పొగిడినా, తిట్టినా పట్టించుకోవద్దు.. జనసైనికులకు పవన్‌ ట్వీటోపదేశం

Publish Date:Jun 8, 2022

Advertisement

సినీ నటులకు వుండే క్రేజ్‌ అంతా ఇంతా కాదు. సిల్వర్‌ స్క్రీన్‌ మీద గొప్ప స్టయిల్‌గా డైలాగులు చెప్పడం, నాలుగు ఫైట్లు చేయడంతోనే లక్షలాది మంది అభిమానులు పుట్టుకొచ్చేస్తారు, అభిమాన సంఘాలు ఏర్పడతాయి. తమ స్టార్‌ హీరో ఏదంటే అదే మరి. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ జనసేన అనే రాజకీయ పార్టీ పెట్టి ప్రజాసేవలో తరిద్దామనుకున్నారు. మంచిదే. కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ఏమాత్రం గట్టిగా నిలవగలుగుతాడన్నది చూడాలి. ఎందుకంటే ఆయన సోదరుడు మెగాస్టార్‌ చిరంజీవి తెలుగు రాష్ట్రాల్లో గొప్ప ఫాన్‌ ఫాలోయింగ్‌ ఉన్నవారు,  రాజకీయాల్లోకి రాగానే ఎన్టీఆర్‌లా ఒకే ఉదుటన సీఎం అయిపోవచ్చుననే అనుకన్నారు. కానీ జరిగింది వేరు. ఆయన పార్టీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేసి తిరిగి మొహానికి రంగు వేసు కుని స్క్రీన్‌ మీద నాలుగు ఫైట్లు, రెండు డ్యూయెట్స్‌తో అభిమానుల ఆదరణ నీడలోకి వెళ్లేరు.  

ఇదంతా కళ్ల ముందు జరిగినది. దీనికి ప్రత్యేకించి కల్పితాలేమీ లేవు. ఇప్పుడు తమ్ముడు గారు తన అభిమానులకు, రాష్ట్రంలో కొత్త పార్టీ రావాలని, నిలవాలని ఆశించినవారికి పవన్‌ ఆశలు కల్పించేడు. 2019 ఎన్నికలలో తొలి సారి ఎన్నికలలో పోటీకి తనే జనసేన పార్టీ తరఫున అభ్యర్ధులను నిలిపారు. తానూ స్వయంగా రెండు స్థానాల నుంచి పోటీ చేశారు. కానీ ఫలితం అత్యంత నిరాశా జనకంగా వచ్చింది. కేవలం ఒక్కటంటే ఒక్క స్థానంలోనే జనసేన విజయం సాధించింది. జనసేనాని పవన్ కల్యాణ్ స్వయంగా పోటీ చేసిన రెండు స్థానాల నుంచీ ఓడిపోయారు.

ఈ తరువాత ఈ మూడేళ్లుగా ఆయన రాజకీయ పరిస్థితులు, పరిణామాలను గమనిస్తూనే గడిపేడు. అది పరిశీలనో, భయయో తెలియనీయకుండా చాలా జాగ్రత్తలే తీసుకున్నారు. అప్పుడపుడూ ఏవో స్టేట్‌మెంట్లు ఇస్తూ తన వునికిని తెలియజేస్తూన్నారు. కాగా ఇప్పుడు కాస్తంత స్వరం పెంచి అందరికీ వినపడేట్టు మాట్లాడు తున్నారు. ఎందుకంటే ఆయన మనసులో మాట ఆయన వెంట వున్న నాయకులు, వీరాభిమానులకు సరిగా అర్ధం అయిందా అంటే అనుమానమే గనుక!
రాబోయే ఎన్నికలకు టిడీపీకి మద్దతునిచ్చే అవకాశం లేదన్నారు పవన్‌. హీరోగారు ఇంత గట్టిగా చెప్పడంతో బిజెపీ కూడా జనసేనను అంతగా పట్టించుకోవడం లేదు.

కాకుంటే కొద్దిరోజులుగా సాగుతున్న పొత్తుల ప్రచార హౌరులో తనను తాను ప్రొజెక్ట చేసుకున్నారు పవర్‌ స్టార్‌. తప్ప ప్రత్యేకించి గట్టిగా తన అను చరులకు సూచనలు చేసిందేమీ లేదు. పైగా ఈ పొత్తులు, మాటలు.. ఇవన్నీ పెద్దగా సీరియస్‌గా తీసుకోవద్దని, ఇలాంటివి రాజకీయ నాయకులకు చాలా సహజమని పార్టీ వీరాభిమానులకు తెలియజెప్పేడు. పైగా రాజకీయ నాయకుల తీరు ఒక్కసారిగా మారిందంటే అలా మారడానికి గల కారణాలు తెలుసుకోవాలని, తిట్టినవారే పొగుడుతూ దరి జేరితే పూర్తిగా మారిపోయారని అర్ధం కాదని గొప్ప జ్ఞానబోధ చేసేరు జనసేన అధినాయకుడు.

రాజకీయాలు, రాజకీయ నాయకులు కాలానుగుణంగా, సందర్భానుసారం మారవచ్చునన్నది లోక రహస్యం. ఇందులో పెద్దగా ఆలోచించి బాధపడాల్సిందేమీ లేదు. కానీ రాజకీయరంగంలో ఇలాంటివారు వుంటారు, ఇలాంటి వారి మాటల్ని పట్టించుకోవద్దని, వారిని సీరియస్‌గా తీసుకుంటే మనం చేయాల్సిన పనులు జరగవని హెడ్‌మాస్టర్‌ స్థాయిలో తన అభిమానులకు ఒక బహిరంగ రహస్యాన్ని పవర్‌స్టార్‌ సెలవిచ్చాడు.

ఇదంతా తాను ఒంటరిగా పోటీచేస్తున్నానని తెలియజేయడానికి. పొత్తుల కోసం చేసిన ప్రయత్నాలు అంతగా ఫలించవన్న జ్ఞానోదయం కలిగినందుకు. తన ప్రత్యర్ధులు రాజకీయరంగంలో డొక్కశుద్ధి బాగా వున్న వారు కావడం వల్ల. మరంచేత, తాను అనుకున్నవన్నీ తనకే వచ్చి తగలడాన్ని అభిమానులకు గ్రహింపు కలిగే లోగానే వారికి ట్వీటోపదేశం చేశారు పవర్‌స్టార్‌.
 

By
en-us Political News

  
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.