బెడిసికొట్టిన వైసీపీ ప్లాన్.. తిరుపతి ఘటనపై అసత్య ప్రచారాలకు ఎండ్ కార్డ్

Publish Date:Jan 13, 2025

Advertisement

తిరుమ‌ల‌లో కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామివారిని ద‌ర్శించుకునేందుకు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు తిరుమ‌ల‌కు వ‌స్తుంటారు. ప్ర‌తీ రోజూ దాదాపు అర‌వై వేల‌కుపైగా భ‌క్తులు స్వామివారిని ద‌ర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. తిరుమల నిత్యం  స్వామినామ‌స్మ‌ర‌ణంతో మారుమోగిపోతుంది. అలాంటి తిరుమ‌ల‌లో గ‌డిచిన ఐదేళ్ల వైసీపీ హ‌యాంలో ఎన్నో అప‌చారాలు జ‌రిగాయి. ల‌డ్డూ త‌యారీలో వాడే నెయ్యి విష‌యం ద‌గ్గ‌ర నుంచి.. తిరుమ‌ల‌లో టికెట్ల పంపిణీ.. ఉద్యోగుల నియామ‌కం ఇలా అన్నిఅంశాల్లోనూ వైసీపీ హ‌యాంలో అనేక త‌ప్పులు జ‌రిగాయి. మొత్తంగా తిరుమ‌ల ప‌విత్ర‌త‌ను దెబ్బ‌తీసే స్థాయికి గ‌త పాల‌కుల నిర్ణ‌యాలు వెళ్లారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సూచ‌న‌ల‌తో అధికారులు తిరుమ‌ల ప్ర‌క్షాళ‌న‌కు న‌డుం బిగించారు. వైసీపీ హ‌యాంలో జ‌రిగిన త‌ప్పుల‌ను ఒక్కొక్క‌టిగా స‌రిచేసుకుంటూ వ‌స్తున్నారు. దీంతో తిరుమ‌ల‌ను ద‌ర్శించుకునే భ‌క్తుల తాకిడి క్ర‌మంగా మరింత పెరుగుతోంది. ఇలాంటి స‌మ‌యంలో వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా టోకెన్ల జారీ స‌మ‌యంలో తొక్కిస‌లాట చోటు చేసుకుంది. ఈ విషాద ఘ‌ట‌న‌లో ఆరుగురు మ‌ర‌ణించ‌గా.. ప‌దుల సంఖ్య‌లో భ‌క్తులు గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌ను రాజ‌కీయం చేసేందుకు జ‌గ‌న్, వైసీపీ నేత‌లు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారు.

తిరుప‌తిలో టోకెన్ల పంపిణీ స‌మ‌యంలో ఆరుగురు మృతిచెంద‌డం చ‌రిత్ర‌లోనే తొలిసారి. ఒక‌రిద్ద‌రు అధికారుల కార‌ణంగా ఈ ఘ‌ట‌న జ‌రిగింది. అయితే, ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే టీడీపీ పాల‌క మండ‌లి అప్ర‌మ‌త్త‌మైంది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం వెంట‌నే స్పందించారు. ఘ‌ట‌న జ‌రిగిన కొన్నిగంట‌ల‌కే వారు తిరుప‌తికి వ‌చ్చి క్ష‌త‌గాత్రుల‌ను ప‌రామ‌ర్శించారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఘ‌ట‌న జ‌రిగిన ప్ర‌దేశాన్ని ప‌రిశీలించి.. ప్ర‌మాదం జ‌రిగిన తీరుపై అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ క్ర‌మంలో అధికారుల‌పై చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రాథ‌మిక విచార‌ణ‌లో ఈ ఘ‌ట‌న‌కు బాధ్యులైన డీఎస్పీ రమణ కుమార్, గోశాల డైరెక్టర్ హరనాథ్ రెడ్డిలను సస్పెండ్ చేయ‌డంతోపాటు.. ఎస్పీ సుబ్బరాయుడు, జేఈవో గౌతమి, సీఎస్‌వో శ్రీధర్‌లను బ‌దిలీ చేశారు. గాయ‌ప‌డి ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్న వారివ‌ద్ద‌కు వెళ్లిన చంద్ర‌బాబు.. వారిని ప‌రామ‌ర్శించి ఘ‌ట‌న జ‌రిగిన తీరును తెలుసుకున్నారు. అంతేకాక మ‌రుస‌టిరోజే వారికి ప్ర‌త్యేక వైకుంఠ ద్వారా ద‌ర్శ‌నం ఏర్పాటు చేయించారు.

