Publish Date:Jun 11, 2026
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పీక్స్ కు చేరాయి. అమెరికా దాడులకు నిరసనగా స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ను పూర్తిగా మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ జలసంధి గుండా ఏ నౌకా ప్రయాణించడానికి వీల్లేదనీ, ఒకవేళ ఈ జలసంధి గుండా ప్రయాణానికి ఏ నౌక ప్రయత్నించినా.. తమ సైన్యం దాడి చేస్తుందని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్జీసీ) హెచ్చరించింది. ప్రపంచ ఇంధన అవసరాలను తీర్చే ముడి చమురు రవాణాలో హెర్మూజ్ జలసంధి అత్యంత కీలకం కావడంతో ఇరాన్ నిర్ణయం ప్రపంచదేశాలను షాక్ కు గురి చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు యూఎస్ మిలిటరీ సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఇరాన్‌లోని పలు తీర ప్రాంత లక్ష్యాలపై దాడులు ప్రారంభించిన గంటల వ్యవధిలోనే ఇరాన్ హెర్మూజ్ జలసంధి మూతను ప్రకటించింది.
కాగా బందర్ అబ్బాస్, సిరిక్, మినాబ్, కేశ్మ్, హెంగామ్ ఐలాండ్స్ పరిసరాల్లోని కనీసం ఏడు తీర ప్రాంతాలపై అమెరికా దాడులు చేసింది. ఈ క్రమంలోనే హర్మూజ్ జలసంధి పరిసరాల్లో అమెరికా బలగాలు, ఇరాన్ నావికా దళాలకు మధ్య భీకరపోరు జరిగింది.
ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు గల్ఫ్ ఆకాశంలో ప్రయాణిస్తున్న ఒక అమెరికన్ ఎఫ్-16ఫైటర్ జెట్‌పైకి క్షిపణిని ప్రయోగించి, దానిని వెనక్కి మళ్లించాయి. అదలా ఉంటే.. హెర్మూజ్ జలసంధి మూసివేత ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కోలుకోలేని దెబ్బగా పరిణమించే ప్రమాదం ఉంది. ఎందుకంటే అంతర్జాతీయంగా సముద్ర మార్గం ద్వారా రవాణా అయ్యే ముడి చమురులో దాదాపు 30 శాతం ఈ జలసంధి గుండానే సాగుతుంది. గతంలో సంక్షోభం ప్రారంభమైన రోజుల్లోనే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు ఏకంగా 126 డాలర్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇప్పుడు ఇరాన్ ఈ మార్గాన్ని పూర్తిగా మూసివేయడంతో.. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మరోసారి భగ్గుమనే అవకాశం ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/closure-of-the-strait-of-hormuz-36-222536.html
వ్యాపార పెట్టుబడుల పేరుతో నమ్మించి, విదేశాల నుంచి మహిళలను రప్పించి, వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఉదంతం ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ అమానుష కాండలో పాకిస్థాన్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి అయిన ఇషాక్ దార్ సమీప బంధువు ప్రధాన నిందితుడిగా ఉండటం పాక్ రాజకీయాల్లో దుమారం రేపుతోంది.
పోలీస్, జైళ్లు, అగ్నిమాపక శాఖ, అలాగే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వంటి విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనుంది. మొత్తం 7వేల పోస్టులలో ఇప్పటికే 5వేల పోస్టుల భర్తీకి సంబంధించిన జీవోలను జారీ చేసింది. మిగిలిన 2వేల పోస్టులకు సంబంధించిన జీవోలు కూడా నేడో రేపో వెలువడనున్నాయని అధికార వర్గాల సమాచారం.
బండ్ల గణేష్, ఆయన తండ్రి, సోదరుడు ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్న శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ వ్యాపార అవసరాల కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి భారీ మొత్తంలో రుణాలు తీసుకుంది. ఈ బ్యాంకు రుణాలకు గ్యారెంటీగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలోని షేక్‌పేట్‌లో ఉన్న సుమారు 500 గజాల నివాస భవనాన్ని వారు తాకట్టు పెట్టారు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో అసాధారణ ఆటతీరుతో వెలుగులోకి వచ్చిన ఈ యంగ్ బ్యాటర్ ఇంటర్నేషనల్ ఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో వైభవ్‌కు తుది జట్టులో చోటు దక్కకపోవడంపై క్రికెట్ దిగ్గజాల విమర్శించడమే కాకుండా, సోషల్ మీడియా వేదికగా కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లక్ష్యంగా నెటిజనులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఇరాన్ మాజీ అత్యున్నత నాయకుడు (సుప్రీం లీడర్) అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల క్రతువుకు సంబంధించి అంతర్జాతీయంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
సోషల్ మీడియా దిగ్గజం మెటా యాజమాన్యంలోని ప్రముఖ ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌పై భారత ప్రభుత్వం అత్యంత తీవ్రమైన చర్యకు ఉపక్రమించింది.
రాష్ట్ర పోలీసు శాఖ పని తీరును మరింత ప్రజలకు చేరువ చేసే దిశగా డీజీపీ ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పన, స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా కుప్పం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ జరిగి దశాబ్ద కాలం దాటినా, రాష్ట్రానికి ఒక శాశ్వతమైన, తిరుగులేని రాజధానిని నిర్మించుకోలేకపోవడం తెలుగు జాతి దురదృష్టం.
ఆంధ్రప్రదేశ్‌లోని మామిడి సాగుదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది.
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానంతరం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరించే శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు ఈ ఏడాది జూన్ నెలలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ రాజకీయ దుమారం రేపుతోంది.