసెంబ్లీలో.. అధికారపక్ష సభ్యులే ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజా సమస్యలను లేవనెత్తుతున్నారు. మంత్రులను, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో ప్రజాగొంతుకు వినిపించడంలో తెలుగుదేశం కూటమి సభ్యులు ఏ మాత్రం వెనుకాడటం లేదు. ఈ నేపథ్యంలోనే బుధవారం అసెంబ్లీలో ఓ సరదా సంభాషణ జరిగింది. తెలుగుదేశం సీనియర్ సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏళ్లతరబడి ప్రభుత్వ పాఠశాల పిల్లలకు నాణ్యత లేని యూనిఫాంలు, బెల్టులు లభిస్తున్నాయన్నారు.
అయితే ప్రస్తతం విద్యా మంత్రి నారా లోకేష్ ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేశారనీ అభినందించారు. ఇప్పడు ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు నాణ్యత ఉన్న యూనిఫారాలు, బెల్టులు అందాయన్నారు. ఇది తన విధుల పట్ల లోకేష్ కు ఉన్న బాధ్యతకు నిదర్శనమని అభినందించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఆప్యాయంగా బుచ్చయ్య తాత అని సంబోధించారు. ఈ దశలో జోక్యం చేసుకున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు.. లోకేష్ ను వారిస్తూ తాతా అని కాకుండా అంకుల్ అని సంబోధిస్తే బాగుంటుందేమో అన్నారు. దీనిపై లోకేష్ ఎన్టీఆర్ హయాం నుంచి బుచ్చయ్య ఉన్నారనీ, ఆయనంటే తనకు గౌరవమనీ చెప్పారు. తాను ఆయనను చిన్నప్పటి నుంచీ తాత అనే పిలుస్తున్నానన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/fun-in-assembly-39-206846.html
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.