ఫుట్ పాత్‌పై ఆక్రమణల కూల్చివేతలు

Publish Date:Apr 8, 2026

Advertisement

 

మేడ్చల్ మల్కాజిగిరి ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మల్కాజిగిరి చౌరస్తాలో ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు చర్యలను మున్సిపల్ అధికారులు ప్రారంభించారు. చౌరస్తా ఇరువైపులా ఫుట్‌పాత్‌లను ఆక్రమించి ఏర్పాటు చేసిన దుకాణాలు, తాత్కాలిక షెడ్లు, స్టాళ్లను అధికారులు తొలగిస్తు న్నారు. టౌన్ ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఈ చర్యలు కొనసాగుతు న్నాయి. ఆక్రమణల తొలగింపులో భాగంగా జేసీబీలు, మున్సిపల్ సిబ్బంది రంగంలోకి దిగి ఫుట్ పాత్ పై ఉన్న షాపులను తొలగిస్తున్నారు. 

ముందుగా ఎటువంటి సమాచారం లేకుండా అకస్మాత్తుగా అధికారులు వచ్చి ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు తొలగించడంతో దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  “కొద్దిగా సమయం ఇవ్వండి, మేమే మా సామాను తీసేస్తాం” అంటూ వ్యాపారులు విజ్ఞప్తి చేశారు. అయితే ట్రాఫిక్‌కు అంతరా యం కలగకుండా, పాదచారుల సౌకర్యం కోసం వెంటనే చర్యలు తీసుకోవాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. 

ఈ సందర్భంగా ఫుట్‌ పాత్‌పై వ్యాపారం చేసుకుంటున్న చిరు వ్యాపారులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ కొంత ఉధృత వాతావరణం నెలకొని ఉంది. పాదచారుల భద్రత, ట్రాఫిక్ సౌలభ్యం దృష్ట్యా ఫుట్‌పాత్ ఆక్రమణలపై ప్రత్యేక డ్రైవ్ కొనసాగు తుందని మున్సిపల్ అధికారులు తెలిపారు. పరిస్థితి ఉదృతంగా మారడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై చిరు వ్యాపారుల సామాన్లన్నీ తీసుకునే వరకు వెయిట్ చేసి అనంతరం కూల్చి వేసే పనులు చేపట్టారు.

By
en-us Political News

  
కరీంనగర్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి.
చిత్తూరు జిల్లా పలమనేరు పరిధిలోని కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చువరీలో ఉన్న కుంకీ ఏనుగులకు.. ఈ ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. మనుషులకు ఉండే ఆధార్ తరహాలోనే ఈ కార్డులను రూపొందించనుంది
మోదీ తన ఎక్స్ ఖాతా డీపీగా ఆపరేషన్ సిందూర్ ఫోటోను పెట్టుకొని సైన్యానికి గౌరవం ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఈ మెరుపు దాడిని చేపట్టిన సంగతి తెలిసిందే.
​చెన్నూరుకు చెందిన యోగేంద్ర కుమార్ వర్మ, హేమశ్రీ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కాలక్రమేణా ఆ స్నేహం ప్రేమగా మారింది. వారి మధ్య ఉన్న అనుబంధం ఎంతో బలమైనది. అయితే.. గత కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య చిన్నపాటి వివాదాలు తలెత్తినట్లు సమాచారం.
కుటుంబ సభ్యులతో మాట్లాడిన అల్లు అరవింద్, ప్రమాదం వల్ల వారికి కలిగిన బాధను పంచుకుంటూ ధైర్యం చెప్పారు. బాలుడి చికిత్సకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో శ్రీతేజ్ సోదరి చదువుల బాధ్యతను తాను తీసుకుంటానని అల్లు అరవింద్ ప్రకటించారు.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన ఆరెంజ్ ఆర్మీ.. పంజాబ్‌పై 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆరంభం నుంచే సన్ రైజర్స్ బ్యాటర్లు పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడి సిక్సర్లు, ఫోర్లతో పరుగుల వర్షం కురిపించారు.
నార్త్ 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్‌గ్రామ్‌లో బుధవారం రాత్రి ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు అతి సమీపం నుంచి కాల్చి హత్య చేశారు. దోహరియా ప్రాంతంలోకి ఆయన కారును వెంబడించి వచ్చిన దుండగులు చంద్రనాథ్ రథ్‌పై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు.
హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-IIకు ఆమోదం తెల‌పాల‌ని కేంద్ర ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్ట‌ర్‌కు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిపై వరంగల్ సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ తక్షణం క్షమాపణలు చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.
రిటైర్డ్ డీజీపీ బి. శివధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర భద్రతా సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు.
తన పర్యటనల సమయంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశాలు
వరంగల్ జిల్లాలో నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సు వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.