కొంచం విరామం అంతే మళ్లీ చమురు సంస్థలు తమ బాదుడు మొదలెట్టేశాయి. తాజాగా గృహావసరాలను వినియోగించే గ్యాస్ సిలెండర్ ధరపై ఏకంగా 50 రూపాయలు వడ్డించాయి. ఈ వడ్డింపు బుధవారం నుంచే అమలులోకి వస్తుంది. ఇటీవలే అంటే ఈ నెల 1వ తేదీన వాణిజ్యావసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ ధరను 183.50 రూపాయలు తగ్గించిన చమురు సంస్థలు గృహావసరాలకు వినియోగించే బండపై 7వ తేదీ నుంచి 50 రూపాయలు వడ్డించడం విశేషం. ఇప్పటికే వెయ్యి రూపాయలు దాటేసిన గ్యాస్ సిలెండర్ ధర ఈ పెంపుతో 1100 రూపాయలకు చేరుకుంది.
హైదరాబాద్ లో 14.2 కేజీల ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ ధర 1105 రూపాయలకు చేరుకుంది. కేంద్రంలో మోడీ సర్కార్ ధరల పెంపు విషయంలో తగ్గేదే లే అన్న తీరుతో వ్యవహరిస్తున్నది. ఏదైనా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉంటే.. ఆ సమయంలో మాత్రం ధరల పెంపును ఆపి ఎన్నికలు పూర్తయిన తరువాత అదీ ఇదీ కలిపి వడ్డించడం కేంద్రానికి ఒక అలవాటుగా మారిపోయింది.
నిత్యావసర వస్తువుల ధరలన్నీ అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతున్నా వాటి నియంత్రణ విషయంలో మాత్రం ప్రభుత్వం నిష్క్రియాపరత్వం ప్రదర్శిస్తూ, ధరల పెంపు విషయానికి వచ్చే సరికి ఎక్కడ లేని తొందరపాటు, ఉత్సాహం ప్రదర్శిస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/domestic-usage-gas-cylender-price-hike-by-rs50-25-139169.html
సజ్జల రామకృష్ణా రెడ్డి స్వతాహాగా రాజకీయ నాయకుడు కాదు.ఆయన ఒక జర్నలిస్ట్. జర్నలిస్ట్ గా జీవితం ప్రారంభించిన ఆయన వ్యాపార వేత్తగా ఎదిగారు.
పాలమ్మినా నీళ్లమ్మినా అంటూ సోషల్ మీడియాలో పాపులర్ అయిన మంత్రి మల్లారెడ్డికి వచ్చే ఎన్నికల్లో టికెట్ రాకపోవచ్చని తెలుస్తోంది. నియోజకవర్గంలో ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నట్లు
మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ బీఆర్ఎస్ పని తీరు మీద చేసిన విమర్శలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మిత్ర పక్షాలుగా ఉన్న ఈ రెండు పార్టీలు ప్రస్తుతం శత్రుపక్షాలుగా మారాయి.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అన్ని రాజకీయ పక్షాలూ సిద్ధం అవుతున్నాయి. అధికార బీఆర్ఎస్ తన పట్టు నిలబెట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తోంది.
భారత రైల్వే ప్రయాణీకుల భద్రతను గాలిలో దీపంగా మార్చేసిందనడానికి ఒడిశాలోని బాలాసూర్ వద్ద జరిగిన ఘోర ప్రమాద సంఘటన నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది.
గత మూడేళ్లుగా ఉన్న పెండింగ్ బిల్లుల కారణంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖకు తన సేవలను టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) ఉపసంహరించుకోవడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్ (సిసిటిఎన్ఎస్) డౌనైపోయింది.
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో 175 మంది ఏమ్మేల్యేలున్నారు.. అందులో అధికార వైసీపీ ఎమ్మెల్యేలే 151 మంది ఉన్నారు ..మళ్ళీ అందులో ఓ పాతిక మంది వరకు మంత్రులు. వారిలో మళ్ళీ ఓ ఐదుగురు ఉప ముఖ్యమంత్రులున్నారు. అయితే, ఇంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, వీరు గాక సలహాదారులు ఇలా పేరు గొప్ప పదవుల్లో ఎందరున్నా, అందరూ జీరోలే. ఎవరికీ ఏ అధికారం లేదు.
తెలంగాణ రాష్ట్రానికి దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అన్న నినాదం ఎక్కడో విన్నట్లుగా ఉంది కదా?! నిజమే, ప్రస్తుత ముఖ్యమంత్రి కవ్లకుంట్ల చంద్రశేఖరరావు తన నోటితో చెప్పిన మాటలు ఇవే.
సరిగ్గా హస్తినలో చంద్రబాబు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో భేటీ అయిన సమయంలోనే జనసేన రాజకీయ వ్యవహారాల ఇన్ చార్జ్ నాదెండ్ల మనోహర్.. తెలుగుదేశం, జనసేనల మధ్య పొత్తు విషయంలో ఎలాంటి అనుమానాలకూ తావు లేదని కుండ బద్దలు కొట్టేశారు.
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు హస్తినకేగి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అవ్వడం ఏపీలో అధికార వైసీపీ కాళ్ల కింద భూమి కదిలిపోయినట్లైంది.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తెలుగుదేశం అధినేత చంద్రబాబు తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడంలో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం(జూన్ 4) 87వే 434 మంది తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ట్రిపులార్ అంటే ఎవరో తెపుసు కదా... అవును.. ఎప్పుడూ వార్తల్లో ఉండే, రచ్చబండలో అధికార వైసీపీ సర్కార్ ను ఉతికేసే నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ టికెట్ మీద నర్సాపురం నుంచి గెలిచిన ఆయన ఆది నుంచీ అసమ్మతి ఎంపీగా ముద్ర వేసుకున్నారు.