యానాం దాడులు:రాజకీయ దురుద్దేశంతోనే
Publish Date:Jan 28, 2012
Advertisement
కాకినాడ: కర్మాగారం పునరుద్ధరణపై ఇప్పుడే ఏమీ చెప్పలేనని, 700 కోట్లు రూపాయలతో నెలకొల్పిన సంస్థను ఇప్పుడు నడపడం కష్టమేనని రీజెన్సీ సిరామిక్స్ చైర్మన్ జిఎన్ నాయుడు మీడియా ప్రతినిధులతో అన్నారు. యానాం దాడుల వెనక రాజకీయ నేతల హస్తం ఉందని, రాజకీయ దురుద్దేశంతోనే దాడులు చేశారని అయన అనుమానించారు. శుక్రవారంనాటి ఘటనలో మృతి చెందిన సంస్థ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ మృతేదేహానికి శనివారం కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం జరిగింది. చంద్రశేఖర్ భౌతిక కాయానికి నాయుడు నివాళులు అర్పించారు. ఈ ఘటనపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
కాగా దాడుల వల్ల 600 కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లిందని, బూడిద కుప్పలు మాత్రమే మిగిలాయని ఆయన అన్నారు. కొందరు గుండాలు దాడులకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. తన మేనకోడలి భర్తను దారుణంగా చంపారని ఆయన ఆరోపించారు. తాను కార్మికులను బాగా చూసుకున్నానని ఆయన చెప్పారు. 1200 మంది కార్మికుల భవిష్యత్తు, 2500 మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఆయన ఆవేదిన వ్యక్తం చేశారు. రీజెన్సీ సిరామిక్స్ వద్ద 24 గంటల పాటు గస్తీ ఏర్పాటు చేసినట్లు డిఐజి శుక్లా చెప్పారు. నాలుగు బృందాలతో ఘటనపై దర్యాప్తు చేయిస్తున్నట్లు ఆయన తెలిపారు.
http://www.teluguone.com/news/content/factory-24-11343.html





