Publish Date:Jan 16, 2025
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు అమిత్ షాకు విందు ఇవ్వనున్నారు. ఈ నెల 18న ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు అమిత్ షాకు హై లెవల్ విందు ఇవ్వనున్నారు
Publish Date:Jan 16, 2025
ఇండియన్ స్టార్ పేస్ బౌలర్ బుమ్రా తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులను ఖండించాడు. చాంపియన్ ట్రోఫీకి ముందు తనను బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించినట్లుగా వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవాలని బుమ్రా కొట్టి పారేశారు.
Publish Date:Jan 16, 2025
ఏ సంస్థ అయినా ఇక చాలు కావలసినంత సంపాదించేశాం అనుకుంటుందా? ఇంత సంపాదించేశాను, ఇక కంపెనీని మూసేస్థానని ఏ వ్యాపారవేత్తైనా చెబుతారా? అన్న ప్రశ్నకు అమెరికాకు చెందిన ఇన్వెస్ట్ మెంట్ రీసెర్చ్ కంపెనీ హిండెన్‌బర్గ్ వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్ తాను అలాగే చెబుతాను, అదే చేస్తాను అంటున్నారు.
Publish Date:Jan 16, 2025
ఢిల్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ మరో రెండు గ్యారంటీలను విడుదల చేసింది. ప్రతీ నెల 300 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించిన వారికి ఉచిత కరెంట్ గ్యారెంటీని ప్రకటించింది.
Publish Date:Jan 16, 2025
ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కెటీఆర్ గురువారం బషీర్ బాగ్ లోని ఈ డీ కార్యాలయానికి చేరుకున్నారు. గచ్చిబౌలిలోని తన నివాసం నుంచి కెటీఆర్ నేరుగా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.
Publish Date:Jan 16, 2025
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. భోజ్ పురి యువ నటుడు, యాక్షన్ హీరో సుదీప్ పాండే బుధవారం (జనవరి 15) గుండెపోటుతో కన్నుమూశారు. తన సినిమా షూటింగ్ స్పాట్ లోనే ఒక్కసారిగా కుప్పకూలి సుదీప్ పాండేను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.
Publish Date:Jan 16, 2025
ఆంధ్రప్రదేశ్ లో గత ఐదేళ్ల జగన్ మయాంలో అరాచకత్వం రాజ్యమేలింది. ఐదేళ్ల జగన్ పాలన అంతా అవినీతి, అరాచకం, దౌర్జన్యం, దోపిడీ అన్నట్లుగా సాగింది. ఆ పార్టీ నేతలు యధేచ్ఛగా అందినకాడికి ప్రభుత్వ భూములు, అటవీ భూములు, ప్రైవేట్ భూములను కబ్జా చేసేశారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిని అక్రమ కేసులు, అరెస్టులతో వేధింపులకు గురి చేశారు.
Publish Date:Jan 16, 2025
కొత్త పరిశ్రమల ఏర్పాటు మాట అటుంచి రాష్ట్రం నుంచి ఉన్న పరిశ్రమలే తరలిపోయిన పరిస్థితి గత ఐదేళ్లలో జగన్ హయాంలో చూసిన ఆంధ్రప్రదేశ్ కు ఇప్పుడు పరిశ్రమలు క్యూకడుతున్నాయి.ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు అత్యంత భద్రమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను ఎంచుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికత, ఆయన ప్రభుత్వ పారిశ్రామిక విధానం కారణంగా రాష్ట్రానికి పెట్టుబడులు తరలివస్తున్నాయి.
Publish Date:Jan 16, 2025
తెలుగుదేశం సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది. సంక్రాంతి పండుగ వేళ పార్టీ సభ్యత్వాలు కోటి దాటాయి. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ బుధవారం (జనవరి 15) అధికారికంగా ప్రకటించింది.
Publish Date:Jan 16, 2025
అధికారంతో వచ్చిన అహంకారమో, లేక మహిళల పట్ల నిజంగానే చిన్న చూపో కానీ బీజేపీ నేతలు మహిళల విషయంలో చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు ఆ పార్టీ ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి. ఇటీవల ఢిల్లీ బీజేపీ నాయకుడు రమేష్ బిధూరి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా వధేరా గాంధీపై చేసిన వ్యాఖ్యల దుమారం చల్లారకముందే.. ఢిల్లీ సీఎం ఆతీశిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వచ్చే నెల 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచారం జోరందుకున్న సంగతి తెలిసిందే.
Publish Date:Jan 16, 2025
ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై ఆయన నివాసంలోనే దాడి జరిగింది. గుర్తు తెలియని అగంతకుడు సైఫ్ అలీఖాన్ నివాసంలోకి చొరబడి ఆయనపై కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో సైఫ్ అలీఖాన్ శరీరంపై ఆరు చోట్ల గాయాలయ్యాయి. గాయపడిన సైఫ్ అలీఖాన్ ను హుటాహుటిన లీలావతి ఆస్పత్రికి తరలించారు. దాడి చేసి తప్పించుకుపోయిన అగంతకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Publish Date:Jan 15, 2025
జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక భయంలో బతికారు. జగన్ అరాచక పాలనలో ఏ వర్గమూ స్వేచ్ఛగా, ప్రశాంతంగా జీవించ లేని పరిస్ధితి ఉంది. ఇష్టారీతిగా దోపిడీ, దౌర్జన్యాల పర్వం సాగింది. గత ఏడాది జరిగిన ఎన్నికలలో వైసీపీ ఘోర పరాయాన్ని మూటగట్టుకుని గద్దె దిగడం, తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడంతో రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
Publish Date:Jan 15, 2025
తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ, అసౌకర్యం లేకుండా ప్రశాంతంగా వైకుంఠద్వార దర్శనాలు చేసుకునేందుకు వీలుగా టీటీడీ అన్ని ఏర్పాట్లూ చేసింది.