ఇథనాల్ పెట్రోల్ పై ఎక్సైజ్ సుంకం మినహాయింపు.. కేంద్రం సంచలన నిర్ణయం

Publish Date:Jun 11, 2026

Advertisement

పర్యావరణ పరిరక్షణతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.  పెట్రోల్‌లో అధిక శాతం ఇథనాల్‌ను కలిపి విక్రయించే సరికొత్త ఇంధన రకాలపై ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా మినహాయించింది. పర్యావరణానికి మేలు చేసే స్వచ్ఛ ఇంధనాల వినియోగాన్ని   ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.  

కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం.. పెట్రోల్‌లో 22 శాతం నుండి 30 శాతం వరకు ఇథనాల్ మిశ్రమం ఉండే సరికొత్త ఇంధన రకాలకు ఈ పన్ను మినహాయింపు లభించనుంది. దీని పరిధిలోకి ఈ22 , ఈ25 , ఈ27,  ఈ30 రకాలు వస్తాయి.  ఈ నిర్ణయం దేశీయ ఇంధన మార్కెట్లో విప్లవాత్మక మార్పులకు వేదిక కానుందని పర్యవారణ, ఆర్థిక నిపుణులు అంటున్నారు. సాధారణంగా లీటర్ పెట్రోల్‌పై పడే ఎక్సైజ్ సుంకం భారం తగ్గడం వల్ల, రాబోయే రోజుల్లో ఈ ఇంధనాలు వినియోగదారులకు మరింత అందుబాటు ధరల్లోకి వచ్చే అవకాశం ఉంది. 

ప్రస్తుతం భారతదేశం తన ముడి చమురు అవసరాల కోసం అత్యధికంగా ఇతర దేశాల దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఈ అంతర్జాతీయ దిగుమతుల భారాన్ని గణనీయంగా తగ్గించుకోవడం..  అదే సమయంలో దేశీయంగా వ్యవసాయ ఆధారిత వనరుల నుండి ఉత్పత్తి అయ్యే స్వచ్ఛమైన ఇథనాల్ వినియోగాన్నిపెంచడం ఈ నిర్ణయానికి కారణంగా చెబుతున్నారు.  దీనివల్ల దేశీయంగా ఇథనాల్‌ను ఉత్పత్తి చేసే రైతాంగానికి, పరిశ్రమలకు ఆర్థికంగా మేలు జరుగుతుంది.

నిజానికి..  ఈ పన్ను మినహాయింపు ప్రకటనకు కొన్ని రోజుల ముందే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్  ఈ22, ఈ25, ఈ27, ఈ30 పెట్రోల్ మిశ్రమాలకు సంబంధించిన సరికొత్త నాణ్యతా ప్రమాణాలను  విడుదల చేసింది. ఇంధనంలో ఇథనాల్ శాతం ఎంత ఉండాలి, ఆక్టేన్ రేటింగ్ ఏ స్థాయిలో నిర్వహించాలి, సల్ఫర్ పరిమితులు ఎంతవరకు ఉండాలి అనే సాంకేతిక,  భద్రతాపరమైన కఠిన నిబంధనలను ఇప్పటికే అమల్లోకి తెచ్చారు. ఇప్పుడు తాజాగా కేంద్రం   ఎక్సైజ్ సుంకం మినహాయింపు కూడా ఇవ్వడంతో, ఈ సరికొత్త ఇంధన రకాల తయారీకి,  మార్కెటింగ్‌కు అవసరమైన పూర్తి సాంకేతిక, ఆర్థిక మద్దతు లభించినట్లయింది. 

By
en-us Political News

  
నల్లమలలో సోదాలు.. కౌకూర్‌, యాప్రాల్‌, అచ్చంపేటలో ఆయుధాల కోసం గాలింపు..!
హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్యనగర్‌లోని హరిహర మెన్ హాస్టల్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. తోటి పనివాడు ప్రమోద్ జరిపిన కత్తిపోట్లకు కుక్ శశిధర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఢిల్లీ ఎర్రకోట బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ సంచలన చార్జ్‌షీట్ దాఖలు చేసింది. 11 మంది ప్రాణాలు తీసిన ఈ ఘటన వెనుక లాల్ మందిర్ దాడి కుట్ర, మూత్రం నుంచి బాంబు తయారీ, 12 సార్లు రెక్కీ నిర్వహించిన విస్తుపోయే వివరాలు వెలుగులోకి వచ్చాయి.
అమెరికాలోని పెన్సిల్వేనియా ల్యాంకాస్టర్ కౌంటీలో ఎఫ్రాతా పోలీసులు చేపట్టిన కీలక అరెస్ట్ వివరాలు. క్రైమ్‌వాచ్ నిఘా మరియు తాజా క్రైమ్ అప్‌డేట్స్ కోసం చదవండి.
ఒడిశా కోరాపుట్ పరిధిలోని బాలిపేట సేవాశ్రమం హాస్టల్‌లో 9వ తరగతి విద్యార్థి సీయారా తాడింగిపై సహవిద్యార్థి తీవ్రంగా దాడి చేశాడు. మత్తు పదార్థాల ప్రభావంతోనే ఈ దాడి జరిగిందని, ర్యాగింగ్ అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆయుధాలు చోరీ అయ్యాయి అంటూ సీన్ క్రియేట్ చేసిన ఇంటి దొంగలు..!
లండన్ వీసాలు, ఉద్యోగాల పేరిట మోసాల ఆరోపణలతో యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందనను విజయవాడ పోలీసులు 4 గంటల పాటు విచారించారు. బిగ్ బాస్ తెలుగు 10 ఎంట్రీ ప్రచారం, రూ. 15 లక్షల ఫిర్యాదు మరియు పోలీసులకు ఆమె ఇచ్చిన షాకింగ్ స్టేట్‌మెంట్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో అక్రమ ఇసుక దందాపై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఎర్ధనూర్ సర్వే నెంబర్ 134లోని నక్క వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న 6 ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేశారు. వాల్టా చట్టం ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.
లండన్ ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ పేరిట రూ.15 లక్షల మోసానికి పాల్పడిన ఆరోపణలపై నందూస్ వరల్డ్ యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు మరియు సీఐ సుబ్రహ్మణ్యం అందించిన పూర్తి సమాచారం ఇక్కడ చదవండి!
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని పహుజ్ డ్యామ్ వద్ద సోషల్ మీడియా రీల్ కోసం 30 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకిన యువకుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వైరల్ స్టంట్ వికటించిన పూర్తి వివరాలు మరియు వీడియో కథనం ఇక్కడ చదవండి.
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.