జనగణమన అనగానే... రణగొణ ధ్వని మొదలెట్టారు!
Publish Date:Nov 30, 2016
Advertisement
ఒకప్పుడు థియేటర్స్ లో జాతీయ గీతం వినిపించే వారు తెలుసా? ఈ మాట అప్పుడప్పుడూ పెద్ద వాళ్లు చెబుతుంటే చాలా మందే విని వుంటారు. కాని, ఇప్పుడు మళ్లీ పాత రోజులు వచ్చేశాయి! థియేటర్స్ కి జనగణమన తిరిగొచ్చింది! సినిమాకి వెళ్లింది సరదాగానే అయినా ఎంటర్టైన్మెంట్ మొదలయ్యే ముందు మీరు సీరియస్ గా లేచి నిల్చోవాలి. జాతీయ గీతం వస్తున్నంత సేపూ బుద్దిగా వుండాలి. ఎదురుగా తెర మీద కనిపిస్తోన్న జాతీయ జెండాని గౌరవించాలి. ఇది ఏ రాష్ట్ర ప్రభుత్వమో, కేంద్ర ప్రభుత్వమో తీసుకున్న నిర్ణయం కూడా కాదు. సాక్షాత్తూ అత్యున్నత న్యాయస్థానం ఈ ఆదేశం జారీ చేసింది....
సుప్రీమ్ కోర్టు ఇచ్చిన జాతీయ గీతం తీర్పు చాలా మందిని సంతోషపరిచింది. నిజంగా కూడా అందులో వ్యతిరేకించటానికి ఏముంది? మన దేశ జాతీయ గీతానికి మనం లేచి గౌరవం ఇవ్వకపోతే మరెవడు ఇస్తాడు? కాని, జాతీయ భావం బలపరిచేలా సుప్రీమ్ ఇచ్చిన జనగణమన తీర్పుపై కూడా కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు! అదేదో కోడిగుడ్డు మీద ఏవో పీకటం అంటారే... అలా వింత వింత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు! సినిమా థియేటర్స్ లో జాతీయ గీతం కాన్సెప్ట్ నచ్చని వారు చెబుతోన్న అభ్యంతరాల్ని ఓ సారి చూద్దామా...
1. సినిమా హాల్స్ లో జాతీయ గీతం ప్లే చేస్తారు సరే. మరి అది వస్తున్నప్పుడు అందరూ లేచి నిల్చున్నారా లేదా అని ఎవరు చెక్ చేస్తారు? పోలీసులు వుంటారా? పోలీసులు లేకపోతే సాటి జనంలో కొందరు ఆవేశపడి లేచి నిల్చోని వారిపై దాడి చేస్తే? అంతే కాదు, జనగణమన ఎవరన్నా గొంతుకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు వుండి పాడలేకపోతే... అప్పుడెలా? వాళ్లు డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ వెంట తీసుకు రావాలా? .... ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారు సో కాల్డ్ మేధావులు!
2. కొన్ని సినిమాలకి పెద్దలు ప్రత్యేకంగా పిల్లల్ని తీసుకు వస్తారు. అటువంటి చిన్న పిల్లల సినిమాల సమయంలో చిన్నారుల్ని సీట్స్ లో కూర్చోబెట్టడమే చాలా కష్టం. మరిక జాతీయ గీతం టైంలో వాళ్లు సైలెంట్ గా లేచి నిల్చొమ్మంటే నిల్చుంటారా? వాళ్లు వినకపోతే పెద్దలు వాళ్లని ఎలా కంట్రోల్ చేయాలి?.... ఇలాంటి 'చిన్న చిన్న' డౌట్సు బోలెడు వస్తున్నాయి!
3. ప్రస్తుతం సినిమా ప్రారంభానికి ముందు యాడ్స్ వస్తే జనం ఏం చేస్తారు? గబగబా వెళ్లి పాప్ కార్న్ తెచ్చుకోవటమో, ఫోన్ లో ఫేస్ బుక్ లోకి లాగిన్ అయ్యి వాచింగ్ మూవీ అని స్టేటస్ పెట్టడమో చేస్తుంటారు. అలాంటి బీజీ పాట్రియాటిక్ ఇండియన్స్ జాతీయ గీతం వస్తే పట్టించుకుంటారా? .... ఇది కూడా కొందరు మేధావులు ఫేస్బుక్ లోనే వ్యక్తం చేస్తున్న వాల్యుబుల్ డౌట్!
4. ఇక కొందరైతే బీ గ్రేడ్ సినిమాల సంగతేంటని ప్రశ్నిస్తున్నారు! శృంగారం, బూతు కలగలిసి సాగే అలాంటి సినిమాల ప్రారంభంలో జాతీయ గీతం ఎలా వినిపిస్తారు అంటున్నారు?... ఇది జాతీయ గీతం పై వస్తోన్న అన్ని అనుమానాల్లో అత్యంత దిక్కుమాలిన అనుమానమనే చెప్పాలి!
5. ఇక సోషల్ మీడియా ఎలాగూ ఫ్రీ ఆఫ్ కాస్టే కాబట్టి చాలా మంది సినిమా హాల్స్ లో జనగణమనపై అప్పుడే కామెడీలు స్టార్ట్ చేసేశారట! ముందు ముందు పెళ్లిల్లు, బ్యాంక్ క్యూలు, స్విమ్మింగ్ పూల్స్ లాంటి వాటి వద్ద కూడా జాతీయ గీతం వినిపిస్తారా అంటూ వెటకారంగా ప్రశ్నిస్తున్నారట!
ఇంతకీ, సినిమా హాల్స్ లో భారతదేశాన్ని కీర్తిస్తూ సాగే ఒక నేషనల్ యాంతమ్ కోసం మనం రెండు నిమిషాలు భరించలేమా? దాన్ని తప్పించుకోవటానికి ఇన్ని రకాల డౌట్స్ వ్యక్తం చేస్తూ మన మేధావితనం చూపించుకోవాలా? అస్సలు అవసరం లేదు! రెండున్నర గంటల సినిమాకి ముందు రెండున్నర నిమిషాల జాతీయ గీతం బరువేం కాదు. ఆనందకరమైన బాధ్యత. దాన్ని ఎవరైనా పట్టించుకోకుండా కాళ్లు చాపుకుని నిర్లక్ష్యంగా కూర్చుంటే ... పోలీసులు వచ్చి పట్టుకోకపోవచ్చు! కాని, ఖచ్చితంగా చుట్టూ వున్న బోలెడు మంది దేశభక్తుల్లో ఎవరో ఒకరు కాలర్ పట్టుకుని నిలదీస్తారు! ఇప్పుడు భారతీయుల్లో కావాల్సింది అలాంటి ఓ 'మోస్తరు' ఆవేశమే!
http://www.teluguone.com/news/content/-national-anthem-45-69689.html





