హార్ముజ్ నుంచి మలక్కా వరకు.. డీప్ డైవ్ జియోపొలిటికల్ విశ్లేషణ
Publish Date:Apr 16, 2026
Advertisement
ప్రపంచ చమురు ప్రవాహాలపై అమెరికా ప్రభావం పెరుగుతోంది. చైనా ఎనర్జీ భద్రత, భారత వ్యూహాత్మక పాత్రపై భారీ ప్రభావం చూపుతోంది. ప్రపంచ చమురు, వాణిజ్య సరఫరా చెయిన్ ల పై అమెరికా తన ప్రభావాన్ని విస్తరించుకుంటున్నదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హార్ముజ్ జలసంధిలో ఇరాన్ పై ఒత్తిడి పెంచిన తర్వాత, ఇప్పుడు అమెరికా దృష్టి మలక్కా జలసంధి వైపు మళ్లింది. ఇది చైనా ఎనర్జీ భద్రతకు అత్యంత కీలకమైన మార్గం. ఇటీవల ఇండోనేషియాతో అమెరికా కుదుర్చుకున్న కొత్త రక్షణ ఒప్పందం, ఈ వ్యూహాత్మక మార్పుకు ప్రధాన సూచికగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక భారత్ భౌగోళికంగా కీలక పాత్ర పోషిస్తోంది. ఇండోనేషియా, మలేషియా, సింగపూర్ రాజకీయాలు ఈ పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తున్నాయిప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రాణవాయువు అయిన ఈ జలసంధి, ఇప్పుడే అమెరికా, చైనా వ్యూహ పోరాటంలో ప్రధాన రంగంగా మారుతోంది. భారత్ ఈ మార్పుల మధ్యలో సమతుల్య శక్తిగా ఎదుగుతోంది. సేకరణ, సంకలనం : సీతారాం కఠమనేని
హార్ముజ్ నుంచి మలక్కా వరకు అమెరికా వ్యూహం ఎలా మారింది?
- హార్ముజ్ లో ఒత్తిడి పెంపు
- ఇరాన్ నౌకాయానంపై కఠిన పర్యవేక్షణ
- పోర్టులపై పరిమితులు
- చమురు రవాణాపై నియంత్రణ
ఇవి ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపాయి.
2. ఇప్పుడు మలక్కా వైపు విస్తరణ
- ఇండోనేషియాతో కొత్త రక్షణ ఒప్పందం
- అమెరికా సైనిక విమానాలకు ఇండోనేషియా గగనతలంలో విస్తృత ప్రవేశం
- మలక్కా జలసంధిపై పర్యవేక్షణ సామర్థ్యం పెరుగుదల
ఇది అమెరికాకు భారత మహాసముద్రం నుంచి పసిఫిక్ వరకు ఒక నిరంతర వ్యూహాత్మక కారిడార్ ను అందిస్తుంది.
మలక్కా జలసంధి ఎందుకు ప్రపంచానికి కీలకం?
- కొన్ని ప్రాంతాల్లో వెడల్పు 3 కిలోమీటర్ల కంటే తక్కువ
- ప్రపంచ వాణిజ్యంలో 40%
- సముద్ర మార్గంలో రవాణా అయ్యే చమురులో 30%
- చైనా దిగుమతి చేసుకునే ముడి చమురులో 80% ఈ మార్గం గుండానే వస్తుంది
చైనా దీనిని మలక్కా డైలెమా అని పిలుస్తుంది. ఎందుకంటే ఈ మార్గం మూసుకుపోతే చైనా ఆర్థిక వ్యవస్థకు నేరుగా దెబ్బ.
- అమెరికా వ్యూహం నేరుగా యుద్ధం కాదు, ఎనర్జీ లైన్లపై ఒత్తిడి.
- విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, అమెరికా చర్యలు ఒక లేయర్డ్ ఎనర్జీ డినైల్ వ్యూహం
- వెనిజులా పరీక్ష
- హార్ముజ్ పైపెరిగిన ఒత్తిడి
- మలక్కా, చైనా ఎనర్జీ లైప్ పై పరోక్ష నియంత్రణ
అంటే.. నేరుగా ఘర్షణకు వెళ్లకుండా, చమురు, వాణిజ్య ప్రవాహాలపై నియంత్రణ ద్వారా చైనాపై ఆర్థిక ఒత్తిడి పెంచడం.
- చైనా ఎలా ప్రతిస్పందించవచ్చు?
చైనా వద్ద కొన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ, అవి పరిమితమైనవే
- భూమార్గాల విస్తరణ
బెల్ట్ అండ్ రోడ్ ద్వారా రైల్వే మార్గాలు ఉన్నప్పటికీ, చమురు, ఎల్ఎన్జీ వంటి భారీ పరిమాణాల రవాణాకు ఇవి సరిపోవు.
- షాడో ఫ్లీట్ అంటే పరిమితులను తప్పించుకునే నౌకల నెట్వర్క్ విస్తరించడం.
- ఇండోనేషియా, మలేషియా, సింగపూర్పై ప్రభావం పెంచడం
ఈ దేశాలు మలక్కా జలసంధి నియంత్రణలో కీలకం.
- సముద్ర ప్రాంతాల మ్యాపింగ్.
- బ్లాకేడ్ పరిస్థితులకు ముందస్తు సిద్ధత.
అయితే.. మలక్కా జలసంధికి పూర్తి ప్రత్యామ్నాయం లేదు.
భారత్ వ్యూహాత్మక స్థానం.. మలక్కా పశ్చిమ ద్వారం వద్ద కీలక శక్తి
- భారత్ కు ఉన్న ప్రత్యేక భౌగోళిక ప్రయోజనం అండమాన్–నికోబార్ దీవులు
- పోర్ట్ బ్లెయిర్ నుంచి మలక్కా జలసంధికి 24 గంటల్లో చేరవచ్చు
- క్యాంప్ బెల్ బే, గ్రేట్ నికోబార్ ప్రాజెక్టులు భారత ప్రభావాన్ని పెంచుతున్నాయి
భారత్ వాణిజ్యంలో 55శాతం మలక్కా–సింగపూర్ మార్గం మీద ఆధారపడి ఉంది
అందువల్ల మలక్కా జలసంధిలో ఏ మార్పు జరిగినా, భారత్ పై కూడా వ్యూహాత్మక, ఆర్థిక ప్రభావం ఉంటుంది.
అమెరికా ప్రణాళికలకు ప్రాంతీయ అడ్డంకులు
మలక్కా జలసంధి పూర్తిగా అమెరికా నియంత్రణలోకి రావడం సులభం అంత సులభం కాదు. ఎందుకంటే.. ఇండోనేషియా, మలేషియా నియంత్రణలో జలసంధి పెద్ద భాగం ఉంది.
- సార్వభౌమత్వంపై అత్యంత సున్నితమైన దేశాలు
ఒక సింగపూర్ నియంత్రణలో చిన్న భాగం మాత్రమే ఉన్నా.. అది ప్రపంచంలోనే అత్యంత కీలక పోర్ట్ మాత్రమే కాకుండా ఒక లాజిస్టిక్స్ హబ్ కూడా. అందువల్ల ఇది ఒకే దెబ్బతో చెక్ మేట్ అయ్యే పరిస్థితి కాదు. దశలవారీగా జరిగే సముద్ర వ్యూహ పోరు. మలక్కా జలసంధి, చైనా ఎనర్జీ భద్రత, అమెరికా వ్యూహం, భారత భౌగోళిక ప్రభావం కలిసే కేంద్రబిందువు. అమెరికా హార్ముజ్ నుంచి మలక్కా వరకు తన ప్రభావాన్ని విస్తరిస్తోంది. ఇది చైనా ఎనర్జీ భద్రతకు ఇది పెద్ద సవాలు.
http://www.teluguone.com/news/content/from-hormuz-to-malacca-36-217499.html





