ఫాదర్స్ డే వెనుక ఓ విషాదగాథ

Publish Date:Jun 18, 2016

Advertisement

 

మొన్నటివరకూ ఫ్రెండ్‌షిప్ డే, మదర్స్‌ డే... లాంటి రోజుల గురించే వినేవారు. ఇప్పుడు రాన్రానూ ఫాదర్స్ డేకి కూడా ప్రచారం పెరిగిపోతోంది. ప్రతిరోజూ గౌరవించుకోవల్సిన తండ్రి కోసం ప్రత్యేకంగా ఓ రోజేమిటంటూ కొందరు నిష్టూరాలాడుతుంటే... ఆ తండ్రి సేవలని గుర్తించేందుకు ఓ రోజు ఉండటంలో తప్పేమిటన్నది మరికొందరి వాదన. ఏది ఏమైనా ఫాదర్స్ డే ఇప్పటి సమాజంలో ఓ భాగం. అలాగని ఇదేదో ఈ మధ్యకాలంలో వచ్చిన సంప్రదాయం కాదు. దాదాపు వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఓ సందర్భం. ఆ చరత్రలో ఓ విషాదం కూడా దాగి ఉండటమే ఆశ్చర్యపరిచే విషయం.

 

డిసెంబరు, 6-2007: అమెరికాలోని పశ్చిమ వర్జీనియాలో ‘మొనొన్‌గా’ అనే ఓ పట్టణం. ఆ పట్టణం ఓ బొగ్గు గనికి ప్రసిద్ధం. అలాంటి గనిలో ఆ ఉదయం ఓ అసాధారణమైన పేలుడు సంభవించింది. భూమి కంపించిపోయేట్లుగా గని పైకప్పు విరిగిపడిపోయేట్లుగా ఏర్పడిన ఆ పేలుడుతో గనిలోని రెండు భాగాలు కుప్పకూలిపోయాయి. ఆ సమయంలో గనిలో 367 మంది ఉండగా, వారిలో 362మంది చనిపోయారంటే పేలుడు ఏ స్థాయిలో నష్టం కలిగించిందో అర్థం చేసుకోవచ్చు. పేలుడు జరిగిన ప్రాంతానికి రక్షణ బృందాలు చేరుకున్నా పెద్దగా ఉపయోగం లేకపోయింది. గని పై కప్పు కూలిపోవడం, లోపలికి గాలి వెళ్లే వెంటిలేషన్‌ వ్యవస్థ ధ్వంసం కావడంతో... ఎవరినీ పెద్దగా కాపాడలేకపోయారు. అందుకనే అమెరికా చరిత్రలో అతి దారుణమైన మైనింగ్‌ ప్రమాదంగా ఈ విషాదాన్ని పరిగణిస్తారు.

 

మొనొన్‌గా గనిలో అంత భారీ పేలుడు ఎలా సంభవించిందో ఇప్పటికీ అంతుపట్టని విషయమే! గనిలో పేరుకుపోయిన మీథేన్‌ వంటి ప్రమాదకర వాయువులకి ఒక్కసారిగా నిప్పంటుకోవడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ఓ అంచనా. ఈ ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయినవారిలో అత్యధికులు ఇటలీ నుంచి పొట్ట చేతపట్టుకుని వచ్చిన శరణార్థులే కావడం మరో విషాదం. గనిలో పనిచేసేవారు చనిపోవడం మాట అటుంచితే, వారి మీద ఆధారపడి ఉన్న కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి. దాదాపు వేయిమందికి పైగా పిల్లలు అనాథలు అయ్యారని ఓ అంచనా. ప్రభుత్వం ఏదో తూతూమంత్రంగా వీరికి పునరావాసం కల్పించినా... తండ్రి లేని వారి లోటుని మాత్రం ఎవరు తీర్చలేకపోయారు.

 

మొనన్‌గా గనిలో తన తండ్రిని కోల్పోయినవారిలో ‘గ్రేస్‌ గోల్డెన్‌ క్లేటన్‌’ అనే ఆమె ఒకరు. ఆ విషాదంలో చనిపోయిన తండ్రులందరికీ సంతాపంగా స్థానిక చర్చి సాయంతో జులై 1908న ఒక ప్రార్థనా సమావేశాన్ని నిర్వహించారు. ఆ రోజుని ఫాదర్స్‌ డేగా గుర్తించారు. అయితే క్లేటన్‌ నిర్వహించిన ఈ ఫాదర్స్‌ డేకి పెద్దగా ప్రచారం లభించలేదు. కానీ 2010లో ‘సొనారా స్మార్ట్‌ డోడ్‌’ అనే ఆమె 2010లో ఫాదర్స్‌ డేని నిర్వహించాలని తలపెట్టడంతో కథ మళ్లీ మొదలైంది. సొనారా ఫాదర్స్‌ డే ను ప్రారంభించాలని కోరుకోవడం వెనుక ఒక వ్యక్తిగత కారణం కూడా ఉంది. సొనారా తండ్రి ఓ మాజీ సైనికుడు. తన భార్య చనిపోయినా కూడా ఆయన ధైర్యాన్ని కోల్పోకుండా ఆరుగురు పిల్లలను పెంచి పెద్దచేసుకుంటూ వచ్చాడు. అటు యుద్ధ రంగంలో ఎలాగైతే నిబ్బరంతో గెలుపొందాడో, ఇటు విధితోనూ అదే తెగువతో పోరాడాడు. ఆయనలాంటి తండ్రుల గౌరవార్థం ‘ఫాదర్స్‌ డే’ ను నిర్వహించాలనుకుంది సొనారా. స్థానిక చర్చి అధికారులతో సంప్రదింపులు జరిపిన మీదట జూన్ మూడో ఆదివారాన్ని ఫాదర్స్‌డేగా నిర్ణయించారు. అలా తొలి ఫాదర్స్‌ డేని 1910, జూన్‌ 19న నిర్వహించారు. ఈసారి ఫాదర్స్‌ డే కూడా అదే రోజున రావడం గమనార్హం.

