వాలంటీర్లకు వైసీపీ ఎసరు!

Publish Date:Jul 6, 2022

Advertisement

ప్రజలలో వ్యతిరేకత వైసీపీపై కాదు.. వైసీపీ ఎమ్మెల్యేలపై కాదు వ్యతిరేకత అంతా వాలంటీర్లపైనే.. ఇదీ వైసీపీ నేతలు ఇప్పుడు ముక్తకంఠంతో చెబుతున్న మాట. మనం నియమించిన వాళ్లు వాలంటీర్లు ఇప్పుడు వారి వల్లే మనకు ఇబ్బంది ఎదురౌతోందనుకుంటే వాళ్లని తొలగించేద్దాం అదెంత సేపు అన్నదే ఇప్పుడు వైసీపీ నేతలు చెబుతున్న మాట. పార్టీ ప్లీనరీలకు ముందు నిర్వహించిన జిల్లాల ప్లీనరీలలో నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఇదే విషయం చెప్పారు.

పార్టీ బలోపేతం, పార్టీ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఇలా వేటి గురించీ జిల్లా ప్లీనరీలలో చర్చించలేదు. అందరూ వాలంటీర్లను ఆడిపోసుకోవడానికే పరిమితమయ్యారు. తానేటి వనిత, దాడిశెట్టి రాజా, అంబటి రాంబాబు ఇలా మంత్రులందరిదీ దాదాపు ఒకటే మాట.. వాలంటీర్ల వల్ల మనం ప్రజలలో చులకన అవుతున్నాం. వారిని తొలగించేద్దాం అనే. ఎమ్మెల్యేలు, నాయకులూ కూడా వారికి వంత పాడారు. అదే సమయంలో వాలంటీర్లు అందరూ వైసీపీవారే అని కూడా అంటున్నారు. ఇదేం తిరకాసో అర్ధం కాక రాజకీయ పండితులు సైతం తలలు పట్టుకుంటున్నారు. ఇంతకీ అసలు విషయమేమిటంటే...పథకాల లబ్ధిదారుల ఎంపిక నుంచి ప్రతి విషయాన్నీ వాలంటీర్లకు అప్పగించిన జగన్ నియోజకవర్గాలలో, గ్రామాలలో, వార్డులలో వారిదే పెత్తనంగా మార్చేశారు. దీంతో ఎమ్మెల్యేలు, ఆఖరికి మంత్రులు కూడా వారి వారి ఇలాకాలలో డమ్మీలుగా మారిపోయారు.

ప్రజలకు దూరమయ్యారు. ఏ పనీ చేయలేక నిస్సహాయులుగా మిగిలిపోయారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వారిలో ఆందోళన, అలజడి ఆరంభమైంది. తమ వారి వద్ద తమ  పలుకుబడి చూపించుకోవాలంటే నెపం వాలంటీర్లపై నెట్టేయడమే మార్గమని భావిస్తున్నారు. వాలంటీర్లు వారికి ఇచ్చిన అవకాశాలను దుర్వినియోగం చేసుకుని వ్యవస్థలో జొరబడి అస్తవ్యస్తం చేసేశారని నిందిస్తున్నారు. వారిని తొలగించేద్దామనీ, ఆ తరువాత మనదే రాజ్యమని కింది స్థాయి క్యాడర్ కు నచ్చ చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

ప్రజలకు ప్రజాప్రతినిధులకు వారధిగా ఉంటారన్న ఉద్దేశంతో జగన్ ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ ప్రజా ప్రతినిథులను డమ్మీలను చేసేలా మారిపోయిందన్న అసంతృప్తి వైసీపీ ఎమ్మెల్యేలలో చాల కాలంగా ఉంది. ఇంత కాలం లోపల్లోపల దాచుకున్న ఈ అసంతృప్తినీ, ఆగ్రహాన్నీ జిల్లా ప్లీనరీలలో ఒక్క సారిగా వెల్లగక్కేశారు. అసలే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తరువాత పార్టీలో అసంతృప్తులతోనే సమస్యలు ఎదుర్కొంటున్న పార్టీ అగ్ర నేతలకు ఇప్పుడు వాలంటీర్లపై ప్రజా ప్రతినిథుల ఆగ్రహం కొత్త తలనొప్పులను తీసుకువస్తోంది. వెరసి ఇది వాలంటీర్ల ఉద్యోగాలకు ఎసరు తీసుకువచ్చే వరకూ వెళ్లింది. ఇప్పటికే రెగ్యులరైజేషన్ విషయంలో అసంతృప్తితో ఉన్న వాలంటీర్లు ఇప్పుడు తొలగింపు అంటూ పార్టీ కొత్త పల్లవి ఎత్తుకోవడంతో రగిలిపోతున్నారు.

