రాష్ట్రాభివృద్ధిలో బ్యాంకులు భాగస్వామ్యం కావాలి : సీఎం చంద్రబాబు

Publish Date:Jul 17, 2026

Advertisement

 

నరసరావుపేట రుణ వితరణ మేళాలో పాల్గొన్న నిర్మాలాసీతారామన్..!

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో బ్యాంకులు భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ప్రజల వద్దకే వెళ్లి రుణాలు అందించటం గర్వకారణమని, బ్యాంకులు రుణాలిచ్చే సంస్థలే కాదని రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములన్నారు. రైతు భవిష్యత్తు మార్చడానికి, యువత కలలు నెరవేర్చడానికి, పారిశ్రామికవేత్తల లక్ష్యం నెరవేరడానికి రుణాలు ఎంతో ఉపయోగపడతాయని వ్యాఖ్యానించారు. గత వైసీపీ పాలనంతా సమస్యల సుడిగుండమేనని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి రాష్ట్రానికి తిప్పలు తెచ్చిందని, కూటమి అధికారంలోకి వచ్చాకే ఆ రుణాల్ని కేంద్ర సహకారంతో రీ -షెడ్యూలు చేసి రూ.1,538 కోట్లు ఆదా చేశామని అన్నారు. 

పలనాడు జిల్లా నరసరావుపేటలో కేంద్ర ఆర్ధిక శాఖ, ప్రభుత్వ రంగ బ్యాంకులు సంయుక్తంగా నిర్వహించిన మెగా రుణమేళా కార్యక్రమానికి (క్రెడిట్ అవుట్ రీచ్) కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. పలనాడు జిల్లాలో 1,03,246 మంది లబ్ధిదారులకు రూ.3,216 కోట్ల రుణాలను అందజేశారు. ఇందులో భాగంగా 15 వేల మంది డ్వాక్రా మహిళలకు,13,355 మంది పారిశ్రామికవేత్తలకు రుణాలు పంపిణీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ "పారిశ్రామికవేత్తలుగా మారడానికి పల్నాడు చిరునామా కావాలి. పలనాడు పౌరుషానికి శక్తివంతమైన ఆయుధం ఇస్తున్నాం. 

క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమం నిర్వహిస్తున్న అందరికీ అభినందనలు. రైతులు, విద్యార్ధులు, డ్వాక్రా సంఘాల మహిళలు ఇలా అర్హులైన వారందరికీ రుణం అందించటమే లక్ష్యం. మహిళా సాధికారతకు ఈ క్రెడిట్ అవుట్ రీచ్ ద్వారా ప్రయోజనాలు చేకూరతాయి. రెండేళ్ల క్రితం రాష్ట్రం అంతా సమస్యల సుడిగుండంలో ఉంది. ఏపీలో ఆర్ధిక విధ్వంసం చేశారు. కేంద్ర సహకారంతో అమరావతి, పోలవరం, విశాఖ ఉక్కు ఆకాంక్షలు నెరవేరాయి. వీబీజీ రామ్ జీ కింద కేంద్రం నుంచి రూ.7,707 కోట్లు రాష్ట్రానికి వస్తుంది. రాయలసీమను హార్టీ కల్చర్ హబ్ గా మార్చేందుకు కేంద్రం రూ.40 వేల కోట్లు ఆర్ధిక సహకారం అందిస్తుంది.ప్రైవేటు పెట్టుబడులతో కలిపి ఈ ప్రాంతాన్ని ఉద్యాన హబ్ గా మారుస్తాం." అని సీఎం వివరించారు.

నిర్మలా సీతా రామన్  సంస్కరణల వాది..
 