అయితే, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ ఘ‌ట‌న‌ను రాజ‌కీయం చేయాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారు. క్ష‌త‌గాత్రుల ప‌రామ‌ర్శ పేరుతో ఆస్ప‌త్రికివ‌చ్చిన జ‌గ‌న్‌, వైసీపీ నేత‌లు ఇష్ట‌మొచ్చిన‌ట్లు ప్ర‌వ‌ర్తించారు. ఒక‌రిద్ద‌రే రావాల‌ని వైద్యులు వారించినా విన‌కుండా జ‌గ‌న్ స‌హా మ‌రో ప‌దిమంది వైసీపీ నేత‌లు లోప‌లికి వెళ్లారు. దీనికితోడు జ‌గ‌న్ వ‌చ్చే ముందే ప‌లువురికి ఓ వైసీపీ నేత‌ తెల్లక‌వ‌ర్లు పంచిపెట్ట‌డం సీసీ కెమెరాల్లో రికార్డు కావ‌టంతో వైసీపీ కుట్ర‌కోణం బ‌య‌ట‌కొచ్చింది. క‌వ‌ర్లో డ‌బ్బులిచ్చి చంద్ర‌బాబు వ‌ల్ల‌నే ఆ ఘ‌ట‌న జ‌రిగింద‌ని చెప్పించే ప్ర‌య‌త్నం చేసింది వైసీపీ బ్యాచ్‌. చంద్ర‌బాబు స‌కాలంలో స్పందించ‌డంతో ఘ‌ట‌న‌ను రాజ‌కీయంగా వాడుకోవాల‌న్న వైసీపీ ప్లాన్ బెడిసికొట్టింది. 

