బండి వారి స్వామి భక్తి!
Publish Date:Jun 8, 2022
Advertisement
తెలంగాణాలో టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఎలాగయినా కూలదోసేయాలన్న కంకణం కట్టుకున్నారు యావత్ బిజెపీ నాయకులూ. రాష్ట్రానికి ఢిల్లీ నాయకులు రావడం ఇక్కడ హితోపదేశం చేయడం వెళ్లడం మామూలయి పోయింది. అటు నుంచి ఇటు ఏ కాషాయ వస్త్రధారులు వచ్చినా రాజకీయమే మాట్లాడుతున్నారు. ఇక్కడ బండి సంజయ్ ఆధ్వర్యంలో పార్టీని మరింత బలోపేతం చేసి తమ సత్తా ఏమిటన్నది చాటడంలో తల మునకలయ్యారు తెలంగాణా బిజెపీ నాయకులు, కార్యకర్తలు.
ప్రధాని వెూడీ సైతం తెలంగాణాలో పార్టీ అధికారంలోకి రావాలనే గట్టిగా అనుకుంటున్నారు. గతంలో కేంద్రంలో కాంగ్రెస్ కుటుంబ పాలనలాగానే తెలంగాణాలో కేసిఆర్ కుటుంబ పాలన వుందని దీన్ని సాగనీయరాదని పట్టుదలతో వున్నారు యావత్ బిజెపీ వర్గీయులు. ఇందుకోసం అనేక మార్గాలు అవలంబిస్తున్నారు. పోతే, నాయకులు ఢిల్లీ వెళ్లి చర్చించడం, వ్యూహ రచనలకు బలం చేకూర్చుకోడం మామూలే. కానీ బండి సంజయ్ ఇక్కడి నుంచి ఏకంగా కొందరు జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లను కూడా తీసికెళ్లేరు. వారితో ప్రధాని మాట్లాడటం చాలా చిత్రంగా వుంది.ఏదైనా రాష్ట్ర ముఖ్యమంత్రికి అప్పాయింట్ మెంట్ ఇచ్చి కేటాయించే సమయం కంటే ఎక్కువ సమయం కార్పొరేటర్లకు మోడీ కేటాయించి మాట్లాడటం వారి యోగ క్షేమాలు, కుటుంబ సభ్యుల వివరాలు సైతం తెలుసుకుని ఆత్మీయంగా మెలగడం ఏ విధంగా చూసినా ఆశ్చర్యం కలిగించక మానదు. అయితే
కార్పోరేటర్లకు ఢిల్లీ నగర సందర్శన చేయించడం, కేంద్రంలో తన పరిచయాలను వారికి తెలిసేట్టు చేసి తన గౌరవాన్ని పెంచుకోవాలన్న తాపత్రయం బండి బాగానే ప్రదర్శించేరు. రైల్లోనో, విమానంలోనో ఢిల్లీ తీసికెళ్లి అక్కడి వాతావరణం పరిచయం చేసి మనం కూడా ఇలా వుండాలని, ప్రధాని చెప్పే సూక్తిముక్తావళిని ఆకళింపు చేసుకుని అక్షరం పొల్లుపోకుండా అమలు చేస్తేనే మనకు మనుగడ అన్న సూత్రాన్ని కార్పొరేటర్లకు తెలియజేసి వుంటారు. వారు తమ నాయకుడు ఏకంగా ప్రధానిని కలిసే అదృష్టం కల్పించేరన్న ఆనందం బాగానే వుంటుంది. జీవితాంతం బండి పేరు చెప్పుకుంటారు. ఎందుకంటే వేరే పార్టీలో ఇలాంటి అవకాశం వారికి కలిగే అవకాశం వుండేది కాదేవెూ!
కార్పొరేటర్ల సమావేశంలో వారు సమాజసేవతో పాటు అట్టడుగు వర్గాలకు చేయవలసిన సహాయసహకారాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని వెూదీ బోధ చేసేరు. అంతే కాదు కేవలం కార్పొరేటర్ల గానే మిగిలిపోకుండా ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని గెలవాలని లేనిపోని వూహలు రేకెత్తించారు. అసలే బండి సంజయ్ తో వెళ్లినవారు, పైగా బీజేపీ కార్పొరేటర్లు తప్పకుండా వెూదీ జపం చేసేవారే అయి వుంటారు. మరి ఏకంగా ప్రధానే తమకు గొప్ప మార్గాన్ని సూచించేరు గనుక రేపటి నుంచే కాబోయే ఎమ్మెల్యేలం అనుకుంటే హైదరాబాద్ పరిస్థితి ఏం గావాలి అసలే జీహెచ్‌ఎంసీ పనుల పట్ల ప్రజలు విసిగెత్తుతుంటారు.
ఇప్పుడు ఎమ్మెల్యేలని కలలుగంటూ ఆ ధ్యాసలోనే వుంటే కార్పొరేటర్లుగా వారు వెలగబెట్టేది శూన్యమే! కార్పొరేటర్లను ఢిల్లీ తీసికెళ్లడం బండి సంజయ్ కి రాజకీయంగా ఎంతో వుపయోగపడుతుందేవెూగాని హైదరాబాద్‌కి కాదు. అందుకే టిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కి కోపం వచ్చింది. ప్రభుత్వాన్ని నడుపుతున్నారా లేక ఎన్జీఓ నా అంటూ గట్టిగానే ప్రశ్నించేరు. రాష్ట్రానికి ఇవ్వవలసిన నిధులు, చేయవలసిన సాయం గురించి ఆలోచించి తగిన విధంగా స్పందించాల్సిందిబోయి కార్పొరేటర్లను ఎమ్మెల్యేలు కావడం లక్ష్యంగా పెట్టుకోమని గొప్ప సూచన చేయడం ప్రధాని స్థాయికి తగదేవెూనని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏమయినప్పటికీ, ఈ విధంగా నగర కార్పొరేటర్లను ప్రత్యేకంగా కలిసి వారితో మాట్లాడటం, వారికి సమాజసేవ గురించి చెప్పడం ప్రధాని వెూదీ వల్లనే అయింది. బండి అడుగడుగునా భజంత్రీలతో సిద్ధపడి, తన స్వామి భక్తిని బాగా చాటుకుంటూ చిర్నవ్వుతో తనకు కేంద్రంలో వున్నవారికీ మధ్య సత్సంబంధాలను లోకల్ టాలెంట్‌కి బాగానే ప్రదర్శించేరు.
http://www.teluguone.com/news/content/bandi-exhibition-of-modi-bhajan-by-taking-corporators-to-delhi-25-137303.html





