బెంబేలెత్తిస్తున్న ఇన్ కంబెన్సీ.. అధిగమించేందుకు కేసీఆర్ ఎత్తులు.. కసరత్తులు!

Publish Date:May 13, 2022

Advertisement

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి అధికారంలో ఉన్న తెరాసను ముచ్చటగా మూడో సారి గెలిపించి మరో సారి ముఖ్యమంత్రి కావాలన్న కేసీఆర్ లక్ష్యనికి  ప్రజలలో కనిపిస్తున్న ప్రభుత్వ వ్యతిరేకత అవరోధం అయ్యే అవకాశలు కనిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న పార్టీకి ఏంతో కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉండటం సహజం. అయితే టీఆర్ఎస్ విషయంలో ఈ సారి అది కొంచెం ఎక్కువగా ఉందన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం.    దీనిని గమనించిన సీఎం ప్రభుత్వ వ్యతిరేకతను అధిగ మించి సానుకూలతను పెంచుకునే దిశగా కసరత్తులు ప్రారంభించారు. రాజకీయ వ్యూహరచనలో దిట్ట అయిన తెలంగాణ ముఖ్యమంత్రి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను ప్రభుత్వ సానుకూలతగా మార్చుకునేందుకు  అందుబాటులో ఉన్న అన్ని వనరులూ వినియోగిం చుకుంటున్నారు.   ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రంతో పేచీ విషయంలో ఒక అడుగు తగ్గి రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం సేకరణకు ముందుకు రావడం దీనిలో భాగమేనని చెప్పవ చ్చు. అలాగే సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ప్రభుత్వ వ్యతిరేక వర్గాలకు సముచిత ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఆ వర్గాలలో ప్రభుత్వ సానుకూలత పెరిగేలా చర్యలు తీసుకోవడంపై కేసీఆర్ దృష్టి పెట్టారు. 

ఇవన్నీ కాకుండా ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించేందుకు ఆయన  అధికారులను ముఖ్యంగా ప్రమోటీ (కన్ఫర్డ్) ఐఏఎస్ లను రంగంలోనికి దింపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేతకకు కారణాలేమిటి? వ్యతిరేకతను అధిగమించి ఆ వర్గాలను ప్రభుత్వ అనుకూలత దిశగా మార్చడానికి తీసుకోవలసి చర్యలేమిటి? అన్న దానిపై అధ్యయనం చేయడమే కాకుండా అందుకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవలసిందిగా ఇప్పటికే వారికి అవసరమైన సూచనలు ఇచ్చినట్లు చెబుతున్నారు. ఏ ఏ అంశాలలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది.

దానికి తగ్గించడానికి ప్రభుత్వ పరంగా తీసుకోవలసిన చర్యలేమిటి వంటి విషయాలపై సహజంగానే ఐఏఎస్ లకు ఉండే అవగాహనను కేసీఆర్ అందిపుచ్చుకుని ముందుకు సాగాలని భావిస్తున్నారు. అలాగే దళిత బంధు వంటి సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వర్గాల వారికి ప్రాధాన్యత ఇస్తూ తద్వారా  ఆయా వర్గాలలో ప్రభుత్వ సానుకూలత పెరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇక తెలంగాణ సెంటిమెంటును మళ్లీ ప్రజలలో రేకెత్తించి తెరాసయే తెలంగాణ ప్రగతికి పాటుపడే పార్టీ అన్న భావనను పెంపొందించేందుకు తెలంగాణ పట్ల కేంద్ర వివక్షను ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు.

పోరుగు రాష్ట్రంలో సౌకర్యాల లేమిని ఎత్తి చూపడం ద్వారా సమర్థ పాలనతో తెలంగాణ అభివృద్ధి పథంలో పరుగులు తీస్తన్నదన్న విషయాన్ని జనానికి హత్తుకునేలా వివరించే ప్రయత్నాలు చేస్తున్నారు.  జాతీయ అజెండా అంటూ యావద్దేశానికీ మార్గదర్శనం చేయగలిగేలా తెలంగాణ అభివృద్ధిని ప్రముఖంగా ప్రజలలోకి తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు.   

ఇక తన కేబినెట్ లో ప్రజలలో సానుకూలత ఉన్న ఇద్దరు మంత్రులు కేటీఆర్, హరీష్ రావులను రంగంలోనికి దింపారు. వారిరువురూ కూడా ఇప్పటికే విస్తృత పర్యటనలతో ప్రజలలో మమేకం అవుతున్నారు.  విపక్షాల విమర్శలను దీటుగా తిప్పి కొట్టడమే కాకుండా, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజలలోకి తీసుకు వెళుతున్నారు. దీనికి తోడు వారు తమ పర్యటనలలో ఎక్కువగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వర్గాలను కలుస్తూ వారిని సముదాయించో, బుజ్జగించే టీఆర్ఎస్ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.  రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత ఎనిమిదేళ్ల స్వల్ప వ్యవిధిలో తెలంగాణ అభివృద్ధి దేశానికి తలమానికంగా నిలిచిందనే విషయాన్ని  ప్రముఖంగా ప్రస్తావిస్తూ ప్రజలలో ప్రభుత్వ సానుకూలత పెరిగేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 

