ఇంటిలోని పోరు ఇంతింత కాదయా..!? నేనుండ, ఢిల్లీ పోతా..!!

Publish Date:Feb 12, 2022

Advertisement

చెప్పులోని రాయి, చెవిలోని జోరీగ.. 
కంటిలోని నలుసు, కాలిముల్లు.. 
ఇంటిలోని పోరు ఇంతింత కాదయా.. 
విశ్వదాభి రామ వినురవేమ.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్’ కు ఈ పద్యానికి ఏమైనా సంబంధం వుందా? అంటే ఉందనే అంటున్నారు ఆయన సన్నిహితులు. ముఖ్యంగా మూడో పాదం (ఇంటిలోని పోరు ఇంతింత కాదయా) ముఖ్యమత్రి ప్రస్తుత స్థితికి అద్దం పడుతోందని చెబుతున్నారు. అయితే, ఇది ఇప్పుడు మొదలైంది కాదు, చాలా కాలంగా మీడియాలో కథలు కథలుగా వినవస్తూనే వుంది. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే, కేసీఆర్’కు ఫామిలీ ట్రబుల్స్ స్టార్ట్ అయ్యాయనే వార్తలు వచ్చాయి. అంతే కాదు, కేటీఆర్’ అర్జెంట్’ గా కుర్చీ ఎక్కిచాలనే ఇంటి పోరు పడలేకనే ముందస్తుకు వెళ్ళారని, అప్పట్లోనే గట్టి ప్రచారం జరిగింది. 

అలాగే, 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా... కేసీఆర్, సుమారు రెండు నెలలకు పైగా పూర్తి స్థాయి మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేయలేదు. 2018 డిసెంబర్ 13 న ముఖ్యమంత్రి కేసీఆర్,  ప్రస్తుత హోమ్ మంత్రి మహమూద్ అలీ, ఇద్దరే ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఫిబ్రవరి 19 మంత్రి వర్గాన్ని, అది కూడా పాక్షికంగా విస్తరించారు. పూర్తి స్థాయి మంత్రి వర్గం ఏర్పాటులో, జాప్యానికి కూడా ఇంటి పోరే కారణమని అప్పట్లోనే వార్తలొచ్చాయి. చివరకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం విషయంలోనూ అనూహ్యంగా, విపరీత జాప్యం జరిగింది. అలాగే,తొలి విస్తరణలో ముఖ్యమంత్రి కేసీఆర్, అంతకు ముందు మంత్రి వర్గంలో కీలక శాఖలు నిర్వహించిన కుటుంబ సభ్యులు కేటీఆర్, హరీష్ రావుకు స్థానం కలిపించలేదు. అప్పట్లో ప్రహసనంగా సాగిన రాజకీయం వెనక ఉన్నది, ‘ఇంటిపోరే’ అంటారు. అదే విషయాన్ని, తెరాస వెలుపల ఉన్న కల్వకుంట్ల కుటుంబ సభ్యులే మీడియా ముందుకు వచ్చి మరీ చెప్పారు. 

అదే విధంగా, కేటీఆర్ పట్టాభిషేకం గురించి అనేక మార్లు కథలు కథనాలు వచ్చాయి. మీడియాలో చర్చలు జరిగాయి. ముహూర్తాలు కూడ  మీడియానే ఫిక్స్ చేసింది. ఒకానొక సందర్భంలో, డిప్యూటీ స్పీకర్  పద్మారావు, కేటీఆర్’ను, అయన సమక్షంలోనే, ‘కాబోయే ముఖ్యమంత్రి’అని సంబోదించారు. అలాగే, ‘అవును, అయితే తప్పేంట’ ని తెరాస నాయకులు మంత్రులు కూడా వంత పాడారు. నిజానికి, కేటీఆర్ కాకపోతే ఇంకో ‘ఆర్’ ముఖ్యమంత్రి అవుతారు అది పెద్ద విషయం కాదు. కుటుంబ పార్టీలలో, ‘కొడుకులే’ పార్టీ అధ్యక్షులు, ముఖ్యంత్రులు అవుతారు తప్ప బయటి వారు కారు, చివరకు కూతుర్లకు కూడా ఆ అవకాశం ఉండదు. సరే ఈ విషయంలోనూ, కేసీఆర్, కవిత మధ్య విబేధాలు వచ్చాయని, అందుకే ఆమె రాఖీ, బతుకమ్మ పడగలకు ఇతర కుటుంబ వేడుకలకు దూరంగా ఉన్నారనే, ప్రచారం జరిగింది. 
అదలాఉంటే, అంతవరకు కేటీఆర్ పట్టాభిషేకానికి కొంత అడ్డుగా ఉన్న, ఈటల రాజేదంర్ ‘ను బయటకు పంపిన తర్వాత, కేసీఆర్ మీద ఫ్యామిలీ ప్రెజర్ పెరిగిందని అంటారు. ఈ నేపధ్యంలోనే, కేసీఆర్ గత నాలుగైదు నెలలుగా ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా, ఇతర విషయాలు, విమర్శలతో పాటుగా, అంతకంటే జోరుగా, ఢిల్లీ ముచ్చట చేస్తున్నారు. ఢిల్లీ పోతా, యుద్ధం చేస్తా, అంటూ ప్రకటిస్తున్నారు. జగిత్యాల సభలోనూ ఢిల్లీ కోటను బద్దలు కొడతా, ప్రజలు మద్దతిస్తే జాతీయ రాజకీయాల్లోకి వస్తా, అంటూ బంతిని ప్రజల కోర్టులోకి నెట్టారు. అంతకు ముందు బడ్జెట్ ప్రెస్ మీట్’లోనూ  ఇలాగే, ఢిల్లీ గర్జన చేశారు. పార్లమెంట్’కు పోటీ చేస్తాననే మాట కూడా అయన నోటి నుంచి వచ్చింది. నిజమే కావచ్చును, గతంలోనూ ఆయన ఇలాంటి ప్రకటనలు చాలా చేసి ఉండవచ్చును, కానీ, ఈ సారి,  కొడుకు కోసం కేసీఆర్ త్వరలోనే  ఢిల్లీకి మకాం మార్చడం ఖాయమని అంటున్నారు. మోడీతో యుద్ధం, ఢిల్లీ కోటలు బద్దలు కొట్టడం తర్వాతి వవిషయం, ముందు ప్రగతి భవన్ ఉక్కపోత నుంచి బయట పడేందుకు, జాతీయ జెండా ఎగరేయడమే మార్గమని అందుకే ఆయన పదే పదే ఢిల్లీ ముచ్చట తీస్తున్నారని రాజకీయ వర్గల సమాచారం అంటున్నారు. ఆయితే అవునా .. కాదా ..అనేది మాత్రం ఒకక్ కేసీఆర్ కే తెలుసు.

By
en-us Political News

  
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.