 

నిజానికి మదర్స్‌ డేకి ఉన్న ప్రాధాన్యత ఫాదర్స్‌డేకి మొదటి నుంచీ ఉండేది కాదు. మదర్స్‌డేకి అనుకరణ అనీ, వ్యాపారస్తులు మాత్రమే ప్రోత్సహించే పండుగ అనీ తరచూ విమర్శలను ఎదుర్కొంటూ ఉండేది. కానీ రోజురోజుకీ ప్రచారం పెరగడం వల్లనో, లేక తండ్రి పాత్రలో పెనుమార్పులు రావడం వల్లనో... పిల్లల కోసం తండ్రులు పడే శ్రమను గుర్తించే రోజుగా ఫాదర్స్‌ డే ప్రాముఖ్యం నానాటికీ పెరుగుతోంది.

- నిర్జర.

By
en-us Political News

  
మానవ శరీరానికి సంక్రమించే జబ్బులలో చాలా రకాలు ఉంటాయి. వాటిలో హీమోఫిలియా జబ్బు కూడా ఒకటి. చాలా మందికి హీమోఫిలియా అనే జబ్బు..
పెళ్లి అనేది ప్రతి అమ్మాయి జీవితాన్ని మరొక దశలోకి తీసుకుని వెళుతుంది. ఎన్నో ఆశలతో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త ఇంట్లో అడుగుపెడతారు అమ్మాయిలు. కానీ చాలామంది అమ్మాయిలు చెప్పే మాట.. అత్తగారు సరిగా చూసుకోవడం లేదని, అత్తగారు సరిగా మాట్లాడటం లేదని. ప్రతి ఇంట్లో అత్తాకోడళ్ల సంబంధం ఎప్పుడూ...
జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం కోసం తహతహలాడుతూ ఉంటారు.  అందుకోసం చాలా ప్రయత్నాలు కూడా చేస్తుంటారు...
ప్రతి వ్యక్తికి విభిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది; కొందరు చాలా కలివిడిగా ఉంటారు, మరికొందరు నిశ్శబ్దంగా, అంతర్ముఖంగా ఉంటారు. ఈ వ్యత్యాసం ఆధారంగా ఇంట్రోవర్ట్,  ఎక్స్ట్రోవర్ట్ అంటూ రెండు విభాగాలుగా విభజిస్తూ ఉంటారు...
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త , గొప్ప ఆర్థికవేత్త అయిన డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి జయంతి...
ఆశా భోస్లే.. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక చెరగని ముద్ర.  ఆమె గాత్రం కేవలం భారతదేశాన్నే కాకుండా ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించింది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు సోదరి అయినా.. పాటల ప్రపంచంలో..
సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. నేటి బిజీ బిజీ జీవితాలలో మనస్ఫూర్తిగా,  సంతోషంగా గడిపిన క్షణాలు వెతుక్కోవాల్సి వస్తోంది. అందరూ ఉద్యోగాలు చేస్తారు,  వ్యాపారాలు చేస్తారు, సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు....
ప్రపంచంలో అన్ని రకాల మనుషులు  ఉంటారు.  మనుషులకు ఒక్కొక్కరికి ఒక్కో వ్యక్తిత్వం కూడా ఉంటుంది. ప్రపంచంలోని గొప్ప వ్యక్తులను లేదా మన చుట్టూ ఉండే గొప్ప వ్యక్తులు లేదా శక్తివంతమైన వ్యక్తులను గమనిస్తే...
విజయం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక లక్ష్యంగా ఉంటుంది.  చదువు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ప్రతి విషయంలో ఒక లక్ష్యం పెట్టుకుని,  దాన్ని సాధించి,  విజయ బావుటా ఎగరవేయాలని అనుకుంటారు చాలా మంది...
మంచి, చెడు ప్రతి మనిషిలోనూ తప్పకుండా ఉండే గుణాలు.  మనుషులు కొన్ని విషయాల్లో మంచిగా, మరికొన్ని విషయాల్లో చెడ్డగా ఉంటారు. పూర్తీగా మంచితనం ఉన్న మనుషులు, పూర్తీగా చెడ్డగా ఉన్న మనుషులు ఎక్కడా ఉండరు...
అపరాజిత లేదా శంఖు పుష్పాలు నీలం ,  తెలుపు రంగులో ఉంటాయి.  ఈ పువ్వులు  చాలా అందంగా ఉంటాయి. శంఖు పుష్పం మొక్కను దేవతా మొక్కగా పరిగణిస్తుంటారు.  ఈ పువ్వులు  సంతోషం, శ్రేయస్సు,  సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. వేసవిలో...
వేసవి వచ్చేసింది, తీవ్రమైన ఎండ , మండే ఎండలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి.  ఈ ఎండల ఇబ్బందికి తోడు వేసవిలో కరెంట్ కోత కూడా దారుణంగా ఉంటుంది. దీనివల్ల ఇంట్లో ఉండటం చాలా కష్టమవుతుంది.
గుడ్ ఫ్రైడే క్రైస్తవ మతంలో అత్యంత పవిత్రమైన,  భావోద్వేగభరితమైన రోజు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రైస్తవులు యేసు క్రీస్తు శిలువపై మరణించిన సంఘటనను స్మరించుకుంటారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.