పాపం దానం.. కింకర్తవ్యం
Publish Date:Jan 17, 2026
Advertisement
తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వ్యవహారం క్లైమాక్స్ కు చేరుకుంది. మొత్తం పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఫిరాయింపు ఆరోపణలు ఉండగా, వారిపై అనర్హత వేటు విషయంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలపై తన నిర్ణయాన్ని వెలువరించారు. ఆ ఏడుగురూ పార్టీ ఫిరాయించారనడానికి ఎటువంటి ఆధారాలూ లేవనీ, వారు బీఆర్ఎస్ లోనే ఉన్నారనీ స్పష్టమైనే తీర్పు ఇచ్చారు. ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అలాగే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే మాకనూరు సంజయ్ లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఈ ముగ్గురిలో కూడా దానం నాగేందర్ పరిస్థితి ఒకింత భిన్నంగా ఉంది. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించిన తరువాత కాంగ్రెస్ కండువా కప్పుకోవడమే కాకుండా, ఆ పార్టీ తరపఫున లోక్ సభ ఎన్నికలలో పోటీకి కూడా దిగారు. ఈ నేపథ్యంలో ఆయన ఇప్పటికీ బీఆర్ఎస్ లోనే ఉన్నారని స్పీకర్ చెప్పడానికి ఇసుమంతైనా అవకాశం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ముందున్న మార్గమేంటని పరిశీలిస్తే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అనర్హత వేటు నుంచి తప్పించుకోవడమే కాకుండా, తన రాజీనామా ద్వారా వచ్చే ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగడం. ఇది ఒక్కటే దానం నాగేందర్ ను అనర్హత వేటు నుంచి బయటపడేయగదని పరిశీలకులు అంటున్నారు. అలా కాకుండా ఎమ్మెల్యేగా కొనసాగి అనర్హత వేటుకు గురైతే తదుపరి ఎన్నికలలో పోటీకి కూడా ఆయన అనర్హుడయ్యే అవకాశం ఉందంటున్నారు. బహిరంగంగా వేరే పార్టీ గుర్తుపై పోటీ చేసిన వ్యక్తి పార్టీ మారలేదు అని స్పీకర్ తీర్పు ఇచ్చే అవకాశాలు ఇసుమంతైనా లేవని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/dis-qualify-axe-on-danam-nagender-head-39-212634.html





