మంత్రివర్గ విస్తరణ:నలుగురిపై వేటు!
Publish Date:Dec 27, 2011
Advertisement
హైదరాబాద్: వచ్చే యేడాది ఫిబ్రవరి రెండో వారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాల ప్రారంభానికి ముందే రాష్ట్ర మంత్రివర్గాన్ని పూర్తి స్థాయిలో విస్తరించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నారు. ఇందులోభాగంగా ప్రజారాజ్యం పార్టీకి చెందిన ఇద్దరు లేదా ముగ్గురు ఎమ్మెల్యేలను తన మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశాలు ఉన్నాయి.అదేసమయంలో ప్రస్తుత మంత్రివర్గంలోని మంత్రుల్లో బొత్స సత్యనారాయణ, పి.శంకర్రావు, కాసు వెంకటకృష్ణాడ్డి, సబితా ఇంద్రాడ్డిలను మంత్రివర్గం నుంచి తప్పించాలని సీఎం దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చినట్టు తేలుస్తోంది. జోడు పదవులతో పాటు రానున్న స్థానిక సమరం, ఉప ఎన్నికలు, ఆ తర్వాత సాధారణ ఎన్నికల దృష్ట్యా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి పార్టీ అధ్యక్షుడిగానే బొత్స సేవలు ఉపయోగించుకోవాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే బొత్సను మంత్రివర్గం నుంచి తప్పించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
ఇకపోతే మంత్రివర్గంలో ఉంటూనే ఆ మంత్రివర్గంపై విమర్శలు గుప్పిస్తున్న మంత్రి పి.శంకర్రావుకు ఉద్వాసన పలకడం ఖాయమైపోయింది. అలాగే, పనితీరు ఆశాజనకంగా లేని కారణంగా కాసు వెంకటకృష్ణారెడ్డికి ఉద్వాసన పలకే అవకాశాలు ఉన్నాయి.రాష్ట్ర తొలి మహిళా హోం మంత్రిగా రికార్డు సృష్టించిన సబితా ఇంద్రారెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డితో సత్సంబంధాలు ఇప్పటికీ ఉన్న నేపథ్యంలో ఆమెకు మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి.మొత్తం మీద ప్రస్తుత మంత్రివర్గంలో మంత్రుల్లో నలుగురిని తప్పించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించనున్నారు. అలాగే, ప్రజారాజ్యం పార్టీకి సముచిత స్థానం కల్పించేందుకు కిరణ్ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.
http://www.teluguone.com/news/content/february-24-10317.html





