ఈ సృష్టి ఏటు దారితీసేనో....
Publish Date:Oct 3, 2012
Advertisement
లడఖ్‌లోని డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూట్ రిసెర్చ్ (డిఐహెచ్‌ఎఆర్) తీవ్ర చలిలోను తట్టుకోగల కొత్త సంకరజాతి ఆవులను, మేకలను అభివృద్ది చేసింది. అవసరాలకు తగినట్లుగా, సైనికులకు పుష్కలంగా మాంసాహారం, పాల ఉత్పత్తులను అందించే లక్ష్యంతో వీటిని వృద్ధి చేసింది. లడఖ్, హిమాలయాలు ఇతర చలి ప్రాంతాల్లో ఉన్న వాతవరణాన్ని ఇవి సమర్ధవంతంగా తట్టుకోగలవు. ఈ సంకరజాతి ఆవులు 25 లీటర్లపాలను ఇచ్చే సామర్ధ్యం ఉందని తెలిపింది. దీనివల్ల సైనికులు స్థానిక ప్రాంతాలపై ఆధారపడటం 25శాతం తగ్గిపోతుందని తెలిపింది. చాలా బావుంది. ఇప్పటికే వ్యవసాయానికి సంబంధించి ఎన్నిటినో సంకరంచేశారు. దీనివల్ల మిశ్రమ ఫలితాలు వచ్చాయని ఎంతోమంది అభిప్రాయపడ్డారు. ఇప్పుడు సంకరజాతి ఆవులు. ప్రయోగాలు చేయడం అధిక దిగుబడుల పేరుతో సంకరజాతి ఉత్పత్తులను సృష్టించడం. వాటిని సామాన్యులు వినియోగించడం. కొంతకాలం తర్వాత వాటి ఉత్పత్తులపై అనుమానాలు, పరిశోధనలు. ఈ ప్రయోగాల ఫలితాలు అన్నిటా మంచి ఫలితాలను ఇస్తే అందరికి సంతోషమే.. అలాకాకుండా కొద్దికాలమనంతరం వాటి ప్రభావం చూపితే అప్పటి పరిస్థితి ఏమిటి! ఇప్పటికే వ్యవసాయంలో సంకరజాతి విత్తనాలను వాడి, ఉపయోగించకూడని ఎరువులను వాడి భూమిలో సారం, పంటల దిగుబడి తగ్గిపోయింది. అటువంటిదే వీటి విషయంలోనూ జరిగితే... అన్నదే అన్నది సామాన్యుడి ప్రశ్న!
http://www.teluguone.com/news/content/defence-institute-of-high-altitude-research-(dihar)-24-17868.html





