చెప్పేదొకటి... చేసేదొకటి...
Publish Date:Sep 24, 2012
Advertisement
సామాన్యుడి భవిష్యత్ ఇక అంతా అంధకారమేనేమో. భవిష్యత్ అంతా దుర్భరమే. ఎందుకంటే నిత్యావసరాలు ఆకాశంలో చుక్కలు చూపిస్తుంటే... పెంచిన, పెంచబోయే విద్యుత్ ఛార్జీలు ఇంటల్లా అంధకారం చేస్తే...బ్రతుకుతెరువు కోసం ఉదయం లేచింది మొదలు పరుగులుపెట్టే సామాన్య, మధ్యతరగతి కుటుంబీకులు బస్‌ఛార్జీల మోతకు కుదేలవుతున్నారు. ఎన్నికల వరకు చెప్పేది ఒకటి.... ఎన్నికల అనంతరం చేసేది మరొకటి. పొంతనలేని వాగ్దానాలు. ఏమాత్రం నిజాయితీలేకుండా లక్షలాదిమంది ప్రజలకు అబద్ధాలు చెప్పే నేతలకు రాజ్యాంగరీత్యా రాజకీయ శిక్షలు విధించాలి. అప్పుడే నిజాన్ని, నిజాయితీగా ఒప్పుకుంటారు. లేదంటే మమ్మల్ని గెలిపిస్తే మీ పసిపిల్లలకు ప్రత్యేక రక్షణ కల్పిస్తాం. వాళ్ళు పెద్దవాళ్లయి ఉద్యోగాలకు తిరగకుండా ఇప్పటినుండే వారి పేరుమీద ప్రభుత్వమే డబ్బులు డిపాజిట్‌చేసి మేజర్ అయిన తర్వాత ఆ డబ్బును వారు ఎక్కడ వున్నా తిరిగి ఇవ్వడం, లేదంటే వారికి సరిపడ ఉద్యోగం ప్రభుత్వమే చూపించడం జరుగుతుందంటూ వాగ్ధానాలు కూడా చేసేస్తారు. ఇక బస్సులపై ప్రయాణాలు మానేసి, ప్రభుత్వ అనుమతి తీసుకుని ఎడ్లబండ్లు, గుర్రపు బండ్లపై ప్రయాణం చేయడమే శ్రేయస్కరం. కొద్దిదూరాలయితే శ్రమఅయినా సైకిల్‌కు ఓ డ్రైవర్‌ను పెట్టుకుని ప్రయాణంచేయడం బెటర్. భవిష్యత్ భారతం ఇంతేనేమో.
http://www.teluguone.com/news/content/daily-consumables-rates-hiked-24-17651.html





