ఎమ్మెల్సీ కవిత సన్నిహితులను విచారిస్తున్న ఈడీ.. డొంక కదులుతోందా?

Publish Date:Sep 7, 2022

Advertisement

ఢిల్లి లిక్కర్ స్కాం కేసీఆర్ కుటుంబం మెడకు చుట్టుకుంటోందా? తనపై ఆరోపణలకు చేయరాదంటూ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నా.. ఈడీ దూకుడు పెంచడంతో ఎమ్మెల్సీ కవితకు ఊరట లబించడం లేదా? సీబీఐకి తోడు ఈడీ రంగంలోకి దిగడంతో ఈ కేసు విచారణలో వేగం పెరిగిందా అంటే జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఔననే అనాల్సి వస్తుంది.

అంతే కాకుండా రియల్ ఎస్టేట్ సంస్థ ఫీనిక్స్ వ్యవహారంలో ఏకంగా తెలంగాణ సీఎస్ ప్రమేయంపై ఈడీ విచారణ ప్రారంభించడంతో తెలంగాణ సర్కార్ ఉక్కిరి బిక్కిరి అవుతోందని,  మొత్తంగా ఈడీ దూకుడుతో తెలంగాణలో స్కాముల డొంక కదులుతోందనీ పరిశీలకులు అంటున్నారు.  ఢిల్లీ మద్యం కుంభకోణం అటు తిరిగి ఇటు తిరిగి తెలంగాణ ప్రభుత్వానికి తలనొప్పులు తీసుకువచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ కేసుపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఆ కారణంగానే ఢిల్లీ లిక్కర్ స్కారం వ్యవహారం తెలంగాణలో ప్రపంకనలు సృష్టిస్తోంది. ఈ కుంభకోణంపై ఇప్పటికే సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు సాగిస్తుండగా, ఇప్పుడు ఈడీ కూడా రంగంలోనికి దిగింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో దేశ వ్యాప్తంగా ఈడీ నిర్వహిస్తున్న సోదాలలో బాగంగా హైదరాబాద్ లో కూడా ఈడీ దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.  

లిక్కర్ స్కాం కు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ సీఎం కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సన్నిహితులు ఆరుగురిని ఈడీ బుధవారం ఉదయం నుంచి విచారిస్తున్నట్లు తెలిసింది. ఈ విచారణను హైదరాబాద్ కు చెందిన ఈడీ అధికారులు కాకుండా ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. మంగళవారం నుంచి హైదరాబాద్ లోఅరుణ్ రామచంద్రన్ పిళ్లైతో సహా మరో ఐదుగురి ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. బోయినపల్లి అభిషేక్ రావ్, సూదిని సృజన్ రెడ్డి, గండ్ర ప్రేమ్ సాగర్ నివాసాలు, కార్యాలయాలలె ఈడీ సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

అలాగే రాబిన్ డిస్టిలర్స్ ప్రధాన కార్యాలయంపై కూడా దాడులు కొనసాగుతున్నాయి. ఒక వైపు సోదాలు జరుగుతుండగానే కవిత సన్నిహితులను ఈడీ అధికారులు విచారిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.   దీనికి తోడు    ఇటీవల హైదరాబాద్ లోని రియల్ ఎస్టేట్ సంస్థ ఫీనిక్స్ పై ఐటీ అధికారులు దాడులు చేసిన సంగతి విదితమే.  బంజారాహిల్స్ రోడ్ నెంబర్-45లోని ఫీనిక్స్ సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు కంపెనీ చైర్మన్ చుక్కపల్లి సురేష్, కంపెనీ డైరెక్టర్ల నివాసాలపై  మదాపూర్‌లోని ఫీనిక్స్ ఐటీ సెజ్‌పైనా కూడా ఐటీ దాడులు జరిగిన నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించి కూడా ఈడీ ఆరా తీస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఫీనెక్స్ వ్యవహారంలో తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ కు లింకులు ఉన్నట్లుగా అందిన సమాచారంపై కూడా ఈడీ విచారిస్తున్నట్లు తెలిసింది.  

ఫీనిక్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ హైదరాబాద్ కేంద్రంగా నడుస్తోంది. వెంచర్స్, రియల్ ఎస్టేట్ ఇన్‌ఫ్రాలో ఫీనిక్స్ పెట్టుబడులు ఉన్నాయి. కాగా ఫీనిక్స్‌లో చాలా మంది రాజకీయ ప్రముఖుల పెట్టుబడులు ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి.  ఈ నేపథ్యంలోనే ఫీనిక్స్ వ్యవహారంలో తెలంగాణ సీఎస్ సురేష్ కుమార్ కు లింకులపై ఈడీ ఆరా తీయడం సంచలనం సృష్టించింది.                                          ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాలకు కూడా విస్తరించి ఉండటం, రాజకీయ నాయకుల ప్రమేయం ఉందన్న వార్తలు రావడంతో అంతటా ఈడీ సోదాలపై ఆసక్తి కనబరుస్తున్నారు.ఈ కుంభ కోణంలో తెలంగాణ సీఎం కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పేరు ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే తనపై ఆరోపణలు చేయకుండా ఆమె కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు. అలాగే  ఈ కేసులో విజయసాయిరెడ్డితో పాటు జగన్ సతీమణి పేరు కూడా ఉందని టీడీపీ  ఆరోపిస్తున్నది. దీనిపై రాజకీయదుమారం కొనసాగుతోంది. సీబీఐ ఈడీ విచారణలతో రాజకీయంగానూ కీలక పరిణామాలు చోటు చేసుకోవడం అనివార్యంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

By
en-us Political News

  
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.