తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Publish Date:May 26, 2025
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వేసవి సెలవులు ముగింపు దశకు వస్తుండటంతో భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు. సోమవారం (మే 26) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ ఏటీజీహెచ్ వెలుపలి వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక ఆదివారం శ్రీవారిని మొత్తం 91 వేల 538 మంది దర్శించుకున్నారు. వారిలో 37 వేల 538 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 80 లక్షల రూపాయలు వచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-39-198686.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-39-198686.html
Publish Date:Sep 17, 2026
Publish Date:Sep 17, 2026
Publish Date:Sep 17, 2026
Publish Date:Sep 17, 2026
Publish Date:Sep 17, 2026
Publish Date:Sep 16, 2026
Publish Date:Sep 16, 2026
Publish Date:Sep 16, 2026
Publish Date:Sep 15, 2026
Publish Date:Sep 14, 2026
Publish Date:Sep 13, 2026
Publish Date:Sep 12, 2026
Publish Date:Sep 10, 2026





