బీజేపీలో నల్లారి ఏం చేస్తున్నారు?

Publish Date:May 6, 2023

Advertisement

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి  నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. చేరి కూడా చాలా రోజులే అయ్యింది. ఆయతే ఆ చేరిక ప్రభావం బీజేపీలో ఏమీ కనిపించడం లేదు. ఆయన రాజకీయంగా క్రియాశీలం అయ్యింది కూడా లేదు. ఆయన రాష్ట్ర విబజన ను వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస సొంతంగా సమైక్యాంధ్ర పార్టీని స్దాపించి 2004 ఎన్నికలలో పోటీ చేశారు.

అయితే ఆ ఎన్నికలలో ఆయనతో పాటు ఆయన పార్టీ కూడా ఘోర పరాజయం పాలైంది. అపపటి నుంచీ ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. దాదాపు పొలిటికల్ కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టేశారని అంతా భావించారు. కానీ ఏమైందో ఏమో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని కొద్ది కాలం పాటు ఆ పార్టీలో నామ మాత్రంగా కొనసాగారు. కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన  కమలం గూటికి చేరారు.  కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, అరుణ్ సింగ్, బీజేపీ నేత లక్ష్మణ్ ఆధ్వర్యంలో గత నెల 7న బీజేపీ కండువా కప్పుకున్నారు. ఉమ్మడి ఏపీలో కిరణ్ కుమార్ రెడ్డి  4సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.  2010 నవంబర్‌ 25 నుంచి 2014 మార్చి 1 వరకు సీఎంగా ఆయన పనిచేశారు. అంతకుముందు శాసనసభ స్పీకర్‌గా, ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.   అలాంటి నల్లారి చాలా కాలంగా అంటే 2014 ఎన్నికల తరువాత నుంచీ దాదాపుగా ప్రజాజీవితంలో లేరు. అలాంటి నల్లారి  చేరికతో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఏం లాభం, ప్రయోజనం ఉంటుందన్న అనుమానాలు ఆయన చేరిక సమయంలోనే వ్యక్తమయ్యాయి.

చేరిక సందర్భంగా ఆయన కాంగ్రెస్ పై ఒకటి రెండు రాళ్లు వేయడానికి ప్రయత్నించారు. బహుశా బీజేపీ అధినాయకత్వాన్ని ఆకట్టుకునేందుకు చేసిన ప్రయత్నంగా పరిశీలకులు భావించారు.  నల్లారి చేరికతో తెలుగురాష్ట్రాలలో బీజేపీ మరింత బలోపేతం అవుతుందని ఆయనకు పార్టీ కండువా కప్పుతూ కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషీ ఆశాభావం వ్యక్తం చేశారు.

నల్లారి బీజేపీ తీర్థం పుచ్చుకుని అప్పుడే నెల రోజులు దాటిపోయింది. ఉభయ రాష్ట్రాలలోనూ తనకు రాజకీయ నేతలు పలువురు మంచి మిత్రులనీ, వారందరినీ కమలం గూటికి తీసుకువచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని నల్లారి కాషాయ కండువా కప్పుకుంటున్న సందర్భంగా చెప్పారు. కానీ ఈ నెల రోజులలో ఆయన బీజేపీ కోసం ఏం చేశారు. ఆయన ఆధ్వర్యంలో జరిగిన పార్టీ కార్యక్రమాలేవీ అంటే నిస్సందేహంగా ఏమీ లేవు అన్న సమాధానమే వస్తుంది.   

By
en-us Political News

  
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.