రైతు సమస్యల కోసమే జగన్ దీక్ష:బాజిరెడ్డి
Publish Date:Jan 8, 2012
Advertisement
నిజామాబాద్: రైతు సమస్యల కోసమే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆర్మూర్‌లో దీక్ష చేస్తున్నారన్నారని ఆ పార్టీ నేత బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి ఆదివారం నిజామాబాద్‌లో అన్నారు. పార్టీ ఆవిర్భావం తర్వాత ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకంగా అయన మాట్లాడలేదని, ఆయన పర్యటనను తెలంగాణవాదులు ఎవరూ అడ్డుకోవద్దని బాజిరెడ్డి అన్నారు. అప్పుల బాధతో తెలంగాణ ప్రాంతంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వం రైతులకు పదిశాతం రుణాలు కూడా ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రాంత మనోభావాల్ని తమ పార్టీ గౌరవిస్తుందన్నారు.కాగా ఈ నెల పదవ తేది నుండి పదమూడవ తేది వరకు తెలంగాణ జిల్లాల్లో జగన్ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్‌లో ఆయన రైతుల కోసం దీక్ష చేయనున్నారు. గతంలో వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్‌లో ఓదార్పు యాత్ర కోసం వచ్చిన జగన్‌పై తెలంగాణవాదులు పార్లమెంటులో ఆయన వైఖరికి నిరసనగా రైల్వే స్టేషన్లోనే రాళ్ల దాడి చేశారు. దీంతో ఆయన అప్పటి నుండి ఇప్పటి వరకు తెలంగాణ జిల్లాల్లో పర్యటించలేదు.
http://www.teluguone.com/news/content/farmer--24-10751.html





