సోషల్ మీడియా హీరో భరత్ భూషణ్ తివారి ఎన్‌కౌంటర్.. బీహార్‌లో అసలేం జరిగింది?

Publish Date:Jun 24, 2026

Advertisement

తెలుగువన్ ఎక్స్ క్లూజివ్

బీహార్‌ రాష్ట్రంలో  సంచలనంగా మారిన ఇండిపెండెంట్ జర్నలిస్ట్ భరత్ భూషణ్ తివారి ఎన్‌కౌంటర్ ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. సోషల్ మీడియా వేదికగా లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్న ఒక సాధారణ డిజిటల్ జర్నలిస్ట్, తుపాకీ పట్టుకుని లైవ్‌ స్ట్రీమింగ్ చేస్తూ చివరకు పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోవడం వెనుక ఉన్న అసలు నిజాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ ఎన్ కౌంటర్ పై ప్రముఖ విశ్లేషకుడు భరద్వాజ్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు. షాపూర్ ప్రాంతంలో వరద ముంపునకు గురవుతున్న అట్టడుగు వర్గాలు, నిర్వాసితుల పక్షాన నిలబడి నిలదీసే ఒక సాహసోపేతమైన గొంతుగా భరత్ భూషణ్ తివారికి అక్కడ   ఇమేజ్ ఉంది. అధికారుల అవినీతిని, ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న అక్రమాలను నేరుగా ఫీల్డ్ నుంచే కెమెరాలకు చూపిస్తూ..  నేరుగా పేర్లు పెట్టి హెచ్చరించే తివారి ధోరణి స్థానిక పాలకులకు, అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది.

సాధారణంగా కెమెరా ముందు కూర్చోవడమే కాకుండా, స్వయంగా ప్రజల సమస్యలు ఉన్న స్పాట్‌కు వెళ్లి లైవ్ వీడియోలు చేయడం అతని ప్రత్యేకత. అయితే, వ్యవస్థలోని లోపాలను ఎండగట్టే క్రమంలో అతను ఉపయోగించిన అత్యంత అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్,  అధికారుల వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు  దుమారం రేపాయి. ఒకానొక దశలో ఈ లంచగొండి వ్యవస్థను కేవలం మాటలతో మార్చలేమని, ప్రజల హక్కుల కోసం ఆయుధాలు చేతబట్టాల్సిందేనంటూ సాయుధ పోరాట రాజకీయాల వైపు మళ్లాలని తన వీడియోల్లో పిలుపునిచ్చాడు. ఈ క్రమంలోనే ఒక గన్ సంపాదించి తన వద్దే ఉంచుకున్నాడు. ఈ పరిణామాలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారడంతో, అతనికి వరుసగా హెచ్చరికలు జారీ అయ్యాయి. తనపై ఏ క్షణమైనా దాడి జరగవచ్చని తివారి కూడా ముందుగానే ఊహించి వీడియోలు చేశాడు.

చివరకు ఒకరోజు పోలీసులు అతని ఇంటిని చుట్టుముట్టినప్పుడు, భరత్ భూషణ్ తివారి నేరుగా తన మేడపైకి వెళ్లి ఫేస్‌బుక్ లైవ్ ఆన్ చేశాడు. చేతిలో తుపాకీ పట్టుకుని, "కింద అంతా గొడవ జరుగుతోంది, పోలీసులతో తేల్చుకుందాం" అంటూ అగ్రెసివ్‌గా మాట్లాడుతూ లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చాడు. బీహార్ మొత్తం ఆ లైవ్ వీడియోను ఉత్కంఠగా చూస్తుండగానే, ఒక్కసారిగా సోషల్ మీడియా లైవ్ కట్ అయిపోయింది. ఆ తర్వాత వినిపించింది కేవలం బుల్లెట్ల శబ్దమే. లైవ్ ముగిసిన కొద్దిసేపటికే భరత్ భూషణ్ తివారి ఎన్‌కౌంటర్ వార్త బయటకు వచ్చింది. పోలీసులు దీనిని ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పులుగా చెబుతున్నప్పటికీ..  తివారి తల్లిదండ్రులు మాత్రం ఇది ముమ్మాటికీ ప్రణాళికాబద్ధంగా జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్,  ప్రభుత్వ హత్యేనని తీవ్రంగా ఆరోపిస్తున్నారు. చనిపోయే ఆఖరి నిమిషంలో తన కొడుకు సరెండర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నా, పోలీసులు వినకుండా కాల్చి చంపేశారని తండ్రి కన్నీరుమున్నీరయ్యాడు.

