ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌.. లిక్కర్ అమ్మకాల సమయం పొడిగింపు..!

Publish Date:Jul 17, 2026

Advertisement

 

హైదరాబాద్ నగరంలోని ఫుట్‌బాల్ అభిమానులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ను అభిమానులు పెద్ద ఎత్తున వీక్షించేందుకు క్రీడాభిమానులు, వివిధ వాణిజ్య సంస్థల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ప్రత్యేక సడలింపులు ప్రకటించింది. అర్జెంటీనా–స్పెయిన్ జట్ల మధ్య ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సోమవారం తెల్లవారుజామున 12.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం నుంచి మ్యాచ్ ముగిసే వరకు మ్యాచ్‌ను బహిరంగంగా ప్రదర్శించాలనుకునే అన్ని వాణిజ్య, ప్రైవేట్ క్రీడా కేంద్రాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్‌లు, ఫుడ్ అండ్ బేవరేజ్ సంస్థలు తమ కార్యకలాపాలు కొనసాగించేందుకు ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇచ్చింది. 

దీంతో అభిమానులు పెద్ద స్క్రీన్‌లపై మ్యాచ్‌ను వీక్షించే అవకాశం లభించనుంది. అయితే ఈ సడలింపులు కేవలం ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నిర్వహణ దృష్ట్యా మాత్రమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. మ్యాచ్ సందర్భంగా శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు. ముఖ్యంగా నూతన సంవత్సర వేడుకల సమయంలో అమలు చేసే భద్రతా నిబంధనల తరహాలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, ట్రాఫిక్ పర్యవేక్షణ, చట్ట ఉల్లంఘనలపై ప్రత్యేక నిఘా కొనసాగించనున్నారు. 

మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ఎలాంటి రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అలాగే హోటళ్లు, పబ్‌లు, రెస్టారెంట్ల నిర్వాహకులు కూడా ప్రభుత్వ ఆదేశాలు, భద్రతా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఫుట్‌బాల్ అభిమానులు ఉత్సాహంగా మ్యాచ్‌ను ఆస్వాదిస్తూనే బాధ్యతాయుతంగా వ్యవహరించి, చట్టాలను గౌరవించాలని ప్రభుత్వం, పోలీసులు విజ్ఞప్తి చేశారు.

FIFA World Cup Final Match, Liquor sales time, Telangana Goverment,CM Revanth reddy,Argentina,Spain

By
en-us Political News

  
నల్లమలలో సోదాలు.. కౌకూర్‌, యాప్రాల్‌, అచ్చంపేటలో ఆయుధాల కోసం గాలింపు..!
హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్యనగర్‌లోని హరిహర మెన్ హాస్టల్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. తోటి పనివాడు ప్రమోద్ జరిపిన కత్తిపోట్లకు కుక్ శశిధర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఢిల్లీ ఎర్రకోట బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ సంచలన చార్జ్‌షీట్ దాఖలు చేసింది. 11 మంది ప్రాణాలు తీసిన ఈ ఘటన వెనుక లాల్ మందిర్ దాడి కుట్ర, మూత్రం నుంచి బాంబు తయారీ, 12 సార్లు రెక్కీ నిర్వహించిన విస్తుపోయే వివరాలు వెలుగులోకి వచ్చాయి.
అమెరికాలోని పెన్సిల్వేనియా ల్యాంకాస్టర్ కౌంటీలో ఎఫ్రాతా పోలీసులు చేపట్టిన కీలక అరెస్ట్ వివరాలు. క్రైమ్‌వాచ్ నిఘా మరియు తాజా క్రైమ్ అప్‌డేట్స్ కోసం చదవండి.
ఒడిశా కోరాపుట్ పరిధిలోని బాలిపేట సేవాశ్రమం హాస్టల్‌లో 9వ తరగతి విద్యార్థి సీయారా తాడింగిపై సహవిద్యార్థి తీవ్రంగా దాడి చేశాడు. మత్తు పదార్థాల ప్రభావంతోనే ఈ దాడి జరిగిందని, ర్యాగింగ్ అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆయుధాలు చోరీ అయ్యాయి అంటూ సీన్ క్రియేట్ చేసిన ఇంటి దొంగలు..!
లండన్ వీసాలు, ఉద్యోగాల పేరిట మోసాల ఆరోపణలతో యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందనను విజయవాడ పోలీసులు 4 గంటల పాటు విచారించారు. బిగ్ బాస్ తెలుగు 10 ఎంట్రీ ప్రచారం, రూ. 15 లక్షల ఫిర్యాదు మరియు పోలీసులకు ఆమె ఇచ్చిన షాకింగ్ స్టేట్‌మెంట్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో అక్రమ ఇసుక దందాపై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఎర్ధనూర్ సర్వే నెంబర్ 134లోని నక్క వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న 6 ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేశారు. వాల్టా చట్టం ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.
లండన్ ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ పేరిట రూ.15 లక్షల మోసానికి పాల్పడిన ఆరోపణలపై నందూస్ వరల్డ్ యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు మరియు సీఐ సుబ్రహ్మణ్యం అందించిన పూర్తి సమాచారం ఇక్కడ చదవండి!
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని పహుజ్ డ్యామ్ వద్ద సోషల్ మీడియా రీల్ కోసం 30 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకిన యువకుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వైరల్ స్టంట్ వికటించిన పూర్తి వివరాలు మరియు వీడియో కథనం ఇక్కడ చదవండి.
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.