దట్టమైన పొగమంచు.. విమానరాకపోకలకు అంతరాయం
Publish Date:Jan 1, 2026
Advertisement
హైదరాబాద్ లో శుక్రవారం (జనవరి 2) ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. విజిబిలిటీ బాగా తగ్గిపోవడంతో పలు విమానాలు రద్దయ్యాయి. మరిన్ని ఫ్లైట్ లో ఆలస్యంగా నడుస్తున్నాయి. దట్టమైన పొగమంచు కారణంగా డిల్లీ నుంచి శంషాబాద్‌కు రావా ల్సిన, అలాగే శంషాబాద్ నుంచి డిల్లీకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని రద్దు చేసినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ముందస్తు సమాచారం లేకుండా ఈ విమానాలు రద్దు కావడంతో పలువురు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే శంషాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన, తిరుపతి నుంచి శంషాబాద్‌కు రావాల్సిన ఇండిగో విమానాలు పొగ మంచు కారణంగా ఆల స్యమయ్యయి. పరిస్థితి మెరుగు పడిన తర్వాతే విమానాలను అనుమతిస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు. అదలా ఉండగా.. హైదరాబాద్ శివారు ప్రాంతాలలో దట్టమైన పొగమంచు కారణంగా విజిబులిటీ బాగా తగ్గిపోయింది. రాజేంద్రనగర్, కిస్మత్‌పూర్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతాలలో విజిబులిటీ కేవలం పది అడుగుల మేరకే ఉండటంతో వాహనదారులు సైతం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఫాగ్ లైట్స్ వేసుకున్నప్పటికీ రహదారి స్పష్టంగా కనిపించని పరిస్ధితి నెలకొంది. ఒకవైపు రవాణా, విమాన సర్వీసులకు ఇబ్బందులు ఎదురైనా, మరోవైపు చల్లని వాతావరణంతో మార్నింగ్ వాకర్లు పొగమంచుతో కూడిన ఆహ్లాదకర వాతా వరణాన్ని ఆస్వాదించారు. పార్కులు, రహదారుల వెంట ఉదయపు నడకకు వచ్చిన వారు ప్రకృతి అందాన్ని ఎంజాయ్ చేస్తున్నామని చెప్పారు. .వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రాబోయే మూడు రోజులూ ఇదే పరిస్థితి నెలకొని ఉంటుంది.
http://www.teluguone.com/news/content/dense-fog-interupt-flights-in-shamshabad-airport-36-211873.html





