డీజిల్‌ మండింది...గ్యాస్‌ బరువైంది!

Publish Date:Sep 15, 2012

Advertisement

దినదినగండం నూరేళ్ళ ఆయుష్షులా జీవితం గడిపేస్తున్న సామాన్యుడంటే ఏలినవారికి చాలా చులకన! అందుకే ఉన్నవాడూ లేనివాడూ అనే తేడా లేకుండా అందరూ వినియోగించే నిత్యావసర వస్తువుల ధరలను  ప్రభుత్వం విపరీతంగా పెంచేస్తోంది. ఈ క్రమంలోనే మొన్న విద్యుత్‌ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం వడ్డిస్తే... నేడు కేంద్రం డీజిల్‌ ధరని పెంచేసి గ్యాస్‌ సిలిండర్లపై పరిమితి విధించింది.నిత్యావసర వస్తువుల పంపిణీ డీజిల్‌తో నడిచే మోటార్‌ వెహికల్స్‌పైన ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి పరోక్షంగా నిత్యావసర వస్తువుల ధరలను కూడా పెంచేసినట్లుగా భావించాల్సిఉంటుంది. వంటగ్యాస్‌ను ఒక కుటుంబానికి ఏడాదికి ఆరు సిలిండర్ల వరకే పరిమితం చేసింది. ఆ కుటుంబం టైమ్‌ బాగోలేక ఏడోబండకోసం ప్రయత్నిస్తేమాత్రం సుమారుగా 750 రూపాయలు చెల్లించాల్సిందే! అంటే మామూలుగా తీసుకునే గ్యాస్‌ సిలిండర్‌  ధరకు సుమారుగా రెట్టింపు చెల్లించుకోవల్సి వస్తుంది.  ఇది ఏంటని అడిగితే ‘ చేప..చేప... ఎందుకెండలేదు...’ కథ చెప్పుకొస్తారు. నిత్యావసర ధరలు నింగినంటి అందకుండా పోతుంటే... గ్యాస్‌ బరువై...దాని క్రింద పడి నలిగిపోయే పరిస్థితే వస్తుంటే.. సామాన్యుడు... పచ్చికూరలే శరణమని భావించి.. ఆదిమానవుని అలవాటులోకి మారినా ఆశ్చర్యపోనక్కరలేదు.!

By
en-us Political News

  
గతంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరి వ్యక్తుల పేర్లపై ఉన్న ఆస్తులు, ఇటీవల  కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట బదిలీ అయ్యాయన్న రేవంత్ రెడ్డి..  హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఖరీదైన ఆస్తులు, ఫైవ్ స్టార్ హోటళ్లు, అపార్ట్‌మెంట్లు, సర్వీస్ ప్రాపర్టీల వివరాలను వెల్లడించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. జిల్లాలో మొత్తం రూ.345.78 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఉపాధి కోసం రష్యా వెళ్లిన తెలంగాణకు చెందిన నలుగురు యువకులు అనూహ్యంగా అక్కడి మిలిటరీ క్యాంపులో చిక్కుకున్నారని వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేచింది.
‘ది ప్యారడైజ్’ సినిమాలో ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో మాజీ సీఎం కేసీఆర్‌ను పోలిన పాత్రను పోషిస్తున్న నటుడు ప్రియదర్శిని మాజీ మంత్రి హరీశ్ రావు కలిసి అభినందించారు.
లక్ష్మీ భాస్కర్‌ను ఏసీబీ అధికారులు సెప్టెంబర్ 22న అరెస్ట్ చేశారు. ఆయన 48 గంటలకు మించి కస్టడీలో ఉన్నట్లు నిమ్స్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలకు పైగా కస్టడీలో ఉంటే నిబంధనల ప్రకారం అరెస్టయిన తేదీ నుంచే సస్పెండ్ అయినట్లు పరిగణిస్తారు.
హైదరాబాద్‌ పాతబస్తీలో ఆన్‌లైన్‌ ద్వారా ఆహార పదార్థాలను విక్రయిస్తున్న సంస్థలపై తెలంగాణ ఫుడ్‌ సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపించారు
హైదరాబాద్‌ గచ్చిబౌలి గోపన్‌పల్లిలో హైడ్రా తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
ఓ బహిరంగ సభలో కేటీఆర్ కేసీఆర్ తప్పు చేశారంటూ చేసిన  వ్యాఖ్యను ఎత్తి చూపుతూ బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ కేటీఆర్ ఆ సభలో ఏమన్నారంటే.. కేసీఆర్ గతంలో సొంత నియోజకవర్గాలలో ఆయా ఎమ్మెల్యేలకే అధికారాలు కట్టబెట్టి తప్పు చేశారని వ్యాఖ్యానించారు.
తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో త్వరగా అంగీకారం కుదిరేలా చర్యలు తీసుకుని, అనుమతులు ఇప్పించాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ను
JNTU కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది.
సికింద్రాబాద్ బొల్లారం పరిధిలో జరిగిన సంచలనాత్మక ఆర్మీ ఆయుధాల చోరీ ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.