Publish Date:Apr 14, 2026
జగిత్యాల ముఖ్య నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతు రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులను పంచుకోవాలనే ఉద్దేశంతో మీతో ఈ సమావేశం నిర్వహించానని తెలిపారు.మేము ఎప్పుడూ జీవన్ రెడ్డిని తక్కువ చేసి చూడలేదు. ఆయన మర్యాదను దెబ్బతీసేలా ఎప్పుడూ ఆయన మర్యాదను దెబ్బతీసేలా ఎప్పుడూ మాట్లాడలేదు. ఆయన గౌరవాన్ని తగ్గించేలా వ్యవహరించలేదని రేవంత్ వెల్లడించారు. 2023 ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం మనమంతా కృషి చేశాం. పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన్ని కరీంనగర్ నుంచి పోటీ చేయాలని సూచించాం.
అయితే ఆయన నిజామాబాద్ నుంచి పోటీ చేయాలనే అభ్యర్థన మేరకు పార్టీ టికెట్ ఇచ్చింది. దురదృష్టవశాత్తు ఆయన ఓడిపోయారని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా జీవన్ రెడ్డి సూచించిన అభ్యర్థులకే టికెట్లు కేటాయించాం. భవిష్యత్తులో ఆయనకు, ఆయన కుటుంబ సభ్యుల రాజకీయ భవిష్యత్తుకు హామీ ఇచ్చినా ఆయన వినలేదు. మొండి పట్టుదలతో జీవన్ రెడ్డి పార్టీని వీడారు. 40 ఏళ్లుగా ఆయన కోసం పనిచేసిన కార్యకర్తలను నిరాశపరుస్తూ, కేసీఆర్‌తో కలిశారని ముఖ్యమంత్రి అన్నారు.
జీవన్ రెడ్డి లాంటి వ్యక్తి కేసీఆర్ వద్ద చేతులు కట్టుకుని నిలబడటం బాధాకరం. జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని ఆయన కేసీఆర్ కాళ్ల వద్ద తాకట్టు పెట్టినట్లైందని.. ఆయన వయస్సుకు, అనుభవానికి ఇది తగినది కాదు. అయినప్పటికీ, ఈనాటికీ ఆయన గౌరవానికి భంగం కలిగేలా నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదని ముఖ్యమంత్రి తెలిపారు. మనం కుట్రలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంటే, ఆయన వెళ్లి అక్కడ చేరడం బాధాకరం.
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కాపాడటం తప్పా అనే విషయాన్ని మీరు ఆలోచించాలి. నేను చేస్తున్నది మంచిదా చెడా అన్నది మీరు నిర్ణయించండి. ఎవరు ఏమిటి అన్నది కాలమే తేలుస్తుంది. మీరు అందరూ అండగా నిలవాలి. మళ్లీ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలి. ధైర్యంగా ఉండండి. త్వరలోనే కార్యకర్తలను కలిసేందుకు జగిత్యాలకు వస్తాను. మనమంతా కలిసికట్టుగా జగిత్యాలను అభివృద్ధి చేసుకుందాం. వ్యక్తికంటే పార్టీ ముఖ్యమని నిరూపించిన మీ అందరినీ అభినందిస్తున్నాని సీఎం రేవంత్ తెలిపారు
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cm-revanth-reddy-meeting-with-jagityala-concludes-36-217373.html
ఈ అసామాన్య ధైర్యాన్ని ప్రదర్శించిన ఆటో డ్రైవర్ జాహెర్‌ను హైదరాబాద్ సీపీ సజ్జనర్ మంగళవారం బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీలోని తన ఛాంబర్ లో ప్రత్యేకంగా సన్మానించారు. ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు.
ఈ విచారణలో విస్తు పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం రిచ్ కిడ్స్ను మాత్రమే టార్గెట్ చేసుకొని వారితో మెల్లిమెల్లిగా సోషల్ మీడియా వేదిక ద్వారా పరిచయం పెంచుకుం టున్నారు. సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన లైఫ్ స్టైల్ చూపిస్తూ ప్రొఫైల్ తయారు చేసుకున్నారు. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో ఎస్కార్ట్ గా ఉంటూ రొమాంటిక్ మూడ్ అంటూ మైనర్లకు వల విసురుతున్నారు.
ఈ కొత్త జోన్ వచ్చెనెల మొదటి తేదీ నుంచీ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని నోటిఫికేషన్ పేర్కొంది. దీంతో, ఇండియన్ రైల్వేలో దక్షిణ కోస్తా రైల్వే 18వ జోన్‌గా అవతరించనుంది.
ఈ ఆపరేషన్‌లో మొత్తం ఆరు స్టోన్ క్రషింగ్ యూనిట్లను నేలమట్టం చేయడంతో పాటు.. 12 ఆర్‌ఎంసీ ప్లాంట్లను పూర్తిగా తొలగించారు. భవిష్యత్తులో అక్కడ మళ్లీ క్రషింగ్ కార్యకలాపాలు జరగకుండా యంత్ర సామగ్రిని స్వాధీనం చేసుకుని తరలించారు. గతంలో మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖలు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ యథేచ్ఛగా కార్యకలాపాలు కొనసాగించడంతో ఈసారి శాశ్వతంగా చెక్ పెట్టినట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు.
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 21 బంతుల్లోనే ఒక ఫోరు, 8 సిక్సర్లతో 63 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
డ్రోన్ దాడి జరిగిన వెంటనే పెట్రోలియం జోన్‌లోని ఒక విభాగంలో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ముగ్గురు భారతీయులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సహాయక బృందాలు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతోంది.
చాందీ ఉమ్మన్, తన తండ్రి పేరిట ఉన్న రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తూ భారీ మెజారిటీతో విజయం సాధించారు.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కేరళలోని కన్నూర్ కు బయలుదేరిన ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది.
పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి మళ్లీ గెలిచారు. ఎన్టీఏ కూటమి భాగస్వామిగా రెండో సారి పదవీ స్వీకారానికి సిద్దమయ్యారు.
అవి 2021 తమిళనాడు శాసన సభ ఎన్నికలు...
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దక్షిణాది రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.