వస్తున్నా మీ కోసం.. ఇక ప్రజాక్షేత్రంలోనే చంద్రబాబు

Publish Date:Jun 8, 2022

Advertisement

ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. అయితే రాజకీయ హీట్  చూస్తుంటే ఇప్పుడో ఇహనో అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయా అన్నంత హడావుడి కనిపిస్తోంది. ముందస్తు ఎన్నికలు ఉంటాయా ఉండవా అన్న సంగతి పక్కన పెడితే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల హీట్ పీక్స్ కి చేరింది.

 మాటల యుద్ధం, పొత్తుల ఎత్తులు జోరుగా నడుస్తున్నాయి. తెలుగుదేశం, వైసీపీ, జనసేన, బీజేపీ మూడూ వేటికవే తమ తమ వ్యూహాలకు పదును పెట్టుకుంటున్నాయి. జగన్ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని భావించి సో కాల్డ్ సంక్షేమ పథకాలు ఆగిపోయే పరిస్థితి రావడానికి ముందే ఎన్నికలకు వెళ్లి లబ్ధి పొందాలనుకుంటే.. ముందస్తు తథ్యం. ఒక వేళ జగన్ అలా తలపోయకపోయినా.. వైసీపీ పట్ల ప్రజలలో వ్యక్తమౌతున్న వ్యతిరేకత ఇలాగే కొనసాగేలా చేసేందుకు తెలుగుదేశం వేగంగా కార్యాచరణలోకి దిగుతోంది.

మహానాడు విజయంతో కేడర్ లో ఉప్పొంగుతున్న ఆనందోత్సాహాలను అలాగే కొనసాగేలా చేయడానికి విస్పష్ట కార్యాచరణతో కార్యరంగంలోకి దిగుతోంది. అందులో భాగంగానే తెలుగుదేశం అధినేత చంద్రబాబు మరో అడుగు ముందుకేశారు. ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రతి జిల్లాలో మహానాడు నిర్వహణతో పాటు జిల్లాల పర్యటనల్లో ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై రోడ్ షోలు, బహిరంగ సభలకు సన్నాహాలు చేస్తున్నారు.

26 జిల్లాల్లో ఏడాది పాటు విసృత్తంగా పర్యటించేందుకు పక్కా ప్రణాళికను చంద్రబాబు రెడీ చేశారు.   క్యాడర్ లో జోష్ నింపడం, అదే సమయంలో ప్రభుత్వ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లడం లక్ష్యంగా అన్ని విధాలుగా ప్రిపేర్ అవుతున్నారు. మరో వైపు అక్టోబర్ 2 నుంచి పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ పాదయాత్ర చేపట్టడం కూడా దాదాపు ఖరారైందని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి.

వైసీపీని ఎదుర్కోవాలంటే ఎక్కువ కాలం ప్రజల్లో ఉండాలన్న లక్ష్యంతోనే చంద్రబాబు రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు. ప్రతి నెలా మూడు రోజుల పాటు పర్యటించాలనీ, ఆ పర్యటనలో  రెండు జిల్లాలను కవర్ చేయాలని ప్రణాళిక రచించారు. అందులో భాగంగానే ఈ నెల మూడో వారం నుంచి పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. మొదటి రోజు బహిరంగ సభ, రెండో రోజు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జులతో సమీక్షలు, క్యాడర్ తో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తారు.

జిల్లా టూర్ లో మూడో రోజు వివిధ నియోజకవర్గాల్లో రోడ్ షోలలో పాల్గొంటూ  ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై ప్రసంగిస్తారు. ఏడాదిలో 80కిపైగా నియోజకవర్గాలు కవర్ అయ్యేలా పర్యటన రూపొందించారు. అటు జిల్లాల పర్యటనలు, ఇటు పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ వ్యవహారాలు సమాంతరంగా జరిగేలా పక్కాగా షెడ్యూల్ ఖరారైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా తొలుత ఈ నెల 15న అనకాపల్లి జిల్లా చోడవరంలో జరిగే మినీ మహానాడులో పాల్గొని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత 16న అనకాపల్లిలో నియోజకవర్గాల వారిగా సమీక్షలు 17వ తేదీన చీపురుపల్లిలో బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు.

By
en-us Political News

  
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.