గాయని మాత్రమే కాదు బిజినెస్ ఉమెన్ కూడా... ఆశా భోస్లే జీవితంలో చాలా మందికి తెలియని నిజాలివి!

Publish Date:Apr 13, 2026

Advertisement

ఆశా భోస్లే.. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక చెరగని ముద్ర.  ఆమె గాత్రం కేవలం భారతదేశాన్నే కాకుండా ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించింది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు సోదరి అయినా.. పాటల ప్రపంచంలో తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకుని పాటల పల్లకిలో కోయిలలా ప్రయాణిస్తూ వచ్చింది. కానీ సంగీత ప్రపంచాన్ని విషాదం కమ్మేసింది.  ఆమె గాత్రానికి ఇక మౌనంగా ఉండిపోమని విధి శాసించిందేమో.. ఆమె పూర్తీగా తన శ్వాసనే వదిలేసింది.  ప్రముఖ గాయని ఆశా భోస్లే మరణం ఇప్పుడు భారతదేశాన్ని, ప్రపంచాన్ని కూడా   విషాదంలోకి నెట్టివేసింది. వైవాహిక జీవితంలో విషాదం నుండి,  కూతురిని కోల్పోవడం.. ఆమె జీవితంలో ఎన్నెన్నో విషాదాలు కూడా ఉన్నాయి,  ఆమె సాధించిన ఘనతలు ఉన్నాయి.   ఆశా భోస్లే గురించి చాలా మందికి తెలియని విషయాల గురించి తెలుసుకుంటే..

ఆశాభోస్లే ప్రస్తుత వయసు 92 సంవత్సరాలు.. శనివారం ఆమె గుండెపోటుకు గురవడంతో ఆసుపత్రిలో చేరిందని సమాచారం.  ఆయాసం ఎక్కువ కావడం,  ఛాతీ ఇన్పెక్షన్ కారణంగా ఆమె మరణించిందని సోషల్ మీడియా వార్తల సారాంశం.

బాలీవుడ్‌లో పెద్ద బ్రేక్ రాకముందు, ఆశా భోస్లే తన 10 ఏళ్ల చిన్న వయసులోనే సినిమాల కోసం మరాఠీ పాటలు పాడుతూ తన గాన ప్రస్థానాన్ని ప్రారంభించారట. గాయనిగా ఆమె ప్రయాణం అక్షరాలా 80 ఏళ్లకు పైమాటే..

ఆశా బోస్లే ను ముద్దుగా ఆశా తాయ్ అని పిలుచుకుంటారు.  ఆమె రష్యన్, మలయ్ బాషలతో సహా  20 కి పైగా భాషలలో 12వేలకు పైగా పాటలు పాడారు. ఇలా ఇన్ని పాటలు పాడిన నేపథ్య గాయనిగా,  అత్యధిక స్టూడియో ట్రాక్ లను రికార్డ్ చేసినందుకు  గిన్నిస్ వర్డ్ రికార్డ్ లో కూడా ఆమె స్థానం సంపాదించారు.

16 ఏళ్ల వయసులో ఆశా బోస్లే  1949లో తన కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా తనకంటే రెట్టింపు వయసున్న 31ఏళ్ల గణప్రతాప్ భోస్లే తో పారిపోయి వివాహం చేసుకున్నారు.  వీరికి హేమంత్,  వర్ష,  ఆనంద్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆశా, గణ ప్రతాప్ 1960లో విడిపోయారు.

1980లో ఆశా బోస్లే తనకంటే ఆరు సంవత్సరాల చిన్న వాడైన ప్రఖ్యాత సంగీత స్వరకర్త ఆర్.డి బర్మన్ ను వివాహం చేసుకున్నారు.  ఆయనను ముద్దుగా పంచమ్ దా అని పిలిచేవారు. వీరిద్దరూ కలిసి దమ్ మారో దమ్.. పియా తు అబ్ తో ఆజా వంటి ఎన్నో ఎవర్ గ్రీన్ హిట్ లను అందించారు.


కొన్ని వార్తా సమాచారాల ప్రకారం ఆశా కూతురు  వర్ష డిప్రెషన్ తో బాధపడుతూ 56 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకుంది. మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఆమె చిన్న కుమారుడు హెమంత్ 2015లో క్యాన్సర్ తో మరణించాడు.

ఆశా ఒక విజయవంతమైన వ్యాపారవేత్త కూడా, ఆమె పలు దేశాలలో “ఆశాస్” అనే పేరుతో రెస్టారెంట్ల చైన్ ను  నడుపుతున్నారు.

గానంపై ఉన్న అభిరుచితో పాటు, ఆశా భోస్లే తన వంట నైపుణ్యాలకు కూడా ప్రసిద్ధి చెందారు. ఆమె దుబాయ్, కువైట్, అబుదాబి, దోహా , బహ్రెయిన్ వంటి నగరాల్లో 'ఆశాస్' అనే పేరుతో రెస్టారెంట్ల చైన్ ను  నడుపుతున్నారు.


ఆశా గారెకి శాస్త్రీయ సంగీతంలో చాలా లోతైన పరిజ్ఞానం ఉందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.

ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్‌తో కలిసి 'లెగసీ' అనే ఆల్బమ్‌లో పనిచేసినందుకు ఆమె గ్రామీ నామినేషన్ గెలుచుకుంది.

పాప్ , ఫ్యూజన్ ప్రధాన స్రవంతిగా మారడానికి చాలా కాలం ముందే, వాటితో ప్రయోగాలు చేసిన తొలి భారతీయ గాయకులలో ఆమె ఒకరు.

ఆశా భోస్లే కూడా నటనారంగంలోకి అడుగుపెట్టి, 2013లో 'మై' అనే మరాఠీ చిత్రంలో తల్లి పాత్రతో రంగప్రవేశం చేశారు.

తన విశిష్టమైన కెరీర్‌లో ఆశా భోస్లే అనేక గౌరవాలను అందుకున్నారు. 2000లో భారత ప్రభుత్వం ఆమెకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేయగా, 2008లో పద్మవిభూషణ్‌ను ప్రదానం చేసింది.


ఆమె జీవితం క్రమశిక్షణ, సాహసోపేతమైన నిర్ణయాలు,
నిరంతరం కొత్త ఆవిష్కరణలు చేయడం వంటి వాటితో ఆమె జీవితం నిండి ఉంది.

                             *రూపశ్రీ.

By
en-us Political News

  
 పిల్లల ముందు బట్టలు మార్చుకోవడం వల్ల పెద్దగా నష్టం ఏమీ ఉండదని అనుకుంటారు.  సాధారణంగా ఇంట్లో మగవాళ్లు అయినా ఆడవాళ్లు అయినా పిల్లలు ఉన్నా పెద్దగా పట్టించుకోకుండా బట్టలు మార్చుకుంటారు.
5 Habits Every Father Should Give Up for His Daughter,Every Father Needs to Hear These 5 Parenting Tips,5 Habits to Leave Behind
Signs of a Healthy Family Environment,Healthy Family or Toxic EnvironmentIs Your Family Environment Healthy
పిల్లల వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం , ఆలోచనా విధానం మొదలైన విషయాలలో  తల్లిదండ్రులిద్దరూ కీలక పాత్ర పోషిస్తారు. తల్లి ప్రేమ, శ్రద్ధ పిల్లల భావోద్వేగ పునాదిని బలపరిస్తే.. తండ్రి ప్రవర్తన, క్రమశిక్షణ, మాటతీరు,   జీవనశైలి వంటివి  పిల్లలపై చాలా గట్టి  ప్రభావాన్ని చూపుతాయి.
ప్రతి వ్యక్తికి తన జీవితంలో బోలెడు బలం, ప్రశాంతత,  ఆత్మవిశ్వాసం,  జీవితం మీద భరోసా కలిగేది కుటుంబం వల్లనే.
వివాహం కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ముడిపడేదే కాదు.. రెండు కుటుంబాల మధ్య ముడిపడే బంధం. భారతదేశంలో చాలా వరకు వివాహం తర్వాత అమ్మాయి అత్తవారింటికి వెళుతుంది. భర్త, అత్తమామలతో కలిసి జీవిస్తుంది. అత్తారింట్లో అత్తమామలు మంచివాళ్లు, కోడలిని అర్థం చేసుకుని బాగా చూసుకునేవాళ్లు అయితే ఆ ఇంట్లో ఆడపిల్ల సంతోషంగా ఉంటుంది...
వేసవి సెలవలు పూర్తయ్యాక పిల్లలు స్కూల్ కు వెళ్లడం అనేది సహజం. పాఠశాలకు వెళ్లడం పిల్లల జీవితంలో పెద్ద మార్పుగా మారుతుంది. మరీ ముఖ్యంగా కొత్తగా స్కూల్ లో జాయిన్ అయిన పిల్లల విషయంలో...
ప్రజల జీవితాలలో ముఖ్యమైనవి సంబంధాలు. నేటికాలంలో ఇంటర్నెట్, డిజిటల్ పరంగా ఎంత దూరంలో ఉన్నా ఎవరినీ పెద్దగా మిస్ కాకుండా పక్కనే ఉన్నట్టుగా పోన్ మాట్లాడటం, వీడియో కాల్స్ చేయడం వంటి మార్గాలలో దగ్గరగానే ఉన్నట్టు ఫీల్ అవుతారు. కానీ బంధాల మధ్య గతంలో కంటే అపార్థాలు, గొడవలు, అతిగా స్పందించడం..
మొబైల్ వ్యసనం మీ మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, నిద్ర, మానసిక ఆరోగ్యంపై మొబైల్ వల్ల కలిగే సమస్యలు మరియు వాటి నుంచి బయటపడే మార్గాలను MindVision వేణుగోపాల్ ఈ వీడియోలో సులభంగా వివరించారు...
ఒక ఉత్తమమైన తరాన్ని సమాజానికి ఇచ్చే ఉద్దేశంతో వివాహం చేసుకుంటారని పెద్దలు చెబుతారు. ఆరోగ్యకరమైన బంధం ద్వారా  ఒక మంచి తరం తయారవుతుంది. కుటుంబం విషయానికి వస్తే.. వంశం ముందుకు సాగడం అనేది పిల్లల ద్వారానే జరుగుతుంది...
నేటి కాలంలో, సంబంధాలు బలపడటానికి , విచ్ఛిన్నం కావడానికి కమ్యూనికేషన్ సరిగా లేకపోవడమే అతిపెద్ద కారణంగా మారింది. అది కుటుంబ సంబంధం అయినా, స్నేహ సంబంధం అయినా, లేదా మరేదైనా వ్యక్తిగత సంబంధం అయినా..
చుట్టూ ఉన్నవాళ్లు అందరూ మంచివాళ్లు ఉండరు. మనుషుల్లో మంచి, చెడు రెండూ ఉంటాయి. కానీ కొందరిలో స్వార్థం..
నేటి వేగవంతమైన జీవితంలో మనుషులకు అన్ని భౌతిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ, రెండు విషయాలలో మాత్రం  వెనుకబడిపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మొదటిది గాఢమైన, నిజమైన సంబంధాలను నిలబెట్టుకోవడం కాగా, రెండవది మనశ్శాంతి లేకపోవడం
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.