అబ‌ద్ధాల‌ను ప‌దేప‌దే ప్ర‌చారం చేసి అవి నిజ‌మ‌ని ప్ర‌జ‌ల‌ను న‌మ్మించేలా చేయ‌డంలో జ‌గ‌న్‌, వైసీపీ నేత‌లు దిట్ట‌. దీనికి తోడు జ‌గ‌న్ సొంత మీడియా, వైసీపీ సోష‌ల్ మీడియా ఉండ‌నే ఉంది. ఘ‌ట‌న జ‌రిగిన తొలి రెండు రోజులు చంద్రబాబు కార‌ణంగానే ఈ ఘ‌ట‌న జ‌రిగిందంటూ వైసీపీ మీడియా ప్ర‌చారం చేసింది. వారి ప్లాన్ బెడిసికొట్ట‌డంతో ఈ ఘ‌ట‌న‌కు కార‌ణం చైర్మ‌న్‌, ఈవో అంటూ ప్ర‌చారం చేయ‌డం మొద‌లు పెట్టింది వైసీపీ బ్యాచ్‌.  చైర్మ‌న్‌, ఈవో మ‌ధ్య సమన్వయ లోపం, విభేదాలే ఈ ఘ‌ట‌న‌కు కార‌ణ‌మ‌ని సొంత జగన్ మీడియా, సోష‌ల్ మీడియాలో విస్తృత ప్ర‌చారం చేశాయి. చైర్మ‌న్‌, ఈవోకు వేంక‌టేశ్వ‌ర స్వామి అంటే భ‌క్తిలేదని, తిరుమ‌ల‌లో రాజ‌కీయాలు చేస్తున్నారంటూ త‌ప్పుడు ప్ర‌చారం చేశాయి. తాజాగా వైసీపీ త‌ప్పుడు ప్ర‌చారాల‌పై టీటీడీ చైర్మ‌న్‌, ఈవో మీడియా స‌మావేశం పెట్టి సీరియ‌స్ అయ్యారు. టీటీడీ పాలక మండలికి, అధికారులకు మధ్య విభేదాలు ఉన్నట్లు వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు. అందరూ సమన్వయంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఆ సంఘటన మినహా మిగతా అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పారు. భక్తులు ప్రశాంతంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటున్నారని స్ప‌ష్టం చేశారు. దీంతో వైసీపీ అస‌త్య ప్ర‌చారాల‌కు ఎండ్ కార్డు ప‌డిన‌ట్ల‌యింది.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు అమిత్ షాకు విందు ఇవ్వనున్నారు. ఈ నెల 18న ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు అమిత్ షాకు హై లెవల్ విందు ఇవ్వనున్నారు
ఇండియన్ స్టార్ పేస్ బౌలర్ బుమ్రా తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులను ఖండించాడు. చాంపియన్ ట్రోఫీకి ముందు తనను బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించినట్లుగా వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవాలని బుమ్రా కొట్టి పారేశారు.
ఏ సంస్థ అయినా ఇక చాలు కావలసినంత సంపాదించేశాం అనుకుంటుందా? ఇంత సంపాదించేశాను, ఇక కంపెనీని మూసేస్థానని ఏ వ్యాపారవేత్తైనా చెబుతారా? అన్న ప్రశ్నకు అమెరికాకు చెందిన ఇన్వెస్ట్ మెంట్ రీసెర్చ్ కంపెనీ హిండెన్‌బర్గ్ వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్ తాను అలాగే చెబుతాను, అదే చేస్తాను అంటున్నారు.
ఢిల్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ మరో రెండు గ్యారంటీలను విడుదల చేసింది.  ప్రతీ నెల 300 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించిన వారికి ఉచిత  కరెంట్  గ్యారెంటీని ప్రకటించింది.
ఫార్ములా ఈ రేస్ కేసులో  మాజీ మంత్రి  కెటీఆర్ గురువారం బషీర్ బాగ్ లోని ఈ డీ కార్యాలయానికి చేరుకున్నారు. గచ్చిబౌలిలోని  తన నివాసం నుంచి కెటీఆర్ నేరుగా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. భోజ్ పురి యువ నటుడు, యాక్షన్ హీరో సుదీప్ పాండే బుధవారం (జనవరి 15) గుండెపోటుతో కన్నుమూశారు. తన సినిమా షూటింగ్ స్పాట్ లోనే ఒక్కసారిగా కుప్పకూలి సుదీప్ పాండేను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో గత ఐదేళ్ల జగన్ మయాంలో అరాచకత్వం రాజ్యమేలింది. ఐదేళ్ల జగన్ పాలన అంతా అవినీతి, అరాచకం, దౌర్జన్యం, దోపిడీ అన్నట్లుగా సాగింది. ఆ పార్టీ నేత‌లు యధేచ్ఛగా అందినకాడికి ప్ర‌భుత్వ భూములు, అట‌వీ భూములు, ప్రైవేట్ భూముల‌ను క‌బ్జా చేసేశారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిని అక్రమ కేసులు, అరెస్టులతో వేధింపులకు గురి చేశారు.
కొత్త పరిశ్రమల ఏర్పాటు మాట అటుంచి రాష్ట్రం నుంచి ఉన్న పరిశ్రమలే తరలిపోయిన పరిస్థితి గత ఐదేళ్లలో జగన్ హయాంలో చూసిన ఆంధ్రప్రదేశ్ కు ఇప్పుడు పరిశ్రమలు క్యూకడుతున్నాయి.ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు అత్యంత భద్రమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను ఎంచుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికత, ఆయన ప్రభుత్వ పారిశ్రామిక విధానం కారణంగా రాష్ట్రానికి పెట్టుబడులు తరలివస్తున్నాయి.
తెలుగుదేశం సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది. సంక్రాంతి పండుగ వేళ పార్టీ సభ్యత్వాలు కోటి దాటాయి. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ బుధవారం (జనవరి 15) అధికారికంగా ప్రకటించింది.
అధికారంతో వచ్చిన అహంకారమో, లేక మహిళల పట్ల నిజంగానే చిన్న చూపో కానీ బీజేపీ నేతలు మహిళల విషయంలో చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు ఆ పార్టీ ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి. ఇటీవల ఢిల్లీ బీజేపీ నాయకుడు రమేష్ బిధూరి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా వధేరా గాంధీపై చేసిన వ్యాఖ్యల దుమారం చల్లారకముందే.. ఢిల్లీ సీఎం ఆతీశిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వచ్చే నెల 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచారం జోరందుకున్న సంగతి తెలిసిందే.
ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై ఆయన నివాసంలోనే దాడి జరిగింది. గుర్తు తెలియని అగంతకుడు సైఫ్ అలీఖాన్ నివాసంలోకి చొరబడి ఆయనపై కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో సైఫ్ అలీఖాన్ శరీరంపై ఆరు చోట్ల గాయాలయ్యాయి. గాయపడిన సైఫ్ అలీఖాన్ ను హుటాహుటిన లీలావతి ఆస్పత్రికి తరలించారు. దాడి చేసి తప్పించుకుపోయిన అగంతకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక భయంలో బతికారు. జగన్ అరాచక పాలనలో ఏ వర్గమూ స్వేచ్ఛగా, ప్రశాంతంగా జీవించ లేని పరిస్ధితి ఉంది. ఇష్టారీతిగా దోపిడీ, దౌర్జన్యాల పర్వం సాగింది. గత ఏడాది జరిగిన ఎన్నికలలో వైసీపీ ఘోర పరాయాన్ని మూటగట్టుకుని గద్దె దిగడం, తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడంతో రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ, అసౌకర్యం లేకుండా ప్రశాంతంగా వైకుంఠద్వార దర్శనాలు చేసుకునేందుకు వీలుగా టీటీడీ అన్ని ఏర్పాట్లూ చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.