Publish Date:Apr 23, 2022
ఇప్పుడంతా ఎలక్ట్రికల్ బైక్ జమానా. పెట్రోల్, డీజిల్ రేట్లు అమాంతం పెరగడంతో మధ్య తరగతి వర్గమంతా బ్యాటరీ బైక్స్ కొంటున్నారు. రకరకాల మోడల్స్.. రకరకాల బ్రాండ్స్ అందుబాటులో ఉండటం.. ధర కూడా మధ్యస్థంగా ఉండటం.. డ్రైవింగ్ లైసెన్స్ లాంటి గొడవ లేకపోవడంతో.. చార్జింగ్ స్కూటర్స్‌కు డిమాండ్ పెరిగింది. ఓలా లాంటి కంపెనీలు సైతం రంగంలోకి దిగడంతో ఎలక్ట్రికల్ బైక్స్‌కు మరింత క్రేజ్ వచ్చింది. ఇదే ఛాన్స్ అనుకొని.. ఊరూపేరు లేని సంస్థలు సైతం బ్యాటరీ బైక్స్ తయారు చేసి మార్కెట్లో అమ్మేస్తున్నారు. అయితే, వరుసగా జరుగుతున్న కొన్ని ఘటనలు ఎలక్ట్రిక్ బైక్ అంటేనే దడ పుట్టేలా చేస్తున్నాయి. ఎండాకాలం ప్రభావమో.. లేక, నాసిరకం తయారీ విధానమో.. కారణం ఏదైనా ఈమధ్య ఎలక్ట్రిక్ బైకులు పేలిపోతున్నాయి. మంటలతో తగలబడుతున్నాయి. తాజాగా, విజయవాడలో ఓ చార్జింగ్ పెడుతుండగా.. ఓ బైక్ పేలి ఒకరి ప్రాణాలు పోవడం, ముగ్గురికి తీవ్రగాయాలు కావడం తీవ్ర కలకలం రేపింది.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సూర్యారావుపేట ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్థానిక గులాబీపేటలో ఎలక్ట్రికల్ బైక్ బ్యాటరీ పేలి.. బైక్ ఓనర్ చనిపోయారు. ఈ పేలుడుతో భారీగా మంటలు చెలరేగి అతడి భార్య, ఇద్దరు పిల్లలకు తీవ్రగాయాలయ్యాయి.
శుక్రవారమే శివకుమార్ కొత్త బైక్ కొన్నాడు. ఇంట్లోని బెడ్‌రూమ్‌లో బైక్ బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టాడు. తెల్లవారుజామున బ్యాటరీ పేలి ఇంట్లో మంటలు చెలరేగాయి. శివకుమార్‌తో పాటు భార్య, ఇద్దరు పిల్లలు మంటల్లో చిక్కుకున్నారు. వారి అరుపులతో ఇరుగు పొరుగు వారు తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి రక్షించే ప్రయత్నం చేశారు. ఆస్పత్రికి తరలిస్తుండగా.. శివకుమార్ మృతి చెందాడు. అతడి భార్య పరిస్థితి విషమంగా ఉంది.
విజయవాడ ఎపిసోడ్ గురించి తెలిసి ఎలక్ట్రిక్ బైక్స్ కొన్న వారంతా హడలిపోతున్నారు. ఛార్జింగ్ పెట్టాలంటేనే భయపడుతున్నారు. ఎండలో బండి పార్క్ చేయాలన్నా టెన్షన్ పడుతున్నారు. ఇటీవల ఓలా స్కూటర్ సైతం ఎండలో కాలిపోవడంతో కలవర పడుతున్నారు. ఎందుకైనా మంచిది... బీకేర్‌ఫుల్ విత్ ఎలక్ట్రికల్ బైక్స్.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/electric-bike-blast-in-vijayawada-39-134819.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది