మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి హౌస్ అరెస్టు.. వనపర్తిలో ఉద్రిక్తత.!

Publish Date:Sep 21, 2026

Advertisement

తెలంగాణలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు   సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ చేపట్టిన ప్రాజెక్టు ముట్టడి పిలుపు  నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో పోలీసులు  అరెస్టులు, గృహనిర్బంధాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా బీఆర్‌ఎస్ సీనియర్ నేత,  మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని వనపర్తిలోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. ప్రాజెక్టు ముట్టడికి వెళ్లకుండా ఆయనను అడ్డుకోవడంతో వనపర్తిలో  ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

జూరాల ప్రాజెక్టు పరిధిలోని వేలాది ఎకరాల ఆయకట్టు ఎండిపోతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్‌ఎస్   తీవ్ర ఆమండి పడుతున్నాయి.  కాల్వలకు సకాలంలో సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందనీ, అయినా ప్రభుత్వం స్పందించడంల లేదనీ బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది.   రైతుల పక్షాన నిలిచి జూరాల ప్రాజెక్టును ముట్టడించాలనే  డిమాండ్ తో ఆందోళన చేపట్టింది. అయితే పోలీసులు ఈ ఆందోళన భగ్నం చేసేందుకు అరెస్టులు, హౌస్ అరెస్టులు చేస్తుండటాన్ని తీవ్రంగా నిరసించిన బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని విమర్శిస్తున్నారు. 

వనపర్తి,  ఆత్మకూరు, అమరచింత, నర్వ తదితర మండలాల నుంచి బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు జూరాల ప్రాజెక్టు వైపు రాకుండా పోలీసులు ప్రధాన రహదారులపై  ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేస్తున్నారు. మరోవైపు గద్వాలలోనూ కాలువలకు నీటిని విడుదల చేయాలనే డిమాండ్‌తో అఖిలపక్షం,   రైతు సంఘాలు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునివ్వడంతో అక్కడ కూడా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలోనే గద్వాలలోనూ పలువురు నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.  

[Former Minister Niranjan Reddy House Arrest, Jurala Project Protest, BRS , Telangana Water Issue, Telugu One]

By
en-us Political News

  
హనుమకొండ జిల్లా కాజీపేటలో పెను ప్రమాదం తృటిలో తప్పింది.
గోదావరి తీరం వెంబడి ఉన్న దేవాలయాలకు చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను ప్రజలలో విస్తృతంగా ప్రజారం చేయడం ద్వారా విశేష ప్రాచుర్యం కల్పించాలని నిర్ణయించింది. అలాగే  బాసర నుంచి భద్రాచలం వరకు కారిడార్ ఏర్పాటు చేయడం వల్ల ఆయా ప్రాంతాల్లో పర్యాటక రంగం, అనుబంధ రంగాల కార్యకలాపాలు జోరందుకుంటాయని ప్రభుత్వం భావిస్తోంది.  
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణలో అబార్షన్ కిట్ల అక్రమ విక్రయాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.
వికారాబాద్ జిల్లా పరిగి ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అత్యంత అరుదైన వైద్య కేసు వెలుగు చూసింది.
ఉమ్రి గ్రామానికి చెందిన కైలాస్ తన కుమార్తె కళ్యాణి ప్రేమ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. ఈ విషయం బయటకు తెలిస్తే గ్రామంలో   కుటుంబ పరువు పోతుందన్న భయంతో  తన కన్నబిడ్డ 18 ఏళ్ల కళ్యాణిని హత్య చేశాడు.  అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు, మృతదేహాన్ని ఇంటిలోని మరో గదిలోకి తీసుకెళ్లి ఉరివేసి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా  నమ్మించే ప్రయత్నం చేశాడు.  
ఐటీ కారిడార్‌తో పాటు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సైబరాబాద్ పరిధిలో పౌర పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి శాశ్వత, సమీకృత భవనం అవసరమైంది. పర్యావరణ హితమైన నెట్-జీరో విధానంలో భవనాన్ని నిర్మించడం ద్వారా దీర్ఘకాలంలో నిర్వహణ, ఇంధన వినియోగంపై సానుకూల ప్రభావం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదు. అయినప్పటికీ భద్రత, తనిఖీల విషయంలో పోలీసులు ఇసుమంతైనా రాజీ పడకుండా వ్యవహరిస్తున్నారు. అనుమానిత వ్యక్తులు, వాహనాలు, వస్తువులపై ప్రత్యేక నిఘా పెట్టారు.
తెలంగాణ మట్టిలో పుట్టిన ప్రతి ఉద్యమ గాథ వెనుక ఎన్నో కన్నీళ్లు, ఎన్నో త్యాగాలు దాగి ఉన్నాయి.
తెలంగాణ పోలీస్ శాఖ ఆధునిక సాంకేతికత వినియోగంలో మరో కీలక ముందడుగు వేస్తోంది
తెలంగాణను అంతర్జాతీయ క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది.
అమ్మకు బంగారం కొనివ్వాలనుకున్నాడు.. సైబర్ మోసం బలితీసుకుంది.!
ట్రైనీ ఐపీఎస్ అధికారి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సహచర ట్రైనీ మహిళా అధికారిణిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి వ్యవహారంలో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.