మొత్తం మీద ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి కుటుంబం వైసీపీ వైపే ఉండేందుకు జగన్ వ్యూహాత్మకంగా ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ ఇప్పుడు మొదటికే మోసం అన్నట్లుగా తయారైంది. ఇటు పార్టీ క్యాడర్ లోనూ.. అటు ప్రజలలోనూ వాలంటీర్లపై ఆగ్రహం పెల్లుబుకుతుండటం.. ఆ వ్యవస్థ వల్లే పార్టీ కేడర్ కు ప్రజలకు మధ్య సంబంధాలు తెగిపోవడం.. ఇప్పుడు వారిని తొలగిస్తే మిగిలిన స్వల్ప వ్యవధిలో మళ్లీ నియోజకవర్గాల వారీగా, వార్డుల వారీగా, గ్రామాల వారీగా పథకాల లబ్ధిదారుల వద్దకు నేరుగా ప్రజా ప్రతినిథులను పంపి పథకాల ప్రచారంతో ఊదరగొట్టే సమయం లేకపోవడంతో వైసీపీలో ఆందోళన పెరుగుతోంది. ఏం చేయాలో తెలియక సభల్లో, సమావేశాల్లో వాలంటీర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వారిని తొలగించేద్దామంటూ కేడర్ కు చెబుతూ పరిస్థితి మరింత దిగజారకుండా జాగ్రత్త పడుతున్నారు. 