By
en-us Political News

  
జగన్‌లో మార్పు వుంటుందా, వుండదా అన్న అయోమయంలో వైసీపీ నేతలు.. ఆయనలో మార్పు వుండదన్న నిశ్చయానికి వచ్చేస్తున్నారు.
రాజకీయాల్లో విజయం అనేది కేవలం నాయకుల ఉపన్యాసాల వల్ల మాత్రమే సాధ్యం కాదు. అధికారం, రాజకీయ వేధింపులు, ఆంక్షలు ఎన్ని ఎదురైనా వెరవక
అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పరిధిలో దాదాపు రూ. 7.5 కోట్ల విరాళాల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలపై పార్లమెంట్‌ ద్వారం వద్ద స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ కాషాయ వస్త్రాలు ధరించి, పూజారి వేషంలో ఒక పెద్ద హుండీతో కూర్చుని సేకరించిన విరాళాలను జేబులో వేసుకుంటూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.
నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే విశాఖను గ్లోబల్ ఐటీ, ఇండస్ట్రియల్ హబ్‌గా మార్చాలనే ఆలోచనతో ఈ భోగాపురం ప్రాజెక్టుకు చంద్రబాబు బీజం వేశారనీ, అయితే.. కాలక్రమంలో ప్రభుత్వాలు మారాయి, ప్రాజెక్టు ప్రతిపాదనలు మడతపడ్డాయన్నారు.
సిదిరి అప్పలరాజు కుమారుడు బైక్ నిర్లక్ష్యంగా నడిపి ఒకరి మృతికి కారణమయ్యారన్న కేసు దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల మేరకు ఇందులో ఎలాంటి రాజకీయ కుట్రలు లేవు. సీదిరి అప్పలరాజు చేసిన అతే.. ఆయనను చట్టపరంగా ఇబ్బందుల్లోకి నెట్టింది.
ఎప్పుడో ఓ సారి జైల్లో ఉన్న నేతకు పరామర్శ పేరుతో బయటకు వచ్చే సందర్భాలలో కూడా సదరు నేతను పరామర్శించడం కంటే.. బల ప్రదర్శనకు, తనకు జనం మద్దతు ఉందని నిరూపించుకునే ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన అలా బయటకు వచ్చిన ప్రతి సారీ అభాసుపాలౌతూనే ఉన్నారు.
ఢిల్లీ వీధుల్లో రగిలిన ఆగ్రహ జ్వాలలు, పోలీసుల లాఠీఛార్జీలు, కన్నీటి ధారలు, నిర్బంధాలను సైతం లెక్కచేయక హక్కుల కోసం వీధిపోరాటానికి దిగిన యువత ఆక్రందనలు
రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ అమూల్యమైన భూములను ఇవ్వద్దు, భోగాపురం విమానాశ్రయాన్ని అందరం కలిసి అడ్డుకుందాం" అంటూ జగన్ ఇచ్చిన పిలుపుల ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతూ భోగాపురం విషయంలో జగన్ ద్వంద్వ వైఖరిని ఎండగడుతున్నాయి.
తెలుగుదేశం కూమిటికి ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. చంద్రబాబు నాయకత్వంలో కూటమి సర్కార్ సంక్షేమ, అభివృద్ధిని సమాంతరంగా పరుగులు పెట్టిస్తున్నప్పటికీ ఆ స్థాయిలో ప్రజాదరణ పెరగడం అటుంచి.. క్షేత్రస్థాయిలో కూటమి పాలన పట్ల ఒకింత అసంతృప్తి పె రిగిందని సర్వే స్పష్టం చేయడమే.
మొత్తంగా విద్యార్థులు, యువతఉద్యమం.. ఒక స్పష్టమైన సందేశాన్ని అయితేనిస్సందేహంగా ఇచ్చింది. అన్యాయాన్ని ప్రశ్నించడంలో, హక్కుల కోసం పోరాడటంలో , న్యాయం కోసం నినదించడంలో వెనకడుగు వేసే ప్రశ్నేలేదని చాటింది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కర్నూలు జిల్లా ఆదోని పట్టణ, మండల టీడీపీ నేతలు పని చేయాలని
నీట్ పేపర్ లీక్ ఆందోళనలతో దిల్లీ వీధులను ఊపేసిన బొద్దింకలు ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద రైతు నాయకుడు రాకేష్ తికాయత్‌ను కలిసి సంఘీభావం ప్రకటించాయి.
మాజీ మంత్రి జోగి రమేష్ తనపై చేస్తున్న ఆరోపణలనుఖండించిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్.. జోగి రమేష్ కు ఎటువంటి క్రెడిబులిటీ లేదనీ, అతను ఏదోదో మాట్లాడతారనీ, అవన్నీ పట్టించుకోవలసిన అవసరం లేదని చెప్పారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.