ట్రంప్ అతి చేస్తే బ్యాన్ తప్పదంటున్న ట్విట్టర్!
Publish Date:Dec 1, 2016
Advertisement
ట్రంప్ ని అమెరికా ఓటర్లు ప్రెసిడెంట్ ని చేసేశారు. కాని, ఇప్పటికీ చాలా మందికి ట్రంప్ అంటే పడటం లేదు. అసలు ఆయన అమెరికా అధ్యక్షుడని అంగీకరించలేకపోతున్నారు. ఇండియాలో మోదీ లాంటి పొజీషనే ట్రంప్ కూడా ఫేస్ చేస్తున్నాడు. మీడియా, మేధావులు, ఇంకా చాలా వర్గాలు రకరకాల అనుమానాలతో ట్రంప్ ను చూస్తున్నాయి. మరీ విడ్డూరం ఏంటంటే... ట్విట్టర్ లాంటి సోషల్ నెట్ వర్క్ సైట్ కూడా ట్రంప్ పై దురభిప్రాయంతోనే వున్నట్టు కనిపిస్తోంది!
డొనాల్డ్ ట్రంప్ ఒక సాధారణ బిజినెస్ మ్యాన్ స్థాయి నుంచీ హిల్లరీ క్లింటన్ ను ఓడించి అమెరికా ప్రెసిడెంట్ అయ్యే స్థాయి దాకా ఎలా ఎదిగాడు? వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా! ఆయన బలమే కాంట్రవర్సీ. దాన్నే ఇప్పుడు ట్విట్టర్ సీరియస్ గా తీసుకుంటోంది. ఆయన అధ్యక్షుడు అయినా సరే ట్విట్టర్ లో అందరికీ వర్తించే రూల్సే ట్రంప్ కి వర్తిస్తాయని చెబుతోంది. ఆయన వివాదాస్పద ట్వీట్స్ చేస్తే అకౌంట్ బ్యాన్ చేయటానికి కూడా వెనుకాడమంటోంది. ట్విట్టర్ ప్రతినిధుల ఈ మాటలు మరీ అతిగానే వున్నాయనుకోవాలి. ఎందుకంటే, ట్రంప్ తాను ఏమి మాట్లాడాలనుకున్నా ఇప్పుడు ప్రపంచ మీడియా పనిగట్టుకుని వింటుంది. అలాంటప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయటానికి ట్విట్టర్ ఎందుకు ఎంచుకుంటాడు? ఒకవేళ ఎంచుకున్నా ఆయన అకౌంట్ ని కూడా సామాన్యుల అకౌంట్ లా భావించి బ్లాక్ చేస్తామనటం ... కొంచెం ఓవరే! అమెరికా ప్రెసిడెంట్ అకౌంట్ అంత ఆషామాషిగా రద్దు చేసేస్తారా?
ఒకవైపు ట్విట్టర్ అమెరికా అధ్యక్షుడు అయినా మాకు స్పెషలేం కాదని బిల్డప్ ఇస్తుంటే... ఫేస్బుక్ మాత్రం కాబోయే అమెరికన్ ప్రెసిడెంట్ ఖాతాని స్పెషల్ గా చూస్తామని చెబుతోంది! ఆయన మాటకు, పోస్టుకు వుండే వాల్యూ దృష్ట్యా ప్రత్యేకంగా పరిగణిస్తామని అంటోంది. అంటే... ట్రంప్ ఏం రాసినా ఆయన ఖాతాపై చర్య తీసుకోమని చెప్పకనే చెబుతోందన్నమాట!
భారతదేశంలో మోదీని, అమెరికాలో ట్రంప్ ని అత్యధిక శాతం మీడియా మొదట్నుంచీ వ్యతిరేకిస్తూనే వుంది. తాజాగా ట్విట్టర్ కూడా ట్రంప్ ను టార్గెట్ చేయటం కాస్త ఆశ్చర్యకరమే. సొషల్ మీడియా అంటేనే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. అటువంటిది ట్విట్టర్ ఏకంగా ట్రంప్ పోస్ట్ చేసే ట్వీట్సే ఇష్టానుసారం వుండకూడదని చెప్పటం... ఖచ్చితంగా భావ ప్రకటనకు భంగమే!
http://www.teluguone.com/news/content/donald-trump-45-69729.html





