మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కీసర పోలీస్ స్టేషన్ పరిధి నాగారం సత్యనారాయణ కాలనీలో అర్ధరాత్రి పోలీసులు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్ సంచలనంగా మారింది. రహస్యంగా మేకలు, గొర్రెల వంటి మూగజీవాల రక్తాన్ని అక్రమంగా సేకరించి, బయటకు తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఓ మటన్ షాప్‌ను కేంద్రంగా చేసుకుని మూగజీవాల నుంచి అడ్డగోలుగా రక్తం సేకరిస్తూ, దాన్ని అక్రమంగా విక్రయిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయమైన సమాచారం రావడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అర్ధరాత్రి దాడులు నిర్వహించి... మటన్ షాప్ యాజమానితో పాటు నకిలీ వెటర్నరీ డాక్టర్‌ను కూడా అరెస్ట్ చేసి... వారి వద్ద నుంచి 180 రక్తం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ రక్తాన్ని ప్లేట్‌లెట్స్ తయారీతో పాటు కొన్ని వ్యాధులను నయం చేస్తామని నమ్మబలికి విక్రయిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చింది. అయితే సరైన వైద్య ప్రమాణాలు, అనుమ తులు లేకుండా ఇలా రక్తం సేకరించడం తీవ్రమైన నేరమని అధికారులు స్పష్టం చేశారు. అడ్డగోలుగా మేకలు, గొర్రెల నుంచి రక్తం తీసుకోవడం వల్ల అవి ఒక రోజు తర్వాత మృత్యువాత పడుతున్నాయని జంతు హక్కుల కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇది మూగజీవాలపై అమానుష చర్యగా పేర్కొంటూ, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఎవరిదైనా ప్రమేయం ఉందా? ఈ రక్తం ఎక్కడికి తరలించేవారు? ఎవరికెవరికీ సరఫరా చేసేవారు? అన్న కోణాల్లో పోలీసులు లోతైన దర్యాప్తు ప్రారంభించారు. అక్రమ రక్త వ్యాపారంపై ఉక్కుపాదం మోపుతామని, ఇటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను ఉపేక్షించబోమని పోలీసులు హెచ్చరించారు.ఈ ఘటనతో నాగారం సత్యనారాయణ కాలనీలో భయాందోళన వాతావరణం నెలకొంది. మూగజీవాల రక్షణకు కఠిన చర్యలు అవసరమన్న డిమాండ్ మరింత బలపడుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/medchal-malkajgiri-district-36-211982.html
అమెరికాలో తెలుగు యువతి నిఖిత హత్య కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శాసన మండలిలో భావోద్వేగానికి గురయ్యారు.
భారీ స్థాయిలో గ్యాస్ లీక్ అవుతుండటం, మంటలు ఎగసిపడుతుండటంతో కోనసీమ వాసులు భయాందోళనలతో వణికి పోతున్నారు.
కుటుంబ సభ్యుల హితవచనాలు రుచించని ఆ మైనర్లిద్దరూ ఇంట్లో వారికి చెప్పకుండా హైదరాబాద్ వచ్చి బంజారా హిల్స్ ప్రాంతంలో ఇళ్లు తీసుకుని సహజీవనం చేస్తున్నారు.ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వీరి వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
మదురోకు రక్షణగా ఉన్న తమ దేశ భద్రతా దళాలు అమెరికా కమెండోలను చివరి వరకు అడ్డుకున్నాయని వెల్లడించిన క్యూబా, వారు తమ బాధ్యతను అత్యంత గౌరవప్రదంగా, వీరోచితంగా నిర్వహించారని, ఆక్రమణదారులకు వ్యతిరేకంగా ప్రత్యక్ష పోరాటంలో, బాంబు దాడుల వల్ల వారు వీరమరణం పొందారని ఒక ప్రకటనలో పేర్కొంది.
కేరళ మలప్పురం జిల్లా కిళిస్సేరికి చెందిన అబ్దుల్ లతీఫ్ కుటుంబం దుబాయ్‌లో నివసిస్తోంది. వీరు తమ ఐదుగురు పిల్లలతో కలిసి అబుదాబిలో జరుగుతున్న ప్రసిద్ధ లివా ఫెస్టివల్ కు వెళ్లి తిరిగి దుబాయ్ వస్తుండగా షాహామా సమీపంలో వీరి వాహనం అదుపు తప్పి బోల్తా పడింది.
విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో సత్య దీపిక చికిత్స తీసుకుంటున్నారు. నిన్న అర్ధరాత్రి సమయంలో ఆమె కన్నుమూశారు. ఆ సమయంలో ఆమె భర్త ఒక్కరే ఆమె పక్కన ఉన్నారు.
ప్రాజెక్టు నిర్మాణ పనులను నేరుగా పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రాజెక్టు పనుల వేగం, నాణ్యత, గడువులపై అధికారులకు దిశానిర్దేశం చేస్తారు.
ధర్మబీర్ గోఖూల్ దంపతులకు దేవాలయ అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించారు.
కృష్ణ కిషోర్ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరంతా కలిసి కారులో ప్రయాణిస్తుండగా ఆ కారు ప్రమాదానికి గురైంది.
భూకంప తీవ్రత అసోంతో పోలిస్తే త్రిపురలో చాలా స్వల్పంగా ఉంది. త్రిపురలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.9గా నమోదైంది. ఇక పోతే మేఘాలయలోని పలు ప్రాంతాలలో కూడా భూమి స్వల్పంగా కంపించింది.
అమెరికా ఆయుధాల తయారీపై దృష్టి సారించింది. అప్పటి వరకూ వస్తు ఉత్పత్తిపైనే దృష్టి కేంద్రీకరించిన అమెరికా రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ కి తగిన బుద్ధి చెప్పాలన్న ఆలోచన కొద్దదీ.. ఆయుధాల తయీరీవైపు మళ్లింది. అణుబాంబు తయారు చేసి ఆ యుద్ధానికి బెస్ట్ ఫినిషర్ గా నిలిచింది.
అమెరికా అద్యక్షుడు ట్రంప్ దీన్ని అమెరికన్ సైనిక శక్తి అద్భుత ప్రదర్శనగా అభివర్ణిస్తూ తన భుజాలను తానే చరుచుకున్నారు. ఇక వెనుజులాలో అధికార మార్పిడి ప్రక్రియ పూర్తయ్యే వరకూ ఆ దేశాన్ని అమెరికాయే నడిపిస్తుందని ప్రకటించారు.