భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు.. బండి సంజయ్

Publish Date:Apr 18, 2026

Advertisement

భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఏప్రిల్ 17  ఒక చీకటి రోజుగా  కేంద్ర  మంత్రి బండి సంజయ్ కుమార్ అభివర్ణించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి దేశంలోని కోట్లాది మంది మహిళల ఆకాంక్షలకు ప్రతిరూపమైన మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో  వ్యవహరించిన తీరు అత్యంత దారుణమని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించడం ద్వారా విపక్షాలు దేశంలోని ప్రతి తల్లిక, అక్కాచెల్లెళ్ల ను అవమానించాయని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఢిల్లీలో  మీడియాతో మాట్లాడిన బండి సంజయ్..  మహిళా హక్కుల విషయంలో విపక్షాల అసలు రంగు బయటపడిందన్నారు. 

మహిళా రిజర్వేషన్ల ప్రక్రియను అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ త కూట మి విషాన్ని కక్కిందన్న బండి సంజయ్..  చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం పెరగకూడదన్నదే ఆ  పార్టీల అసలు ఉద్దేశమని  ఆరోపించారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని, రాజకీయ స్వార్థం కోసం మహిళా హక్కులను కబళించడం క్షమించరాని పాపమనీ విమర్శించారు. దేశ మహిళలను ఓడించినందుకు ఈ కూటమి నేతలు సంబరాలు చేసుకుంటారా? అని  నిలదీశారు. మహిళల మనోభావాలను దెబ్బతీసినందుకు త్వరలో  ప్రజలే ఇండియా కూటమికి బుద్ధి చెబుతారన్నారు.

రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు ముమ్మాటికీ మహిళా ద్రోహులన్న బండి సంజయ్.. .  అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయని ఈ పార్టీలు, ఇప్పుడు మోదీ ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యత ఇస్తుంటే అడ్డంకులు సృష్టిస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మహిళా వ్యతిరేక ధోరణిని అవలంబిస్తోందన్న ఆయన.. గతంలో  మహిళా రిజర్వేషన్ల అంశాన్ని కాలయాపన చేస్తూ వంచించారని, ఇప్పుడు మళ్ళీ అదే పద్ధతిని కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా ప్రజలు ఛీ కొడుతున్నా ఇండియా కూటమి నేతలకు జ్ఞానోదయం కలగడం లేదని  ఎద్దేవా చేశారు.  తెలంగాణలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మహిళల పట్ల ఇదే విధమైన వివక్షను ప్రదర్శిస్తోందని ఆయన విమర్శించారు.

మహిళా శక్తి అంటే ఏమిటో చాటి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్న బండి సంజయ్.. రాబోయే ఎన్నికల్లో..  ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు  మహిళలు మహిళా రిజర్వేషన్ ను వ్యతిరేకించిన పార్టీలను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. మహిళల హక్కుల కోసం బీజేపీ కట్టుబడి ఉందనీ..  ఎన్ని అడ్డంకులు ఎదురైనా మహిళా రిజర్వేషన్ల సాధన దిశగా అడుగులు వేస్తామని స్పష్టం చేశారు.  

By
en-us Political News

  
ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సర్వం సిద్ధం
తెలంగాణలోని ఆహార భద్రతా కార్డు లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ నదీ జలాల వివాదం మరోసారి తీవ్ర రూపం దాల్చింది.
చనిపోయిందని వైద్యులు తేల్చేస్తే.. రోడ్డు గుంత ప్రాణం పోసింది..!
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసంరి లయన్స్.లక్ష కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ఈ వేలంలో ఏలూరు జిల్లా పరిధిలోని బొగ్గు గనుల బ్లాకులను రిలయన్స్ దక్కించుకోవడంతో ఇంకే మాత్రం జాగు లేకుండా ఈ బిగ్ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.
ఏపీలో 1.16 లక్షల కోట్ల అంచనా వ్యయంతో 270 ప్రాజెక్టులు రూపుదిద్దుకోనున్నాయని కేంద్ర నివేదిక పేర్కొంది.
కేవలం లైంగిక వేధింపులకే పరిమితం కాకుండా, రేగా కాంతారావు ఆర్థిక వంచనకు పాల్పడ్డారని బాధిత యువతి ఆరోపించింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మించి, తన వద్ద నుంచి రూ. 4 లక్షల నగదును తీసుకున్నారనీ, ఆ తర్వాత డబ్బుల గురించి, పెళ్లి విషయమై నిలదీయగా ముఖం చాటేశారని వివరించింది.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందినదిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాఘవ కన్‌స్ట్రక్షన్స్ సంస్థకు సంబంధించిన మానస హిల్స్ మైనింగ్ వ్యవహారంపై
ఒకప్పుడు హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ చుట్టుపక్కల ప్రాంతాల ఆర్థిక పరిస్థితిని ఎలా మార్చిందో.. అచ్చం అలాగే.. ఆ మాటకొస్తే అంతకు మించి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఉత్తరాంధ్రలో ఆర్థిక విప్లవాన్ని తీసుకురాబోతోంది.
బజాజ్ ఫైనాన్స్ క్యూ1 ఆర్థిక ఫలితాల్లో రూ. 5,986 కోట్ల నికర లాభం సాధించడంతో షేరు ధర 6% పైగా దూసుకెళ్లింది. మోతీలాల్ ఓస్వాల్ బై రేటింగ్ ఇచ్చి రూ. 1,300 టార్గెట్ ధార్యాన్ని ప్రకటించిన వేళ సమగ్ర విశ్లేషణ.
Google DeepMind విడుదల చేసిన Gemini Robotics 2.0 సాంకేతికత, 92% విజయవంతమైన హోల్ బాడీ కంట్రోల్, అధునాతన సేఫ్టీ బెంచ్‌మార్క్స్ మరియు విప్లవాత్మక ఫీచర్లతో రోబోటిక్స్ రంగాన్ని ఎలా మార్చేస్తుందో పూర్తిగా తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.