తెలంగాణా ఎంపిల సస్పెన్షన్ వెనుక ఎత్తుగడ ఏమిటి?

Publish Date:Apr 25, 2012

Advertisement

లోక్ సభలో ప్రత్యేక తెలంగాణా కోరుతూ నినాదాలు చేస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన 8 మంది కాంగ్రెస్ ఎంపీలను నాలుగురోజులపాటు సస్పెండ్ చేయడంపై తెలంగాణా ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. లోక్ సభలో తెలంగాణపై నినాదాలు చేయడం, గందరగోళం సృష్టించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా అనేక పర్యాయాలు ఇటువంటి ఆందోళనలు చోటుచేసుకున్నప్పటికీ ఏనాడూ సస్పెండ్ కు గురికాలేదు.

 

 

 

 

తెలంగాణా అంశంపై తొలిసారి అందులోనూ అధికార పార్టీకి చెందిన సభ్యులను సభనుంచి నాలుగురోజులపాటు బహిష్కరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అధికారంలో వున్న పార్టీ తన సభ్యులను తాను సస్పెండ్ చేయడం ఇదే ప్రధమమని చెబుతున్నారు. అధికారపార్టీ సభ్యుల సస్పెండ్ వెనుక బలీయమైన రాజకీయ ఎత్తుగడ వున్నట్టుగా భావిస్తున్నారు. ఇప్పటివరకూ తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న పార్టీగా తెలంగాణా రాష్ట్ర సమితి మాత్రమే గుర్తింపు పొందింది. ఈ స్థితిలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా అందుకు సంబంధించిన ఘనత అంతా టి.ఆర్.ఎస్. పార్టీకే దక్కేలా వుంది.

 

 

ఈ పరిస్థితి నుంచి బయటపడటంలో భాగంగా తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు సస్పెండ్ నకు గురయినట్టు భావిస్తున్నారు. సస్పెండ్ కు గురైన 8 మంది సభ్యులు అధిష్టానానికి అనుకూలంగా వుండేవారు. అయినా వారు లోక్ సభలో రెచ్చిపోవడం, ఆ తర్వాత వారిని నాలుగురోజులపాటు సస్పెండ్ చేయడం వంటి అంశాలు అన్నీ ఎత్తుగడలో భాగంగానే జరిగినట్టు భావిస్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ క్రమంగా ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకోనున్నట్టుగా అంచనా వేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణా ఏర్పాటునాటికి అందుకు సంబంధించిన ఘనత అంతా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేసుకోవడానికి ఈ ఎత్తుగడ బాగా పనిచేస్తుందని భావిస్తున్నారు.

By
en-us Political News

  
వినాయక చవితి వేడుక లకు హైదరాబాద్‌ నగరం ముస్తాబవుతున్న వేళ.. బేగంబజార్‌లోని ఫీల్‌ఖానా ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తెలంగాణ రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి
వినాయక చవితి వచ్చిందంటే బాలాపూర్ పేరు ప్రత్యేకంగా వినిపిస్తుంది.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన అసెంబ్లీ ముట్టడి లేదా నిరసనల ఉద్రిక్తతలకు సంబంధించి దర్యాప్తు వేగవంతమైంది.
పెళ్లయి తొమ్మిది నెలలే.. కొత్త జీవితంపై ఎన్నో ఆశలు.. అప్పటికే గర్భం దాల్చిన భార్య.. కానీ భర్త అనుమానం ఆ కుటుంబం లో విషాదాన్ని నింపింది.
భాగ్యనగరంలో వైభవంగా వినాయక చవితి సంబరాలు.. ఖైరతాబాద్‌లో తొలిపూజ పూర్తి..!
సికింద్రాబాద్ పరిధిలోని అల్వాల్‌లో మైనర్ బాలికపై పలువురు యువకులు మూడు రోజులపాటు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది.
సికింద్రాబాద్ మౌలాలి సమీపంలో ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలుపై కరెంట్ తీగలు తెగిపడటంతో ఒక్కసారిగా కలకలం రేగింది
కన్నుల పండువగా గణేశ్ ఉత్సవాలు.. ప్రత్యేక ఆకర్షణగా ఖైరతాబాద్ మహాగణపతి..!
స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా మిగతా స్నేహితులంతా కలిసి అతని ఇంటికి వెళ్లి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు.
బుల్లితెర డ్యాన్స్ షో ‘ఢీ’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న డ్యాన్సర్ రాజు వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.
మైక్ కనిపిస్తే ఊగిపోతున్నారు.. నాయినిపై ఆగ్రహం..?
ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌లోని ప్రసిద్ధ నాగోబా ఆలయ ప్రధాన పూజారి, మేస్రం వంశీయుల పెద్ద మేస్రం ఆనందరావు తెలంగాణ రక్షణ సేనలో చేరారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.