సాధారణంగా ఒక వ్యక్తిపై కేసు ఉంటే నలుగురు పోలీసులు వచ్చి సమన్లు ఇచ్చి తీసుకెళ్లవచ్చు, కానీ ఒక క్రిమినల్ కాని వ్యక్తి ఇంటిని వందలాది మంది సాయుధ పోలీసులు చుట్టుముట్టి ఎన్‌కౌంటర్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్న భరద్వాజ. భరత్ భూషణ్ తివారి అంత్యక్రియలకు బీహార్‌లోని అనేక ప్రాంతాల నుండి వేలాది మంది పేదలు, అట్టడుగు వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడం ఆయనకు ఉన్న ఇమేజ్ కు, మద్దతుకు అద్దంపడుతోందన్నారు.   నాడు విజయవాడలో వంగవీటి మోహన రంగా హత్య జరిగినప్పుడు పేదలు ఏ విధంగా రోడ్లపైకి వచ్చి తిరగబడ్డారో, సరిగ్గా అదే తరహాలో బీహార్‌ అట్టడుగు ప్రజలు తివారిని తమ సొంత హీరోగా భావించి కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ వివాదాస్పద ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ జరపాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయని భరద్వాజ చెప్పారు.

By
en-us Political News

  
రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంపై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదికతో లేఖ రాయాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది.
హైదరాబాద్ నగరంలో తాగునీటి కొరత తీవ్రంగా ఉన్న వేళ తాగునీటిని వృథా చేసిన ఓ ఇంటి యజమానికి జలమండలి అధికారులు గట్టి షాక్ ఇచ్చారు.
జాతీయ రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపిన తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వివాదం
నరసరావుపేట రుణ వితరణ మేళాలో పాల్గొన్న నిర్మాలాసీతారామన్..!
కడప జిల్లాప్రొద్దుటూరులో నిర్వహించిన పార్టీ అంతర్గత సమన్వయ సమావేశంలో తెలుగుదేశం పార్టీ జాతీయ
తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు పౌర సరఫరాల శాఖ అత్యంత కీలకమైన హెచ్చరిక జారీ చేసింది.
ఆధునీకరించిన మంగళగిరి రైల్వేస్టేషన్‌ను వర్చువల్‌గా  ప్రారంభించిన ప్రధాని..  
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగంలో మరో కీలక ముందడుగు వేసింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల దశాబ్దాల కల నెరవేరింది.
నరసరావుపేట వేదికగా నిర్వహించిన ప్రతిష్టాత్మక క్రెడిట్ అవుట్ రీచ్ బహిరంగ సభలో కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల పరిధిలోని దాదాపు లక్షా 3వేల మందికి పైగా లబ్థిదారులకు 3 వేల 216 కోట్ల భారీ రుణాలను చంద్రబాబు, నిర్మలా సీతారామన్ పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ కుల సమీకరణాలు, ప్రాంతీయ భావోద్వేగాల చుట్టూనే తిరుగుతుంటాయి.
రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌ టోర్నీలో ఆడే అవకాశం ఇసుమంతైనా లేదు. వయసు రీత్యానే కాకుండా ఫామ్ విషయంలో కూడా రోహిత్ ను వరల్డ్ కప్ జట్టుకు ఎంపిక చేసే అవకాశం ఇసుమంతైనా లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే లండన్ వేదికగా రోహిత్ శర్మకు ఒక ప్రత్యేకమైన, ప్రతిష్టాత్మకమైన వీడ్కోలు ఇచ్చేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తున్నదని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
హైదరాబాద్ నగరంలోని ఫుట్‌బాల్ అభిమానులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.