"మహిళలందరికీ కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదర్శంగా నిలుస్తున్నారు. 10 లక్షల డ్వాక్రా సంఘాలు రూ.29 వేల కోట్ల  పొదుపుతో దేశంలోనే మేటిగా నిలిచాయి. రుణాల రీ పేమెంట్ లో 99.5 శాతంతో డ్వాక్రా మహిళలు అగ్రస్థానంలో ఉన్నారు. వారందరినీ మహిళా వ్యాపారవేత్తలుగా మార్చేందుకు వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ కార్యక్రమం చేపట్టాం. బ్యాంకింగ్ లో నిర్మలా సీతా రామన్ చాలా సంస్కరణలు తీసుకొచ్చారు. 

నష్టాల్లో ఉన్న చిన్న బ్యాంకులను విలీనం చేసి సమర్థ బ్యాంకింగ్ వ్యవస్థకు దోహదం చేశారు. డిజిటల్ బ్యాంకింగ్ విప్లవం, జన్ ధన్ యోజన ద్వారా కోట్లాది బ్యాంకు ఖాతాలు, జీఎస్టీ శ్లాబ్ లను కుదించి పారదర్శక విధానం తెచ్చారు. వికసిత్ భారత్ 2047కు అనుగుణంగా చాలా సంస్కరణలు కేంద్ర మంత్రి నిర్మల తీసుకొచ్చారు. ఈ తరహా క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమాల్ని 6 జిల్లాల్లో నిర్వహించేందుకు తక్షణమే అంగీకరించారు. త్వరలోనే 3 నెలలకు ఒకటి చొప్పున ఈ తరహా కార్యక్రమాలు చేపడతాం."  అని ముఖ్యమంత్రి అన్నారు

చిన్న వ్యాపారులకు అండగా కేంద్రం-కేంద్ర మంత్రి..

 దేశంలోని ప్రతి గ్రామంలోనూ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పమని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్  అన్నారు.  తాను ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టే సమయానికి బ్యాంకులు ఎన్‌పీఏల సమస్యలతో ఇబ్బందుల్లో ఉండేవని, చిన్న వ్యాపారులు అప్పులు దొరక్క నష్టపోయేవారని గుర్తుచేశారు. 

చిన్న వ్యాపారుల ఆర్థిక కష్టాలను గుర్తించిన ప్రధాని మోదీ.. ప్రభుత్వమే గ్యారెంటీ ఇచ్చి బ్యాంకుల ద్వారా వారికి సులభంగా రుణాలు అందేలా పథకాలు తెచ్చారని వివరించారు. నేడు బ్యాంకులు స్వయంగా వ్యాపారుల చెంతకే వచ్చి రుణాలు ఇస్తున్నాయని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. మెగా రుణమేళాలో భాగంగా  లబ్దిదారులకు ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి రుణ మంజూరు పత్రాలను, చెక్కులను అందజేశారు. 

ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ అందజేత..

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.42.16 లక్షల విలువైన అంబులెన్స్‌ను పిడుగురాళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి అందించారు. అలాగే నాబార్డు సౌజన్యంతో డీసీసీబీ (DCCB) కి రూ.25 లక్షల విలువైన 2 మొబైల్ డెమో వ్యాన్లు అందించారు. అలాగే విద్యార్థినులకు రూ.17.80 లక్షల విలువైన 301 సైకిళ్లను పంపిణీ చేశారు. పర్యాటక శాఖకు గ్రామీణ బ్యాంక్ తరపున రూ.14 లక్షల విలువైన 2 బ్యాటరీ వాహనాలను అందించారు. 

వీటిని సీఎం చంద్రబాబు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం దివ్యాంగులకు ఉచితంగా ట్రై సైకిళ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, స్థానిక ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, భాష్యం రామకృష్ణ, పలువురు ఎమ్మెల్యేలు, బ్యాంక్ అధికారులు, పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు. సభకు ముందు సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అక్కడ ఏర్పాటు చేసిన ప్రభుత్వ స్టాళ్లను సందర్శించి, నిర్వాహకులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
 

