Publish Date:Oct 12, 2019
విశాఖలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ కుటుంబం ఆత్మహత్య కోసం ఏకంగా గ్యాస్ సిలిండర్ ను ఉపయోగించింది. సిలిండర్ పేలి ముగ్గురు మరణించడం ఒకరికి తీవ్ర గాయాలు అవడంతో మొదట అది ప్రమాదమనుకున్నారు. కాని కాదు ఓ కుటుంబం గ్యాస్ సిలిండర్ పైప్ ను కట్ చేసి ప్రమాదాన్ని సృష్టించుకున్నారు. ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఇదే ఇప్పుడు కీలకాంశం.విశాఖ నగరంలోని సాగర్ నగర్ గుడ్లవాని పాలెంలో జరిగింది ఈ ఘటన. హెచ్ఐజీ 101 ఫ్లాట్ లో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి ఉమామహేశ్వరరావు, కుమార్తె లావణ్య, కొడుకు సతీష్ చంద్ర అద్దెకుంటున్నారు. ఇరుగుపొరుగుతో పెద్దగా ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు.అర్ధరాత్రి సడెన్ గా గ్యాస్ సిలెండర్ పేలడం తో హుటాహుటిన ఫైర్ సేఫ్టీని పిలిపించారు. అప్పటికే లావణ్య చనిపోయింది. కొన ఊపిరితో ఉన్న సతీష్ చంద్రను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.ఇక ఉమామహేశ్వరరావు చికిత్స పొందుతూ చనిపోయాడు.గ్యాస్ పేలినప్పుడు సౌండ్ వంద మీటర్ ల వరకూ వినిపించింది. అద్దాలు పగిలి ఎగిరిపడ్డాయి. పొరుగిళ్ల కిటికీలు కూడా ధ్వంసమయ్యాయి.పిల్లలు ఇద్దరు కూడా ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అయితే గత ఉమామహేశ్వర రావ్ కొంత కాలంగా డిప్రెషన్ లో ఉన్నట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. ఎందుకు వారి కుటుంబం ఇంత దారుణానికి పాలైందో తెలియక ఇరుగు పొరుగు అయోమయంలో ఉన్నారు. ఒక్కసారీగా ఇంత పెద్ద ఎత్తున ఎగిసిపడిన భారీ మంటలకు మరియు భారీగా వచ్చిన శబ్దాలకు పక్కన ఇళ్ళ వస్తువులు,అద్దాలు,కిటీకీలు కూడా ధ్వంశం అవ్వడం చూసి అక్కడి ప్రజలు భయబ్రాంతులకు గురైయ్యారు.ఇక పోలీసుల విచారణలో అసలు నిజాలు వెలుగులో రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cylinder-explosion-kills-three-in-visakhapatnam-25-89976.html
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.