కర్ణాటకలో హస్తానికి ఎదురు గాలి.. తెలంగాణకు ముందస్తు హెచ్చరిక

Publish Date:May 25, 2025

Advertisement

దేశంలో ఉన్న 28 రాష్ట్రాలలో, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో  ఉన్న రాష్ట్రాలు మూడే మూడు. అందులో ఒకటి తెలంగాణ. తెలంగాణలో పరిస్థితి ఏమిటో ప్రత్యేకంచి చెప్పవలసిన అవసరం లేదు. ఇప్పడు కాదు, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా హస్తం పార్టీ ఓటమి తధ్యమని హస్త సాముద్రిక పండితులు స్పష్టంగా చెపుతున్నారు. నిజానిక హస్త సాముద్రిక పండితులను, రాజకీయ విశ్లేషకులను అడగవలసిన పని లేకుండానే, కళ్ళ ముందు కనిపిస్తున్న ప్రభుత్వ ప్రజా వ్యతిరేకతను గమనిస్తే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం అయ్యేపని కాదని, సామాన్యులకే అర్థమైపోతుంది.

 సరే, తెలంగాణ విషయాన్ని పక్కన పెట్టి, గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ గెలుపునకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ద్రోహదం చేసిన కర్ణాటకలో పరిస్థితి ఏమిటని చూస్తే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కర్ణాటక  కాంగ్రెస్ ‘చేయి’ జారిపోవడం ఖాయంగా కనిపిస్తోందని పీపుల్స్ పల్స్ సర్వే సంకేతాలు ఇస్తోంది. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పీపుల్స్  పల్స్ రీసెర్చ్ సంస్థ, కొడెమో టెక్నాలజీస్ సంయుక్తంగా పల్స్ ఆఫ్ ది కర్ణాటక స్టేట్ పేరిట నిర్వహించిన సర్వే ఫలితాలు అదే సూచిస్తున్నాయి.ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రతిపక్ష బీజేపీకి 51 శాతం ఓట్లతో 136-159 స్థానాలు కైవశం చేసుకుంటుందని సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి. కాంగ్రెస్ 40.3 శాతం ఓట్లతో 62-82 స్థానాలు, జేడీ(ఎస్) 5 శాతం ఓట్లతో 3-6 స్థానాలు గెలుచుకునే అవకాశాలున్నాయని,  పీపుల్స్ పల్స్ సర్వే చెపుతోంది. గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ ఈ రెండు సంవత్సరాలలో 10 శాతానికి పైగా  ఓట్లు కోల్పోయింది.

కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రభుత్వం రెండేళ్లలో పాలనలో ప్రభుత్వ వ్యతిరేక జరజరా పాకుతూ పైపైకి పోతోందని సర్వే సూచిస్తోంది. మరో వంక.. ప్రతిపక్ష బీజేపీకి ప్రజాదరణ పెరుగుతోందని సర్వేలో వెల్లడైంది.  సో.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కర్నాటకలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని సర్వే  తేల్చి చెప్పింది. అయితే..  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరగవు. కాబట్టి  కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన తక్షణ ముప్పేమీ లేదు.   డీకే శివకుమార్ ఉండనిస్తే.. సిద్దరామయ్య సర్కార్  మరో మూడేళ్ళు అధికారంలో ఉంటుంది. కానీ, ఆడుతూ పడుతూ హనీమూన్ లా సాగవలసిన తొలి రెండేళ్ళలోనే మోయలేనంత ప్రజావ్యతిరేకతను మూట కట్టుకున్న కాంగ్రెస్  ప్రభుత్వానికి, ముందున్న మూడేళ్లూ క్రొకోడైల్ ఫెస్టివల్ తప్పదని అంటున్నారు.