By
en-us Political News

  
ఒడిశాలోని బ్రహ్మపూర్‌లో మద్యం మత్తులో తీవ్ర దారుణం జరిగింది. డబ్బుల వివాదంతో స్నేహితుడి గొంతు కోసి హత్య చేసిన వ్యక్తి అర్ధరాత్రి పోలీసుల తనిఖీల్లో రక్తపు మరకలతో చిక్కాడు. ఈ ఘోర క్రైమ్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో భర్త మరొక మహిళతో ఉండగా చూసిన భార్య కారును అడ్డుకోగా, ఆమెను 100 మీటర్లు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన షాకింగ్ ఘటన వైరల్‌గా మారింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
కరేబియన్ సముద్రంలో డ్రగ్స్ అక్రమ రవాణా బోటుపై అమెరికా సైన్యం జరిపిన దాడిలో నలుగురు మరణించారు. సెప్టెంబర్ 2025 నుండి ఇప్పటివరకు జరిగిన 70 దాడుల్లో 235 మంది మృతి చెందిన పూర్వాపరాలు మరియు పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్‌లోని మియాపూర్ హఫీజ్‌పేట్‌లో ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ చేతిలో 27 ఏళ్ల లేడీ డాక్టర్ సృజన హత్యకు గురైన దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు పోలీసుల దర్యాప్తు నివేదిక.
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం పోస్టులు ఇప్పిస్తామంటూ ఉమ్మడి వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రూ.లక్షల్లో వసూలు చేస్తున్న దళారీల దందా వెలుగులోకి వచ్చింది. యూనియన్ ముసుగులో జరుగుతున్న ఈ అక్రమాలపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజారెడ్డి విచారణ ప్రకటించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్‌లోని సరూర్ నగర్ సాగరిక ఇంటెగ్రేటెడ్ హైస్కూల్‌లో రాఖీలు, తిలకం తొలగింపు వివాదంపై బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి టీచర్‌ను హిజాబ్‌‌పై ప్రశ్నించడం సంచలనంగా మారింది. పోలీసులు కార్పొరేటర్‌పై సుమోటో కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్న కూతురిపై లైంగిక దాడికి యత్నించిన భర్త శ్రీనివాస్‌ను భార్య రమాదేవి గొడ్డలితో నరికి చంపింది. అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా సీఐఎస్ఎఫ్ క్యాంపులో హెడ్ కానిస్టేబుల్ ఏకే 47 రైఫిల్‌తో చేసిన విచక్షణారహిత కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి చెందారు. సేవా పవర్ ప్రాజెక్ట్ వద్ద జరిగిన ఈ దారుణ ఘటనపై సీఐఎస్ఎఫ్ డీజీ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
ఒడిశా తాల్చేర్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన దారుణ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్ మాధాపూర్‌లో స్పా సెంటర్ ముసుగులో నడుస్తున్న అక్రమ వ్యభిచార రాకెట్‌ను ఎస్‌ఓటీ పోలీసులు మట్టుబెట్టారు. నలుగురు యువతులను రక్షించి, రూ. 45 వేల నగదు, 8 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
యాదాద్రి భువనగిరి జిల్లా చల్లూరులో భూభారతి వెబ్‌సైట్ ద్వారా ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండానే 7.18 ఎకరాల భూమి వేరొకరి పేరు మీదకు మారిపోయింది. యజమానులకు తెలియకుండా జరిగిన ఈ భారీ భూ భాగోతం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఏపీ సచివాలయ ఉద్యోగాలు, డీఎస్సీ నియామకాలు మరియు మెడికల్ సీట్లలో నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల అక్రమాలపై విచారణ ముమ్మరమైంది. హైకోర్టు ఆదేశాలు, విజిలెన్స్ తనిఖీలు మరియు సాప్ చేపట్టిన స్కిల్ టెస్ట్ వివరాలు ఇక్కడ చూడండి.
150 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వందేమాతరం గేయానికి జాతీయ గీతంతో సమాన హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ తెచ్చింది. 3 నిమిషాల 10 సెకన్ల ఆలాపన, సుప్రీంకోర్టు విచారణ మరియు చట్టపరమైన నిబంధనల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.