By
en-us Political News

  
తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో అన్ని పార్టీలు ఎన్నికల సమరానికి రెడీ అయిపోయాయి. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ముందు వరసలో ఉంది. దసరాకు పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ చేస్తామని సీఎం కేసీఆర్ ఇదివరకే ప్రకటించారు.
ప్రజల జ్ఞాపక శక్తి తక్కువే కావచ్చు. కానీ, నడుస్తున్న చరిత్రను, పడుతున్న కష్టాలను, కళ్ళ ముందు కదులుతున్న అరాచక పాలను ప్రజలు మరిచి పోతారని ఎవరైనా అనుకుంటే అది పొరపాటే అవుతుంది. అంతే కాదు అలా ఎవరైనా అనుకుంటే వారు అమాయకులు అవుతారు లేకుంటే అజ్ఞానులు అవుతారు.
అప్పు చేసి బటన్ నొక్కి పప్పు బెల్లాలు పంచడమే పాలన అన్నట్లుగా గత నాలుగున్నరేళ్లుగా గడిపేసిన ముఖ్యమంత్రి జగన్ ను జనం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసలు అధికారంలో ఉన్న వైసీపీని పట్టించుకోను కూడా పట్టించుకోవడం లేదు.
వైఎస్ జగన్ పై కోడికత్తితో దాడి చేసిన శీను నేరం ఇప్పటికీ రుజువు కాలేదు. కానీ, అప్పటి నుండి ఇప్పటి వరకూ జైల్లోనే మగ్గుతున్నారు. ఈ కేసులో బాధితుడిగా ఉన్న ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కోర్టు ఎన్నిసార్లు పిలిచినా విచారణకు హాజరు కావడం లేదు.
దేశ మొదటి లోక్‌సభ స్పీకర్‌గా వ్యహరించిన జి.వి మౌలాంకర్, నీలం సంజీవరెడ్డి నుండి జి.ఎంసీ భాలయోగి వరకు, రాష్ట్రంలోనూ అనేక మంది స్పీకర్లుగా వ్యవహరించి ఆ స్థానానికీ ఉన్న ఔన్నత్యాన్ని, ప్రతిష్టను, గౌరవాన్ని కాపాడి ఇప్పటికీ ప్రశంసలు అందుకొంటున్న మహనీయులు వున్నారు.
తెలంగాణలో శనివారం నుంచి (సెప్టెంబర్ 30)వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, దానికి అనుబంధంగా అవర్తనం కూడా ఏర్పడినట్టు వెల్లడించింది. ఫలితంగా, శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నాలుగో విడత వారాహి యాత్ర రేపటి(అక్టోబర్ 1) నుంచి ప్రారంభం కానుంది. కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి యాత్రను వపన్ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆయన హైదరాబాద్ నుంచి బయల్దేరి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. ఎయిర్ పోర్టు నుంచి ఆయన నేరుగా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నారు.
నాకు వ్యక్తిగతం లేదు, ప్రజలు, రాష్ట్రమే ముఖ్యం అంటూ నిరంతరం శ్రమిస్తున్న మచ్చ లేని మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడిపై అక్రమ కేసు పెట్టి అరెస్టు చెయ్యడం మాటల కందని మహా విషాదమనే చెప్పాలి. కక్ష సాధించడం కోసం అన్యాయంగా గొప్ప నాయకుడిని జైలులో పెట్టి సీఎం జగన్‌రెడ్డి తన కళ్ళల్లో నిప్పులు పోసుకొన్నారు. గంద సింధూరం రాజమార్గాన పోతుంటే కుక్కలు ఎన్ని మోరిగితే ఏమవుతుంది అన్న సామెతగా, పస లేని, పనికి మాలిన ఆరోపణలతో చంద్రబాబుకు మసి పూయగలవా జగన్ రెడ్డి? చంద్రబాబు ఒక శిఖరం. ఆ శిఖరాన్ని అందుకోవాలంటే జగన్‌రెడ్డికి పది జన్మలు ఎత్తినా సాధ్యం కాదు.
తెలంగాణ కాంగ్రెస్ వచ్చే ఎన్నికలలో విజయమే లక్ష్యంగా తడబాటు లేకుండా సూటిగా ముందుకు సాగుతోంది. అసమ్మతులు, అసంతృప్తుల రణగొణధ్వనులను పార్టీ హైకమాండ్ లెక్క చేయడం లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా రాష్ట్రంలో తమ స్టేక్ తీసుకోవాలన్న కృత నిశ్చయంతో హై కమాండ్ ప్రణాళికా బద్ధంగా, వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.
ఏపీలో పాలన ఉందా అంటే ఉంది. మరి ఎక్కడా అంటే గాలి మాదిరి అది రాష్ట్ర ప్రజల కంటికి కనిపించదు. నాలుగేళ్ళ పాలనలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు.. ఆ నిర్ణయాల వలన లబ్ది పొందిన ప్రజల గురించి గట్టిగా రెండు నిమిషాలు కూడా మాట్లాడిన దాఖలాలు లేవు.
తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రంగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలకు పైగా సమయం పడుతోంది.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్‌ని నిరసిస్తూ.. వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టాలంటూ ప్రజలకు ఆ పార్టీ పిలుపు నిచ్చింది. చంద్రబాబు నాయుడుగారికి మద్దతుగా మోత మోగిద్దాం పేరిట సెప్టెంబర్ 30వ తేదీ అంటే శనివారం రాత్రి 7.00 గంటల నుంచి 7.05 నిమిషాల వరకు అంటే 5 నిమిషాల పాటు ఫ్యాలెస్‌లో ఉన్న సైకో జగన్‌కి వినిపించేలా.. ఏదో ఓ రకంగా మోత మోగించాలని ప్రజలకు పిలుపు నిచ్చింది.
పాపం బాలినేని.. పేరుకేమో సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఆప్తుడు, బంధువు. పార్టీలోనేమో ఆయన పరిస్థితి కరివేపాకు చందం. పోనీ బయటకి వెళ్లిపోదామంటే ఎప్పటికప్పుడు బుజ్జగింపులు. ఎలాగోలా ఉందామంటే మనస్సాక్షిని చంపుకొని ఉండలేని పరిస్థితి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.