 నిజానికి.. 1985 నుంచి గడచిన నాలుగు దశాబ్దాల రాష్ట్ర ఎన్నికల చరిత్రను చూస్తే.. కర్ణాటక ప్రజలు ఒక సారి గెలిపించిన పార్టీని  వరసగా రెండవ సారి గెలిపించిన సందర్భం లేదు. ప్రతి ఐదేళ్లకోసారి, ప్రభుత్వాన్ని మార్చడం కర్ణాటక రాజకీయాల్లో ఆనవాయితీగా వస్తోంది.  సో ... సర్వే ఏమి చెప్పినా.. వచ్చే ఎన్నికల్లో  ఏదో మహాద్భుతం జరిగితే తప్ప కాంగ్రస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ముఖ్యంగా రెండేళ్లకే చేతులెత్తేసిన సిద్దరామయ్య సర్కార్, ఐదేళ్ళ తర్వాత తిరిగి అధికారంలోకి రావడం అయ్యే పని కాదని సర్వేలే కాదు సామాన్యులు కూడా చెపుతున్నారు. 

అదొకటి అయితే.. కర్ణాటక సర్వే నుంచి తెలంగాణ ప్రభుత్వం నేర్చుకోవలసింది, తెలుసుకోవలసింది చాలనే ఉందని పరిశీలకులు పేర్కొంటున్నారు. తెలంగాణ,కర్ణాటక రెండూ ఇరుగుపొరుగు రాష్ట్రాలు, రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో వుంది. అంతే కాదు, రెండు రాష్ట్రల్లోనూ ఇంచుమించుగా ఒకే విధమైన గ్యారెంటీలు, హమీలతో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో పోలిస్తే కర్ణాటకలో సిద్దరామయ్య ప్రభుత్వం సంక్షేమ పథకాలను కొంతలో కొంత మెరుగ్గా అమలు చేస్తోంది. అయినా, పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం.. కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళలు సహా ఏ వర్గం ప్రజల్లోనూ ఆశించిన ఆదరణ లభించడం లేదు. మహిళా ఓటర్లలో బీజేపీకి 48.4 శాతం, కాంగ్రెస్ కు 44.6 శాతం మద్దతు లభిస్తుండడంతో కాంగ్రెస్ పై బీజేపీ మహిళా ఓటర్లలో 3.8 శాతం ఆధిపత్యం కనబరుస్తోంది. పురుష ఓటర్లలో బీజేపీ 51.9 శాతం, కాంగ్రెస్ 38.9 శాతం ఓట్లు సాధిస్తుండడంతో.. బీజేపీ కాంగ్రెస్ పై 13 శాతం భారీ ఆధిక్యత చూపుతున్నట్టు సర్వేలో వెల్లడైంది.18-25 సంవత్సరాల ఓటర్లలో బీజేపీ 24 శాతం ఆధిక్యతను కొనసాగిస్తోంది. 

కాంగ్రెస్ పార్టీ, గత (2023) ఎన్నికల్లో రైతు సంక్షేమానికి  సంబంధించి  అనేక హమీలను ఇచ్చింది. సానుకూల ఫలితాలు సాధించింది. కొన్ని పథకాలను అమలు చేసింది. అయినా..  గ్రామీణ ప్రాంతలో ముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీల్లో కాంగ్రెస్ ఆదరణ దినదినాభివృద్ధిగా దిగజారుతోందని సర్వే సూచిస్తోంది.  గ్రామీణ ప్రాంతంలో 13.5 శాతం, పట్టణాల్లో 6.6 శాతం కాంగ్రెస్ పార్టీపై బీజేపీ ఆధిక్యంలో వుంది. రైతుల్లో బీజేపీకి 53.9 శాతం, కాంగ్రెస్ కు 37.4 శాతం ఓట్లు లభించవచ్చని సర్వే సూచిస్తోంది. 

నిజమే.. పీపుల్స్  పల్స్ సంస్థ   పల్స్ ఆఫ్ ది కర్ణాటక స్టేట్  సర్వే ద్వారా కర్ణాటక ప్రజల నాడి పట్టి చూసింది. అయితే.. కర్ణాటక తెలంగాణల మధ్య అనేక విషయాల్లో సారుప్యత ఉన్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కు కూడా ఇదో హెచ్చరికని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. గత ఎన్నికల్లోనూ తెలంగాణ కంటే ఐదారు నెలలు ముందు జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు.. ఐదారు నెలల తర్వాత జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపునకు ద్రోహదం చేసింది..  సో.. కర్ణాటక సర్వే కర్నాటకకే పరిమితం కాదు. తెలంగాణకుకూడా  ఒక సంకేతమే, ఒక  హెచ్చరికే అంటున్నారు.

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.