Publish Date:Apr 23, 2022
ఉరుము ఉరిమి మంగళం మీద పడటమంటేఇదే! విజయవాడసామూహిక అత్యాచార ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు, స్థానికులలో ఆగ్రహం ఉవ్వెత్తున ఎగసింది. ఆ క్రమంలోనే బాధితురాలిని పరామర్శించడానికి వచ్చిన ఏపీమహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను బాధితురాలి బంధువులు అడ్డగించారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
అయితే అదే సమయంలో బాధితురాలిని పరామర్శించడానికి విపక్ష నేత చంద్రబాబు వచ్చారు. ఆయనతో ఆ పార్టీ నాయకుడు బోండా ఉమా తదితరు కూడా ఉన్నారు. దీంతో బాధితురాలి బంధువులు నారా చంద్రబాబునాయుడికి తమ గోడు వెళ్ల బోసుకున్నారు. ఆయన వారిని ఓదార్చిన్యాయం జరిగేలా చూస్తానని చెప్పారు. అదే సందర్భంగా సత్వర న్యాయం చేయాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ కూ చెప్పారు.
విపక్ష నేత హోదాలో ఆయన చేసిన పని మహిళా కమిషన్ చైర్ పర్సన్ కు నచ్చలేదు. తనను గౌరవించకుండా బాధితురాలి బంధువులు చంద్రబాబు నాయుడికి గోడు వెళ్ల బుచ్చుకోవడం అస్సలు రుచించలేదు. అయినా తనంత మనిషి ఉండగా తనను కాదని బాధితులు చంద్రబాబును ఎలా ఆశ్రయిస్తారని ఆగ్రహం వచ్చింది. సరే బాథితుల కుటుంబీకులకు తెలియదు...కనీసం చంద్రబాబు అయినా ముందు మహిళా కమిషన్ చైర్ పర్సన్ ను గుర్తించండి అని వారికి చెప్పకపోవడంతో తనేమిటో ఆయనకు తెలియజెప్పాలని భావించారు. అంతే ఇంకే ముందు తన ముందు హాజరు కావాలంటూ చంద్రబాబుకూ, బోండా ఉమాకు నోటీసులు పంపించారు.
ఆసుపత్రి వద్ద తనను గౌరవించని కారణంపై విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. విజయవాడ అత్యాచార ఘటన జరిగిన రెండు రోజులకు గానీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ కు బాధితురాలిని పరామర్శించేందుకు సమయం దొరకలేదు. అది కూడా విపక్ష నేత బాధితురాలిని పరామర్శించేందుకు వస్తున్న సమయాన్నే ఆమె ఎ:చుకున్నారు.
సరే ఆమెను గౌరవించలేదంటూ చంద్రబాబు, బోండా ఉమలకు నోటీసులు జారీ చేసిన మహిళా కమిషన్....విజయవాడ గ్యాంగ్ రేప్ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులకు నోటీసులు ఎందుకు జారీ చేయలేదని జనం నిలదీస్తున్నారు. అంతే కాదు రాష్ట్రంలో మహిళలపై జరిగిన అత్యాచార ఘటనల్లో ఏ సందర్భంలోనైనా తమ ఎదుట హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసిన దాఖలాలున్నాయా అని ప్రశ్నిస్తున్నారు.
మొత్తం మీద తమపై ప్రజా వ్యతిరేకతకు కూడా విపక్షాలే కారణమంటూ నోటీసులు జారీ చేయడం ద్వారా వాసిరెడ్డి పద్మ ఒక కొత్త సంప్రదాయానికి తెరతీశారని చెప్పవచ్చు. ఇకపై రాష్ట్రంలో బాధితులను పరామర్శించే అధికారం, హక్కు ఒక్క అధికార పార్టీ వారికే ఉందని వైకాపా వాళ్లు చెప్పినా చెప్పొచ్చు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-women-commission-notice-to-chandrababu-39-134816.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది