Publish Date:Apr 18, 2026
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఓ వైపు శాంతి చర్చలు జరుగుతున్నా.. కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నా యుద్ధ భయం మాత్రం తొలగడం లేదు. ముఖ్యంగా అమెరికా విధానాలు, తీసుకుంటున్న నిర్ణయాలు అగ్నికి ఆజ్యంపోసినట్లు ఉంటున్నాయి. శాంతిని నెలకొల్పాల్సిన అగ్రరాజ్యం యుద్ధాన్ని ప్రోత్సహించేలా వ్యవహరిస్తున్న తీరు పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇరాన్ విషయంలో అమెరికా అంచనాలు తలకిందులవ్వడంతో ట్రంప్ సంయమనం కోల్పోయినట్లు కనిపిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇరాన్ సైనిక శక్తిని, ఆ దేశ అంతర్గత పటుత్వాన్ని అగ్రరాజ్యం అంచనా వేయడంలో పూర్తిగా విఫలం అయ్యింది. ఏళ్ల తరబడి విధిస్తున్న ఆర్థిక ఆంక్షలు, అంతర్గత తిరుగుబాట్లతో ఇరాన్ బలహీనపడిందన్న గుడ్డి నమ్మకంతో అమెరికా దుందుడుకుగా వ్యవహరించి దెబ్బతిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.
అమెరికా తన మిత్రదేశమైన ఇజ్రాయెల్ ప్రయోజనాల కోసం వ్యవహరిస్తున్న తీరు మొత్తం ప్రపంచాన్నే ఇబ్బందుల్లోకి నెట్టేసిందంటున్నారు. ముఖ్యంగా లెబనాన్, ఇజ్రాయిల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి మధ్యవర్తిగా వ్యవహరించి సక్సెస్ అయిన తరువాత కూడా ఇరాన్ విషయంలో అగ్రరాజ్యాధినేత ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింతగా ముసురుకోవడానికి కారణమౌతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేసినట్లు ఇరాన్ ఇలా ప్రకటించిందో లేదు.. అలా టంప్ మళ్లీ తన వాచాలతను ప్రధర్శించారు.
ఇరాన్ జలసంధిని ఓపెన్ చేసినందుకు ఆ దేశానికి థ్యాంక్స్ చెబుతూనే.. తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్ లో హర్మూజ్ పై అమెరికా నౌకా దిగ్బంధనం కొనసాగుతుందని పేర్కొనడం ద్వారా ఇరన్ ను రెచ్చగొట్టారు. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్లైంది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా మారుతుందన్న అనుమానాలు, ఆందోళన ప్రపంచ దేశాలలో వ్యక్తమౌతోంది. మిత్రదేశాల నుంచి అందుతున్న హెచ్చరికలను, ప్రపంచ దేశాల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని అమెరికా వెనక్కి తగ్గితేనే పశ్చిమాసియాలో శాంతి సాధ్యమవుతుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/trumps-unchanged-stance-36-217654.html
ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామిక హబ్ శ్రీసిటీ లో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నందుకు షోలమ్ గ్రూప్ యాజమాన్యానికి ధ్యాంక్స్ చెప్పిన లోకేష్.. ఈ ప్లాంట్‌కు సంబంధించిన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ నాట్ బ్రంట్ అసాధారణ పోరాట పటిమను కనబరిచి.. కేవలం 53 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఫ్రేయా కెంప్ కూడా 28 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.
బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్దం చేసుకున్న తారిఖ్.. దుండగుడిని గట్టిగా ప్రతిఘటించాడు. దీంతో ఆ దుండగుడు తుపాకీతో తాఱీఖ్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తారిఖ్ అక్కడికక్కడే మరణించాడు.
ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు.. టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు తెగబడ్డారు. అన్బ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే సామాన్య పౌరుడు మరణించాడు. మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
క్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ==
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్‌ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్‌తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ (కన్నేపల్లి) పంప్ హౌస్ వేదికగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.