హిమాచల్‌లో వర్షాలకు కాదు మంచు కరిగి వరద.. ఝల్మా వాగులో చిక్కుకున్న పర్యాటకులు

Publish Date:Jun 29, 2026

Advertisement

హిమాచల్ ప్రదేశ్‌ ను మెరుపు వరదలు ముంచెత్తాయి. ఎండల తీవ్రతకు పర్వతాలపై మంచు చరియలు విరిగిపడటంతో లాహౌల్ స్పితి జిల్లాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. సాధారణంగా భారీ వర్షాలకు వరదలు సంభవిస్తాయి. కానీ తాజాగా హిమాచల్ లో వర్షాలు లేకుండానే మంచు కరిగి వరదలు సంభవించాయి.  ఈ ప్రకృతి ప్రకోపం కారణంగా  ఝల్మా వాగులో నీటి ఉధృతి ప్రమాదకర స్థాయికి చేరి, అక్కడి  రహదారిని  ముంచెత్తింది. వరద తీవ్రతకు రహదారి తీవ్రంగా దెబ్బతినడమే కాకుండా కొన్ని చోట్ల కొట్టుకుపోయింది.

ఈ ఆకస్మిక వరద కారణంగా ఆ మార్గంలో ప్రయాణిస్తున్న  పర్యాటకులు చిక్కకుపోయారు. దాదాపు  50  పర్యాటక వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. చుట్టూ కొండలు, మధ్యలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు, ముందుకు వెళ్లేందుకు వీల్లేని పరిస్థితి నెలకొనడంతో పర్యాటకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.   అదృష్టవశాత్తూ ఈ విపత్తులో  ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.   పర్యాటకుల రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు ప్రకటించారు.  ప్రకటించారు.

 సమాచారం అందిన వెంటనే సరిహద్దు రహదారి సంస్థ   సిబ్బంది, స్థానిక యంత్రాంగం,  రెస్క్యూ టీమ్‌లు  రంగంలోకి దిగాయి. కొట్టుకుపోయిన రహదారిని పునరుద్ధరించేందుకు యుద్ధ ప్రాతిపదికన  మరమ్మతు పనులు చేపట్టి పూర్తి చేశారు.  చిక్కుకుపోయిన  పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.   

By
en-us Political News

  
రంగారెడ్డి జిల్లా జన్వాడలో చోటుచేసుకున్న సాయి–పద్మ దంపతుల ఆత్మహత్య కేసులో పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ కేసుతో ప్రత్యక్ష సంబంధం ఉందనే ఆరోపణలు ఎదుర్కొంటూ గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరి లొంగుబాటుతో సాయికృష్ణ అదృశ్యం వెనుక ఉన్న మిస్టరీ బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఆస్పత్రిలో చేరడానికి ముందు మహా ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తో భేటీ అయిన పవన్ కల్యాణ్ ఆయనను రాష్ట్రానికి రెండు ఆడపులలను ఇవ్వాలని కోరారు. అందుకు ఫడ్నవీస్ సానుకూలంగా స్పందించారు.
హైదరాబాద్ నగరంలో మంగళవారం ఒక్కసారిగా సంభవించిన ఒక ఘోర ప్రమాదం స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.
ఇటీవల ఓ సందర్భంలో ప్రభుత్వ ప్రజారవాణా బస్సులో ప్రయాణించిన సీఎం విజయ్.. ఆ బస్సు ప్రయాణం తరువాత రాష్ట్రంలో ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం మేరకురాష్ట్ర ప్రభుత్వం ఇకపై కొనుగోలు చేసే బస్సులన్నీ ఏపీ సౌకర్యంతో ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
తమ మధ్య వైవాహిక వివాదాలు ఉన్నాయని, తన భర్తపై గృహ హింస, వరకట్న వేధింపుల ఆరోపణలు ఉన్నాయని అరుణ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ విషయమై 2017 జూన్‌లోనే కేసు నమోదైనట్లు పేర్కొన్న ఆమె.. ఒకవేళ ఇప్పుడు ఆయనకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందిస్తే.. తన జీవనోపాధికి తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
సమాజంలో ఉన్నతమైన హోదాల్లో ఉన్న మంత్రి, ఐఏఎస్ అధికారిణి ప్రతిష్ఠకు భంగం కలిగేలా ఈ ఫేక్ వీడియోలు ఉన్నాయంటూ తన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు.
గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ ఆయనకు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. అయితే గతంలో రెండు సార్లు విచారణకు హాజరు కావడానికి గడువు కాలాలంటూ కోరిన గుడివాడ అమర్నాథ్ ఈ రోజు మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు.
. ఈ సంఖ్య ఎంత పెద్దదంటే, మన దేశంలోని గోవా రాష్ట్రంలో ఉండే మొత్తం కుటుంబాల కంటే కూడా గ్రేటర్ హైదరాబాద్‌లోనే ఎక్కువ కుటుంబాలు ఉన్నాయి. హైదరాబాద్ మహానగరం ఎంత వేగంగా విస్తరిస్తోందో.. ఉపాధి కోసం ఎంతలా జనం ఇక్కడికి తరలివస్తున్నారో చెప్పడానికి ఇదే నిదర్శనం.
అద్విత్ జ్యువెలర్స్ ఐపీఓ 212.63 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌తో రికార్డు సృష్టించింది. రూ. 46 జీఎమ్‌పీతో జూలై 1న భారీ లిస్టింగ్ లాభాల అంచనాలు. పూర్తి వివరాలు మరియు అలాట్‌మెంట్ స్టేటస్ ఇక్కడ చూడండి.
జూలై 4 నుండి ప్రారంభం కానున్న అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు మరియు ఎలక్ట్రానిక్స్‌పై 80 శాతం వరకు భారీ డిస్కౌంట్లు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి!
దేశవ్యాప్తంగా మహిళా క్రికెట్ ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఎమర్జింగ్ ఉమెన్స్ క్రికెట్‌ లీగ్ (EWCL) లోగో జూబ్లీహిల్స్‌లో ఘనంగా ఆవిష్కరించబడింది. ఆగస్టు 15 నుంచి 16 జట్లతో ప్రారంభం కానున్న ఈ లీగ్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
పవన్ కల్యాణ్ గత కొంత కాలంగా తీవ్రమైన భుజాల నొప్పితో బాధపడుతున్న సంగతి విదితమే. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలన్న ఉద్దేశంతో ఆయన అంబానీ ఆస్పత్రిలో చేరినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.